Saturday, January 11, 2025
Home Blog Page 25

అగ్ని ప్రమాద కుటుంబాలకు రెడ్ క్రాస్ సొసైటీ చేయూత

విశాలాంధ్ర- సంతకవిటి/రాజాం (విజయనగరం జిల్లా ): సోమవారం ఉదయం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయనగరం,శ్రీకాకుళం జిల్లా శాఖ వారు సిరిపురం గ్రామం, సంతకవిటి మండలం నందు అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సహాయ సామగ్రి అయిన కిచెన్ సెట్లు, టారపలిన్ షీట్స్, దోమతెరలు, చీరలు, తువ్వాలు, ఉన్ని దుప్పట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోని పి జగన్మోహన్ రావు, రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్, ద్వారా పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సంతకవిటి మండలం తాసిల్దార్ సత్యం, కొల్ల అప్పలనాయుడు, గట్టి భాను, విజయనగరం రెడ్ క్రాస్ ప్రతినిధులైన కొత్త సాయి ప్రశాంత్ కుమార్, పెంకి చైతన్య కుమార్, గోవిందరాజులు, సత్య రామ్, సుధాకర్ గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు…

బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

ఈ నెల 4న పుష్ప‌2 ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న, న‌టుడు అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. ఈరోజు మంగ‌ళిగిరిలో జ‌న‌సేనాని మీడియాతో చిట్‌చాట్‌లో ఆయ‌న‌ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారని ప‌వ‌న్ పేర్కొన్నారు.ఁబ‌న్నీ విష‌యంలో తెర ముందు, వెనుక ఏం జ‌రిగిందో నాకు తెలియ‌దు. ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో పోలీసుల‌ను త‌ప్పుప‌ట్ట‌ను. చ‌ట్టం అంద‌రికీ స‌మానమే. పోలీసులు త‌ప్ప‌కుండా భ‌ద్ర‌త గురించి ఆలోచిస్తారు. థియేట‌ర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయ‌న కూర్చున్నాక చెప్పి తీసుకెళ్లాల్సింది. చెప్పినా ఆయ‌న‌కు ఆ అరుపుల్లో స‌రిగా వినిపించ‌క‌పోవ‌చ్చు. అల్లు అర్జున్ త‌ర‌ఫున బాధిత కుటుంబం వ‌ద్ద‌కు ముందే వెళ్లి ఉండాల్సింది. చిరంజీవి కూడా గ‌తంలో ఫ్యాన్స్‌తో క‌లిసి థియేట‌ర్‌లో సినిమాలు చూసేవారు. కానీ, ఆయ‌న ముసుగు వేసుకుని ఒక్క‌రే థియేట‌ర్‌కు వెళ్లేవారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి వ‌చ్చిన గొప్ప నాయ‌కుడు. వైసీపీ విధానాల త‌ర‌హాలో అక్క‌డ ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌లేదు. ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు అవ‌కాశం ఇచ్చారుఁ అని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పుకొచ్చారు.

బీహార్ లో విద్యార్థులు, పోలీసుల మధ్య గొడవ.. ప్రశాంత్ కిశోర్‌పై కేసు

0

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఆయన పార్టీ జన్‌సురాజ్ నేతలు, కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు, మరో 700 మంది గుర్తుతెలియని ఆందోళనకారులపై బీహార్‌లో కేసు నమోదైంది. అనధికారికంగా గుమికూడటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి అభియోగాలు వారిపై నమోదయ్యాయి. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో 70వ కంబైన్డ్ కాంపిటెటివ్ ఎగ్జామ్‌ను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులు పాట్నాలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గాంధీ మైదాన్ వద్ద సమావేశమైన వారంతా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశం కావాలని భావించారు. విద్యార్థుల ఆందోళనకు ప్రశాంత్ కిశోర్ మద్దతు ప్రకటించారు. వారి మార్చ్‌లో ఆయన కూడా పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతినిధులు చీఫ్ సెక్రటరీని కలుస్తారని ప్రకటించారు. కానీ, విద్యార్థులు మాత్రం సీఎంను తప్ప మరెవరినీ కలిసేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఇది పోలీసు చర్యకు దారితీసింది. ఆ తర్వాత అది హింసాత్మకంగా మారింది. పోలీస్ లౌడ్ స్పీకర్లను విరగ్గొట్టిన ఆందోళనకారులు కలెక్టర్లు, పోలీసు అధికారులతో గొడవకు దిగారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు ఉపయోగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, నిరసనకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాయిదా

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటకు, రేవతి మరణానికి కారణమయ్యారనే కేసులో పోలీసులు హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కౌంటర్ దాఖలు చేయాలంటూ నాంపల్లి కోర్టు చిక్కడపల్లి పోలీసులకు సూచించింది. ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ను ఏ11 నిందితుడిగా చేర్చారు. తాజాగా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిశీలించింది. బెయిల్ కోసం అల్లు అర్జున్ న్యాయవాదులు, ఇవ్వొద్దని పోలీసుల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు.. జనవరి 3న తీర్పు వెలువరిస్తామని చెబుతూ కేసును వాయిదా వేసింది.

గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. 43 మంది మృతి

హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఉత్తర గాజాలోని హమాస్ చివరి కమాండ్ కంట్రోల్‌గా భావిస్తున్న కమల్ అద్వాన్‌ ఆసుపత్రిపై నిన్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) భీకర దాడులు జరిపింది. అలాగే, జబాలియా, హోనస్, లాహియా ప్రాంతాల్లోనూ దాడులకు దిగింది. ఈ దాడుల్లో మొత్తంగా 43 మంది మృతి చెందారు. ఆసుపత్రిపై జరిగిన దాడిలో 20 మంది హమాస్ ఫైటర్లు హతమయ్యారు. అలాగే, వైద్యులు, వైద్య సిబ్బంది సహా 240 మందిని నిర్బంధించింది. బందీల్లో ఆసుపత్రి డైరెక్టర్ అబూ సాఫియా కూడా ఉన్నారు. బందీల కళ్లకు గంతలు కట్టి ఆసుపత్రి ప్రాంగణంలో కూర్చోబెట్టడంతోపాటు, ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారిని పెడరెక్కలు విరిచికట్టి అర్ధనగ్నంగా కూర్చోబెట్టిన వీడియోలు, ఫొటోలను స్థానిక మీడియా ప్రచురించింది. కాగా, హమాస్‌ అతిపెద్ద కమాండ్ కంట్రోల్ ఈ ఆసుపత్రిలోనే ఉందని, అక్కడి నుంచే ఇజ్రాయెల్‌పై దాడులకు వ్యూహరచన చేస్తున్నట్టు ఇజ్రాయెల్ ఆర్మీ అనుమానిస్తోంది. తాజాగా బందీలుగా పట్టుబడిన వారిలో ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న దాడిచేసిన ఉగ్రవాదులు కూడా ఉన్నారని, షకీద్ బెటాలియన్‌కు చెందిన హమాస్ ఫైటర్లు వీరిలో ఎక్కువమంది ఉన్నారని ఐడీఎఫ్ ప్రకటించింది. కాగా, ఆసుపత్రిలోని నిజమైన రోగులను చికిత్స కోసం సురక్షితంగా ఇండోనేషియా ఆసుపత్రికి తరలించినట్టు వివరించింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి గ్రహీత జిమ్మీ కార్టర్ మృతి..

అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి గ్రహీత జిమ్మీ కార్ట‌ర్ (100) క‌న్నుమూశారు. కార్టర్ జార్జియాలోని ప్లెయిన్స్‌లో ఉన్న‌ తన నివాసంలో ఆయ‌న తుదిశ్వాస విడిచినట్లు కార్ట‌ర్‌ ఫౌండేషన్ తెలిపింది. కాగా, ఆయ‌న 1977 నుంచి 1981 వరకు యూఎస్‌కి 39వ అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు.ఁనా తండ్రి నాకు మాత్రమే కాదు, శాంతి, మానవ హక్కులు, నిస్వార్థ ప్రేమను విశ్వసించే ప్రతి ఒక్కరికీ హీరోఁ అని ఆయ‌న కుమారుడు చిప్ కార్టర్ తెలిపారు. 1924 అక్టోబ‌ర్ 1న జ‌న్మించిన జిమ్మీ కార్ట‌ర్‌.. ఈ ఏడాది త‌న వందో బ‌ర్త్‌డేను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఇక ఆయ‌న యూఎస్ అధ్య‌క్షుడిగా ప‌నిచేసి, వందేళ్లు జీవించిన వ్య‌క్తిగానూ నిలిచారు. అధ్య‌క్షుడిగా తన సింగిల్ టర్మ్‌లో మానవ హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాల‌పై కార్టర్ నిబద్ధతతో ఉన్నారు. ఇజ్రాయెల్-ఈజిప్ట్ మధ్య క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ అని పిలిచే శాంతి ఒప్పందం ఏర్పడడంలో మధ్యవర్తిత్వం వ‌హించారు. ఇక 1980లో ఆయ‌న ప‌ద‌వీకాలంలో ఇరాన్‌లో బందీగా ఉన్న‌ 52 మంది అమెరికన్లను విడిపించ‌డంలో విఫలయత్నం అనేది మాయనిమచ్చగా మిగిలిపోయింది. అదే ఏడాది నవంబరులో రిపబ్లికన్ పార్టీకి చెందిన‌ రోనాల్డ్ రీగన్ ఎన్నికలలో కార్టర్‌ను ఓడించారు. అధ్యకుడిగా దిగిపోయిన త‌ర్వాత‌ 1982లో ఃకార్టర్ సెంటర్‌ఃను స్థాపించారాయ‌న‌. సామాజిక, ఆర్థిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి అవిశ్రాంతంగా శ్ర‌మించిన కార్ట‌ర్‌కు 2002 నోబెల్ శాంతి బహుమతి వ‌రించింది. న్యాయం, ప్రేమ వంటి ప్రాథమిక క్రైస్తవ సిద్ధాంతాలు తన అధ్యక్ష పదవికి పునాదిగా నిలిచాయని ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌న చెప్పారు. నేవీ ఉద్యోగిగా, గ‌వ‌ర్న‌ర్‌గా, అధ్యక్షుడిగా అన్నింటికీ మించి ఓ మాన‌వ‌తావాదిగా ప్రంప‌చానికి జిమ్మీ కార్ట‌ర్ సుప‌రిచితులు. కాగా, ఆయ‌న భార్య రోసలిన్ (96) 2023 నవంబర్ 19న మరణించారు.

ఏపీ కొత్త‌ సీఎస్‌గా విజ‌యానంద్ ఖ‌రారు

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
రేపటితో ముగియనున్న ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం
ఆయ‌న స్థానంలో నూత‌న సీఎస్‌గా విజ‌యానంద్ నియామ‌కం

ఏపీ ప్రభుత్వ కొత్త‌ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. దాంతో నూత‌న సీఎస్‌గా విజ‌యానంద్‌ను స‌ర్కార్ నియమించింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈయన వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. కాగా, విజయానంద్ ఇంత‌కుముందు 2022లో ఏపీ జెన్ కో ఛైర్మన్‌గా.. 2023లో ఏపీ ట్రాన్స్ కోకు సీఎండీగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలి.. పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో ప్రతిపాదన

వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల కన్నుమూసిన భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం ాభారత రత్న్ణ ప్రకటించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి విపక్ష బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలియజేసేందుకు తెలంగాణ అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదారని ప్రశంసించారు. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధిబాట పట్టించారని కొనియాడారు. దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని, వరుసగా రెండు పర్యాయాలు ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్‌గా ఎనలేని సేవలు అందించారని రేవంత్ గుర్తుచేశారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేశారని చెప్పారు. దేశానికి విశిష్ట సేవలు అందించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. విపక్షనేత, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని ప్రకటించారు. దేశ అత్యున్నత పౌరపురస్కారానికి మన్మోహన్ సింగ్ పూర్తి అర్హులు అని పేర్కొన్నారు.

పారామెడికల్ సిబ్బందితో నెలవారి సమీక్ష

విశాలాంధ్ర -అనంతపురం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నందు కుష్టు వ్యాధి విభాగం జిల్లా అధికారి డా అనుపమ జేమ్స్ అధ్యక్షతన జిల్లాలోని డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్లకు నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా డా అనుపమ జేమ్స్ మాట్లాడుతూ… జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ల పరిధి నందు కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించాలని ప్రతి ఒక్క కేసును తొలిదశలోనే గుర్తించడం వల్ల. అంగవైకల్యం నుంచి రక్షించవచ్చు అన్నారు. కుష్ఠు వ్యాధి గురించి ప్రజలకు ఉన్న అనుమానాలు అపోహలు ను అవగాహనా కార్యక్రమాలు ద్వారా తొలగించాలని తెలిపారు.
ముక్యంగా కుష్ఠు వ్యాధి అతి సాధారణ మైనదని. కుష్ఠు వ్యాధి ఏ దశలో వున్నా 6 నెలలు , లేదా 12 నెలలు. బహుళ ఔసుధ చికిత్సతో నయమతుందని తెలిపారు. అలాగే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల నందు మందులు ఉచితంగా లభిస్తాయని తెలిపారు. కుష్ఠు వ్యాధి వల్ల స్పర్శ కోల్పోయీ అంగవైకల్యం ఏర్పడి వారు జిల్లా కుష్ఠు వ్యాధి అధికారి సంతకంతో ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టు కొంటె 6 వేల రూపాయల పెన్షను పొందవచ్చని అలాంటి అర్హత కలిగిన వారిని గుర్థించి వారికీ సహకరించాలని సిబ్బందిని కోరారు. అంగవైకల్యం ఉన్నవారికి శాస్ర చికిత్సలు ద్వారా నయం చేయడం జరుగుతుందని తెలిపారు .
ఈ సమావేశం నందు సిబ్బంది డా గంగాధర్ రెడ్డి , డా శివారెడ్డి ,పారామెడికల్. అధికారి. నాగన్న , హెఛ్ ఈ ఓ. సత్యనారాయణ , పారామెడికల్ అధికారులు , రాముడు
ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

నిరుద్యోగ సమస్యలు పరిష్కరించండి

రాప్తాడు నియోజకవర్గం ఏఐవైఎఫ్ సమితి సమావేశంలో సిపిఐ కార్యదర్శి సి. జాఫర్..
విశాలాంధ్ర- అనంతపురం : నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని ఏఐవైఎఫ్ మాజీ జిల్లా నాయకులు ప్రస్తుత సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పేర్కొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య రాప్తాడు నియోజకవర్గం మహా సభ అనంతపురం సీపీఐ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐవైఎఫ్ నియోజివర్గ కార్యదర్శి దనుజయ అధ్యక్షత వహించారు సమావేశ ముఖ్య అతిథిలుగా సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సహాయ కార్యదర్శి మల్లికార్జున, కార్యదర్శివర్గ సభ్యులు రామకృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ అధ్యక్షులు ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మాజీ జిల్లా నాయకులు సీపీఐ జిల్లా కార్యదర్శి సీ.జాఫర్ మాట్లాడుతూ… వెనుకబడిన జిల్లాల నిరుద్యోగులకు ఏ ప్రభుత్వం వచ్చిన తీవ్ర అన్యాయం జరుగుతుందని చదువుకున్న విద్యార్థులకు సరైన ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు లేక జిల్లాల నుండి వలసలు పోతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలు వలసలకు పోయి చాలీచాలని జీతాలతో ఒక పూట తింటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశంలో పాలకవర్గ విధానాల వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందని. రాష్ట్రంలో మంచినీళ్లు కొరత ఉందేమో గాని మందు కొరత లేదని యువత గంజాయి డ్రగ్స్ వాడకంలో తలను నాశనం చేసుకుంటున్నారని డ్రగ్స్ గంజాయి నియంత్రణలో ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందిందన్నారు . యువతను సన్మార్గంలో నడిచే విధంగా అఖిలభారత యువజన సమాఖ్య రాబోయే రోజుల్లో పని చేయాలని కోరారు యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మాజీ ఏ ఐ వై ఫ్ జిల్లా నాయకులు మల్లికార్జున, కార్యదర్శి వర్గ సభ్యులు రామకృష్ణ మాట్లాడుతూ… యువతకు ఉపాధి దొరకకపోవడంతో దేశంలో ప్రతి రోజు 40 నుంచి 45మంది వరకు నిరుద్యోగులు స్వయం ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి అని తెలిపారు. విద్య ,వైద్యం, ఉపాధి ,భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులు గా గుర్తించినా విద్య ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వ్యాపారంగా మారిందని వైద్యం మాఫియా వల్ల అందరికీ అందడంలేదని చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదని ఆరోపించారు. నూతన పరిశ్రమలలో యువతకు ఉపాధి, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చేయాలని కోరారు. ఏ ఐ వై ఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ… రాయదుర్గంలో నిర్వహించబడుతున్న ఏఐవైఫ్ 20 జిల్లా మహాసభల్లో రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలనీ, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నిరుద్యోగ భృతి ఇవ్వాలని , ప్రభుత్వా శాఖల్లో ఖాళీ ఉన్నా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలనీ అన్నారు. ఎన్నో పోరాట ఫలితంగా సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటికరణ కు వ్యతిరేకంగా మహిళలపై జరుగుతున్న దాడులకు ,వివిధ సామాజిక ,ఆర్థిక రాజకీయ, నూతన పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. కియా పరిశ్రమల్లో 70 శాతం మంది ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అంశాలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచర రూపొందించడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం అనంత జిల్లా ఏఐవైఎఫ్ రాప్తాడు నియోజకవర్గం నూతన సమితి అధ్యక్షుడు హరీష్, ఉప్పధ్యక్షులు మధు,గురు మోహన్, మణికంఠ, ప్రధానకార్యదర్శి ధనుజయ, సహాయ కార్యదర్శిలు శ్యామ్ ప్రసాద్, వంశీ, చందు 15 మంది తో కౌన్సిల్ సభ్యులను ప్రతిపాదన చేశారు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఆత్మకూరు మండల సహాయ కార్యదర్శి సనప రామకృష్ణ, మాజీ ఏ ఐ వై ఫ్ నాయకులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..