జిల్లా స్థాయి అధికారులు
విశాలాంధ్ర ధర్మవరం;; నూతన సంవత్సరం 2025.. జనవరి ఒకటో తేదీన రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఆ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ లు విజయవంతం చేయాలని ధర్మవరం ఎంఈఓ గోపాల్ నాయక్, డిఇఓ క్రిష్టప్ప, ఏడి-1 నాగరాజు, డివి ఈవో రఘునాథ్ రెడ్డి, ఏడి-3 నజ ర్, సూపర్టెండెంట్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు కొత్తచెరువులో ధర్మవరం ఎంఈఓ గోపాల్ నాయక ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజనం పెట్టడం అనేది సంతోషించదగ్గ విషయమని, ఇందులో భాగంగా పాఠశాల హెడ్మాస్టర్లు ప్రిన్సిపాల్ లు ఇద్దరిని ఎంఈఓ అధికారి అందరూ కోఆర్డినేట్ చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వారు సమావేశంలో తెలియజేశారు. అంతేకాకుండా గ్రౌండ్ లెవెల్ లో ఉన్న సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకొని పోయి, సమస్యలు పరిష్కారమయ్యేలా సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ అందరూ కూడా మధ్యాహ్న భోజనం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం విజయవంతం చేయండి..
గుర్తు తెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ తెలపాలని వన్ టౌన్ సిఐ ప్రకటన
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని దుర్గా నగర్ బ్రిడ్జి కింద గురువారం రాత్రి సమయంలో మద్యం తాగి, మృతి చెందడం జరిగిందని, వయసు దాదాపు 50 సంవత్సరాలు పైబడి ఉంటుందని, ఆచూకీ తెలిసినవారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో తెరపాలని సిఐ రెడ్డప్ప తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత సాధారణ మృతి గా ఉన్నదని, వివిధ వాట్సాప్లకు, సోషల్ మీడియాకు వివరాలు తెలపడం జరిగిందన్నారు. వాచూకీ తెలిసినవారు సెల్ నెంబర్ 6305800429 కు గాని 9704972324 కు గాని తెలపాలన్నారు.
విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి…
భారీ ర్యాలీ నిర్వహణ
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ధర్మవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ ఎస్బిఐ కాలనీ లోని కేతిరెడ్డి ఇంటి నుండి కాయగూరల మార్కెట్ వద్ద గల విద్యుత్ శాఖ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నిరసన ధ్వనులతో కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం విద్యుత్ శాఖ ఏ డి ఈ లక్ష్మీనరసింహారెడ్డి కు వినతి పత్రాన్ని అందజేస్తూ సామాన్య ప్రజల పైన భారం పడకుండా చేస్తూ న్యాయం చేయాలని వారు కోరడం జరిగింది. అనంతరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా పోరు బాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన ర్యాలీ జరిగిందని, ఇందులో భాగంగా ధర్మారంలో కూడా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నాను నిర్వహించడం జరిగిందని తెలిపారు.ట్రూ ట్రాప్ చార్జీల పేరుతో పేద ప్రజలపై భారాన్ని మోపడం సరైన పద్ధతి కాదు అని తెలిపారు. చార్జీల పెంపుపై తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కుంగలో తొక్కి, హామీల విషయం మరవడం దారుణమని వారు దుయ్యబట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు తప్పుడు హామీలు ఇచ్చి అధికారం చేపట్టడం జరిగిందని తెలిపారు. విద్యుత్ చార్జీల పేరిట ప్రజలపై 15000 కోట్ల రూపాయలు భారం వేయడం ఎంతవరకు సమంజసం అని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో విద్యుత్ అవసరాల నిమిత్తం కొనుగోలును అధిక ధరకు కూడా కొనుగోలు చేయడం సమంజసమేనా??? అని ప్రశ్నించారు. ప్రజలను దగా చేయడం మోసపుచ్చడం ఎన్డీఏ ప్రభుత్వానికి అలవాటైందని తెలిపారు. ఇకనైనా ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైనదని వారు పిలుపునిచ్చారు. ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన చార్జీలను తగ్గించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు సల్ఫీ ప్రజలకు న్యాయం చేకూర్చుతామని తెలిపారు. రాష్ట్ర ప్రజల్ని మభ్య పెట్టడంలో చంద్రబాబుకు సాటి ఎవరూ లేరని తెలిపారు. పెంచిన విద్యుత్ చార్జీల భారం కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు, చేనేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి, తాడిమర్రి ఎంపీపీ పార్టీలు భువనేశ్వర్ రెడ్డి, గుర్రపు శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ రావులచెరువు ప్రతాపరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వేముల జయరాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు బాల్రెడ్డి ,మాజీ వైస్ చైర్మన్ మాసపల్లి సాయికుమార్, చందమూరి నారాయణరెడ్డి ,పెనుజూరు నాగరాజు, కౌన్సిలర్లు మేడాపురం వెంకటేశు, గోరకాటి పురుషోత్తం రెడ్డి, అత్తర్ జిలాన్, కే తా లోకేష్ ,బడన్నపల్లి కేశవరెడ్డి ,వార్డు ఇన్చార్జులు కత్తి పెద్దన్న, చెలిమి పెద్దన్న కేశగాల్ల కృష్ణ, సుభాన్ భాష, నియోజకవర్గ కన్వీనర్లు, విద్యార్థి సంఘం నాయకులు పురుషోత్తం, రాజశేఖర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గొలుసు దొంగ అరెస్ట్.. డి.ఎస్.పి శ్రీనివాసులు
రెండు జతల బంగారు కమ్మలు, బంగారు చైను లు స్వాధీనం..
కేసు నమోదు చేసిన వన్టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కళా జ్యోతి సర్కిల్, అంజుమాన్ సర్కిల్ నందు మహిళలకు మాయమాటలు చెప్పి వారి వద్ద బంగారము గొలుసు బంగారం కమ్మలు దొంగలించుకొని వెళ్లిన దొంగ సాకే నారాయణ.. కేతిరెడ్డి కాలనీ అరెస్టు చేసినట్లు డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రామగిరి మండలం నరసన్నకోట గ్రామానికి చెందిన సాకే నారాయణ, ప్రస్తుతం ధర్మవరం లోని కేతిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు అని తెలిపారు. మహిళలకు మాయమాటలు చెప్పి మహిళల దగ్గర గల బంగారు గొలుసులను దొంగలించడం, తాళం వేసిన ఇళ్లపై దృష్టి పెట్టి దొంగతనాలు చేయడం సాకే నారాయణకు అలవాటుగా మారిందని తెలిపారు. అంతేకాకుండా ఎల్సికే పురం నందు రాత్రి సమయాలలో ఇంటి తాళాన్ని పగలగొట్టి ఇంటిలో ఉన్న బంగారు వస్తువులను దొంగలించకపోవడం జరిగిందని తెలిపారు. తదుపరి సాకే నారాయణ ను శుక్రవారం ఉదయం ఎర్రగుంట సర్కిల్ వద్ద వన్టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ ఎస్ఐ గోపి కుమార్ స్టేషన్ సిబ్బంది శివకుమార్ శివశంకర్ భాస్కర్ సహాయములతో దాడి చేసి, అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. దొంగ సొత్తును పైకేసులలో ముందు చర్య నిమిత్తం స్వాధీన పరుచుకొని ముద్దాయిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ముద్దాయి నుండి రెండు జతల బంగారు కమ్మలు సాదా కమ్మలు ఒక బంగారు చైనులు 2, మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ నాగేంద్రప్రసాద్ను ,ఎస్సై గోపి కుమార్ను, స్టేషన్ సిబ్బంది శివకుమార్, శివశంకర్, భాస్కర్లను అభినందించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు): మండల పరిధిలోని వివిధ గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిఎల్ పీఓ షేక్ నూర్జహాన్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు పంచాయతీ కార్యదర్శుల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సంపద సృష్టి కేంద్రాలు అందుబాటులోకి తీసుకోరావాలన్నారు. ఇంటింటి సర్వే పగడ్బంధీగా చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద బోర్డు ఏర్పాటు చేసి మరుగుదొడ్డి కూర్చుంటే జరిమాన విధిస్తామని దండోరా వేయించాలన్నారు. గ్రామంలో ఎక్కడపడితే అక్కడ చెత్త చెదారాన్ని వేస్తే హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేయాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, ఎంపీడీఓ జయరాముడు, ఆదోని ఈఓఆర్డి జనార్ధన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
సంక్రాంతికి ప్రత్యేక బస్సులు .. నేటి నుంచి రిజర్వేషన్స్ షురూ..
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీలోని సొంత గ్రామాలకు వెళ్లడానికి ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టింది. రెగ్యులర్‌గా నడిచే సర్వీసులతో పాటు 2,400 బస్సులను అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజన్ ఎల్. విజయలక్ష్మి తెలిపారు. ప్రత్యేక బస్సులు జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సాధారణ చార్జీలతోనే ఈ బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. ఎటువంటి అదనపు చార్జీలు ఉండవని పేర్కొన్నారు. ప్రయాణికులు ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ నుంచి లేదా అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల నుంచి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని వివరించారు. ఎంజీబీఎస్‌లో ప్రయాణికులు, బస్సుల రద్దీ దృష్ట్యా జనవరి 10 నుంచి 12 వరకు కర్నూలు, చిత్తూరు, నెల్లూరు. అనంతపురం, మాచర్ల, ఒంగోలు వైపు వెళ్లే రెగ్యులర్, ప్రత్యేక బస్సులను గౌలిగూడ సీబీఎస్ నుంచి నడుపుతారని తెలిపారు.
ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి అంటే…!
సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని వినతి
గ్రామీణ ప్రాంత ప్రజల అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగకే విద్యార్ధులకు ఎక్కువ రోజులు సెలవులు వస్తాయి. ఉద్యోగ, వ్యాపార, ఇతరత్రా పనుల వల్ల ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సంక్రాంతి పండుగ సెలవులకు స్వగ్రామాలకు చేరుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ఆనందోత్సాహాలతో గడుపుతూ ఉంటారు. అందుకే సంక్రాంతి సెలవులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.అయితే ఈ ఏడాది సంక్రాంతి సెలవులపై సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024 – 25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు ఇప్పటికే స్థానిక అధికారులు సెలవులు ప్రకటించినందున ఈ సారి 11వ తేదీ నుంచి 15 వరకు, లేదా 12 నుంచి 16వ తేదీ వరకూ మాత్రమే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు.
ఇప్పటికే 2025 సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. షెడ్యూల్ మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయని ఆ జాబితాలో పేర్కొంది.
క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు
ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 78,850
22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 78,800
దేశంలో పసిడి, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దిగుమతి దారులు, బ్యాంకర్ల నుంచి పెరిగిన గిరాకీతో అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ భారీగా పతనం, జ్యువైలర్ల నుంచి డిమాండ్ రావడంతో తిరిగి బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.350లు పుంజుకుని రూ.79,200లకు చేరుకుంది. గురువారం తులం బంగారం ధర రూ.78,850ల వద్ద స్థిరపడింది. శుక్రవారం 99.5 శాతం స్వచ్చత గల బంగారం తులం ధర రూ.350లు పెరిగి రూ.78,800 పలికింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.900 వృద్ధి చెంది రూ.91,700లకు చేరుకుంది. కామెక్స్ గోల్డ్ వ్యూచర్స్‌లో ఔన్స్ గోల్డ్ ధర 13.70 డాలర్లు పడిపోయి 2,640.20 డాలర్లు పలికింది. కామెక్స్ సిల్వర్ వ్యూచర్స్‌లో ఔన్స్ వెండి ధర 0.74 శాతం పతనంతో 30.17 డాలర్లకు చేరుకుంది.
కడప పర్యటనకు బయల్దేరిన పవన్ కళ్యాణ్
వెలగపూడి ఉ జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కడప పర్యటనకు బయల్దేరారు. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై మండల పరిషత్ కార్యాలయంలో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు తీవ్రస్థాయిలో దాడి చేశారు. ఈ దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న వీూణూ పై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య, ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని స్పష్టం చేశారు. గాలివీడు ఎంపీడీఓపై చోటు చేసుకున్న దాడి ఘటన గురించి అధికారులతో ఆయన చర్చించారు..కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎంపీడీఓకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు. జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్లా ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న అప్రజాస్వామిక దాడిపై విచారణ చేయడంతోపాటు ఎంపీడీఓ ఆరోగ్యం గురించి వాకబు చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ను ఆదేశించారు.
- ఇక జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యం లోనే ఇవాళ పవన్ కడపకు వెళ్తున్నారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి, కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు.
7న విచారణకు రండి.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
ఫార్ములా ఈ-రేసు కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు జారీచేసింది. వచ్చే నెల 7న విచారణకు హాజరు కావాలని అందులో కోరింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్‌రెడ్డిని వరుసగా జనవరి 2, 3 తేదీల్లో విచారణకు పిలిచింది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా, అరవింద్ కుమార్ ఏ2గా, బీఎల్ఎన్‌రెడ్డి ఏ3గా కేసు నమోదు చేసిన ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఇదే కేసులో ఈడీ మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. ఫార్ములా ఈ-రేసు కేసులో అనేక ఉల్లంఘనలు జరిగాయన్నది ఏసీబీ వాదన. 2022లో తొలిసారి జరిగిన ఒప్పందంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదని, 2023లో చేసుకున్న ఒప్పందంలో ఒక అడుగు ముందుకు వేసి విదేశీ కరెన్సీ రూపంలో నిధులు చెల్లించడం పూర్తిగా నేరపూరిత చర్యేనన్నది ఏసీబీ వాదన. మొత్తం రూ. 54.9 కోట్లను కేటీఆర్ ఆదేశాలతోనే ఖర్చు చేశారని ఏసీబీ ధ్రువీకరించింది.