Saturday, January 11, 2025
Home Blog Page 29

మలేరియా నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత

జిల్లా అధికారి ఓబులు

విశాలాంధ్ర-రాప్తాడు : మలేరియా నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా మలేరియా అధికారి ఓబులు సూచించారు. మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ దోమల పెరుగుదలను అరికట్టడానికి వాటి వల్ల వచ్చే జబ్బులు, నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. నీటి వనరులపై మూతలు ఉంచుకోవాలని, ఇంటి పరిసరాలలో పనికిరాని ఎలాంటి వస్తువులను పడవేయరాదన్నారు. అంతకుముందు రాప్తాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యాధికారి డాక్టర్ శివకృష్ణతో జాతీయ కీటక జనిత వ్యాధుల నిర్మూలన కార్యక్రమాన్ని గురించి చర్చించారు. మండలంలో నమోదైన మలేరియా డెంగు వ్యాధుల గురించి,తీసుకున్న నివారణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్ ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. మలేరియా రక్తపూతల సేకరణ యాక్టివ్, ప్యాసివ్ సేకరణ, పి.హెచ్.సి కి వచ్చే కొత్త రోగులలో 15% ఉండాలని ల్యాబ్ టెక్నీషియన్ శ్రీధర్ బాబుకు సూచించారు. ఎంఎఫ్ 8, ఇతర రికార్డులను చక్కగా నిర్వహించాలన్నారు. సూచించారు. కార్యక్రమంలో అనంతపురం మలేరియా సబ్ యూనిట్ అధికారి మద్దయ్య, సూపర్వైజర్లు నూర్ బాషా, శ్రీధర్ మూర్తి, రాప్తాడు పీహెచ్సీ సూపర్వైజర్ నరసింహులు, హెల్త్ అసిస్టెంట్ నారాయణస్వామి, ఏఎన్ఎం సునీత, ఆశా కార్యకర్త ఇందిరా పాల్గొన్నారు.

అత్తంటివారిపాలెం అంగన్వాడీ కేంద్రంలో వీర బాల్ సింగ్ కార్యక్రమం

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : కందుకూరు ప్రాజెక్ట్ వలేటివారిపాలెం 2సెక్టార్ అత్తింటివారిపాలెం అంగన్వాడీ కేంద్రం నందు సీడీపీఓ శర్మిష్ట గారి అధ్యక్షతన వీర బాల దివాస్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా సీడిపిఓ శర్మిష్ట మాట్లాడుతూ సిక్కుల పదవ గురువు గురుగోవింద సింగ్ కుమారులైనటువంటి ఫతే సింగ్, జూరావర్ సింగ్ ధైర్యానికి, సాహసానికి చిహ్నంగా డిసెంబర్ 26వ తేదీన అత్తింటివారిపాలెం అంగన్వాడీ సెంటర్ నందు వీర బాల్ సింగ్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీడీపీఓ శర్మిష్ట, సూపెర్వైజర్ సునీత, అంగన్వాడీ వర్కర్స్ రాధ, భారతి, రమ, ఆయా ప్రసన్న స్కూల్ టీచర్ భారతి లక్ష్మి గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మానవహక్కులు, వాటి విధులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను.. గొర్తి భారతీదేవి

విశాలాంధ్ర ధర్మవరం;; మానవహక్కులు వాటి విధులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని గొర్తి భారతీదేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు వారి స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ సమాజంలో చేసిన సహాయ సహకారాలు సేవలను గుర్తించి సేవా దృక్పథంతో తనకు జోనల్ అధ్యక్షులుగా నియమించినందుకు తాను సంతోషిస్తూ, భవిష్యత్తులో అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉంటూ మానవ హక్కులపై పోరాటాలు సలుపుతానని తెలిపారు. నాపై నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతను అప్పగించినందుకు తప్పక నా విధుల యందు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని తెలిపారు. అనంతపురంలోని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కార్యాలయంలో నాకు ఈ సర్టిఫికెట్ను ఇవ్వడం జరిగిందని తెలిపారు. పేదలకు వివిధ రకాలుగా సేవలు చేస్తూ, ఆసుపత్రిలో వ్యాధిగ్రస్తులకు అన్నదాన కార్యక్రమాలతో పాటు ఎన్నో సామాజిక సేవలు చేయడం జరిగిందని తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం తాను ఒంటరిగా నిలబడి చేసిన సేవలను గుర్తించడం నా అదృష్టంగా భావిస్తానని తెలిపారు. అంతర్జాతీయ మానవ హక్కుల సమితి వ్యవస్థాపకులు, అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ ముజాహిద్ నుండి రావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. తన భర్త గోర్తి సుధాకర్ నాయుడు కూడా తనకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందించడం జరిగిందని తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ముజాహిద్ కు, షేక్ షరాఫ్ సోహెబ్ కు, డాక్టర్ ప్రశాంతికి, సిద్ధ వెంకటరమణకు, నాకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ వారు పేరుపేరునా అభినందన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఘనంగా వీరబాల దివస్

విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని సంజయ్ నగర్ లో బి.ఎస్.ఆర్ మునిసిపల్ హైస్కూల్‌లో వీర్ బల్ దివస్ సందర్భంగా బీజేవైఎం యువమోర్చ ఆధ్వర్యంలో వీరబాల దివస్ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ ,ఆయన కుటుంబం దేశం, మతం, ధర్మం రక్షణ కోసం చేసిన త్యాగాలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుచేశారు. తన ఇద్దరు చిన్న సాహిబ్జాదాలు (జొరావర్ సింగ్, ఫతే సింగ్) నిరంకుశ పాలకుడి ముందు తలవంచకుండా ధైర్యంగా పోరాడి అమరులైన ఘట్టాన్ని గుర్తు చేస్తూ, వారి శౌర్యాన్ని, త్యాగాన్ని కొనియాడారు.డిసెంబర్ 26న ఈ చిన్న వీర బాలకుల్ని స్మరించుకునే ప్రత్యేకమైన రోజు అని,ఈ సంవత్సరంలో, మొదటిసారిగా, వీరి అమరత్వాన్ని గౌరవిస్తూ భారతదేశంలోని ధైర్యవంతులైన బాలలను సత్కరించడం ప్రత్యేకతగా నిలిచింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా, సిక్కుల వీరోచిత గాథలను గుర్తు చేస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి అని తెలిపారు. ఇది భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమై, సమాజంలో త్యాగం, ధైర్యం వంటి విలువలను నేటి తరానికి చేరువ చేసే ప్రయత్నంగా నిలిచింది అని తెలిపారు.సాహిబ్జాదాస్ వీరత్వం సిక్కు సమాజం మాత్రమే కాకుండా భారతదేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి జిల్లా కో కన్వీనర్ బిల్లు కుళ్లాయప్ప యాదవ్, హెడ్ మాస్టర్ రాంప్రసాద్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబిలేసు, జింకా చంద్రశేఖర్, ఇన్చార్జి హెచ్ఎం ప్రకాష్,అప్పారా చెరువు వీరనారప్ప,బిల్లే శీను, తదితరులు పాల్గొన్నారు.

ఉచిత గుండె వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

ఏఐ ఎఫ్బి నియోజకవర్గ ఇన్చార్జ్ విష్ణు నారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గోట్లురు గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో ఈనెల 28వ తేదీ శనివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత గుండె వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు ఏఐఎఫ్బి నియోజకవర్గ ఇన్చార్జ్ నిడి మామిడి విష్ణు నారాయణా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కిమ్స్ సవేరా హాస్పిటల్-అనంతపురం వారి సహాయ సహకారములతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో గుండెనొప్పి, చాతినొప్పి, గుండె దడ, ఆయాసము, కళ్ళు తిరగడం,గుండెలో మంట కలగడం, ఛాతిలో బరువుగా ఉండడం ,నిద్రలో ఆయాసం వచ్చి లేచి కూర్చోవడం, కళ్ళు వాపు రావడం చెమటలు పట్టడం లాంటి సమస్యలకు నిష్ణాతులైన వైద్యులచే వైద్య చికిత్సలను అందించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యమును పదిలంగా ఉంచుకోవాలని తెలిపారు.

అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛంద సంస్థ చేయూత

విశాలాంధ్ర ధర్మవరం ; అంగన్వాడీ కేంద్రాలను ప్లేస్కూల్ మోడల్గా మార్చేందుకు తమ సంస్థ సహాయ సహకారాలు అందిస్తోందని మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ ఛైర్మన్ లక్ష్మిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సత్యసాయినగర్ అంగన్వాడీ కేంద్రంలో గురువారం ఎస్బిఐ పాన్ ఇండియా సీఎస్ఆర్ యాక్టివిటిస్ సహకారంతో మిత్ర హొలిస్టిక్ హెల్త్ సొసైటీ ఛైర్మన్ లక్ష్మిరెడ్డి అంగన్వాడీ కేంద్రానికి ఆట వస్తువులు, బుక్స్, బాటిళ్లు, టీవీ, రైస్ కుక్కర్ను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు ఆడుతూ పాడుతూ విద్యను అందించేందుకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. సొసైటీ తరపున ఇప్పటి వరకు రాష్ట్రంలోని 60 అంగన్వాడీ కేంద్రాలకు ఆట వస్తువులు, వివిధ రకాల వస్తువులు అందించామని తెలిపారు. కేంద్రంలోని పిల్లలు, టీచర్లు వాటిని సద్వినియోగం చేసుకుని పిల్లలకు మంచి విద్యను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయినగర్ అంగన్వాడీ కేంద్రం టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

కబ్జాదారుల నుండి మా భూమిని మాకు ఇప్పించండి… బాధితులు ఆవేదన

విశాలాంధ్ర -ధర్మవరం; మండల పరిధిలోని రావు చెరువు గ్రామం కురుబ సామాజిక వర్గానికి చెందిన నాగలక్ష్మిమ్మ,, గంగమ్మ చంద్రశేఖర, వీరనారప్ప,వారి స్థిరాస్తి భూమి యొక్క సర్వే నెంబర్ 458-3,4 లో 10 ఎకరాల 20 సెంట్లు భూమి కలదు అందులో భాగంగా రెండు ఎకరాల 15 సెంట్లు యల్లప్ప అమ్ముకున్నారు మిగులు భూమి ని మాకు సర్వే చేయించాలని బాధితుడు కొంక కుల్లాయప్ప తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రావులచెరువు గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు మా భూమిని కొని మిగిలిన భూమిని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని తెలిపారు. కబ్జాదారుల నుండి మా భూమిని కాపాడి,ఇంకా మిగిలిన భూమిని సర్వే చేయించాలని ఎమ్మార్వో కు సర్వే చేయమని అర్జీ ఇవ్వడం జరిగింది అని తెలిపారు. స్పందించిన ఎమ్మార్వో వెంటనే ఈ భూమిని సర్వే చేయాలని మండల సర్వేయర్ కు తెలపడం జరిగిందన్నారు.మండల సర్వే భూమిలోకి వచ్చి కోర్టు ద్వారా (ఓ యస్) నెంబర్ వచ్చిందని, మేము భూమిని సర్వే చేయలేమని వెనక్కి వెళ్లడం జరిగింది అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కి అర్జీ ఇవ్వడం జరిగింది అని,కలెక్టర్ స్పందించి వెంటనే డివిజనల్ సర్వేకు సర్వే చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. డివిజనల్ సర్వేర్ బాధితులకు ఫోన్ ద్వారా ఈనెల 26న భూమిని సర్వే చేస్తామని తెలపడం జరిగిందన్నారు. గురువారం ఉదయం భూమి దగ్గరికి వచ్చి తూతూ మంత్రంగా కల్లబొళ్ళు మాటలు చెప్పి రెడ్డి సామాజిక వర్గానికే వత్తాసు పలుకుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మాభూమి అన్ని విధాల హక్కుదారులను అయినప్పటికీ మాకు తాసిల్దార్ కార్యాలయం వారు న్యాయం చేయలేకపోతున్నారు అని ఆవేదం వ్యక్తం చేశారు మా తాత అయిన పెద్ద ఎల్లప్ప, ఎల్లప్ప కొడుకులకు రాతపూర్వకంగా రాపించి, ఇచ్చిన పత్రాలు మా దగ్గర ఉన్నాయి అని,మేము వారి (వారసులు) మనవల్లము అని తెలిపారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి, కలెక్టర్ ఆదేశాల మేరకు మాభూమి మాకు సర్వే చేయించి, అధికారులు మాకు న్యాయం చేయాలని కోరారు.

శ్రీ అన్నమాచార్య విగ్రహం వద్ద నిరసన

విశ్వహిందూ పరిషత్, అన్నమయ్య సేవమండలి కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం: తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద శ్రీ అన్నమాచార్య విగ్రహానికి క్రైస్తవ మతానికి చెందిన శాంటా క్లాస్ టోపీని పెట్టి స్వామివారిని అవహేళన చేస్తూ అవమానించడం జరిగింది అని ఎందుకు నిరసనగా పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ ఆవరణములో ఉన్న అన్నమయ్య విగ్రహం వద్ద విశ్వహిందూ పరిషత్, అన్నమయ్య సేవా మండలి కమిటీ, భక్తాదులు కలిసి నిరసనను వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి పులిచెర్ల వేణుగోపాల్, ఆర్యవైశ్య సంఘం నాయకులు కలవల రామ్ కుమార్, అన్నమయ్య సేవ మండలి అధ్యక్షులు పొరాళ్ళ పుల్లయ్య, వారి శిష్యబృందం, అధిక సంఖ్యలో భక్తాదురు పాల్గొన్నారు.

భారత గడ్డపై భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు….. సిపిఐ

విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ధర్మవరం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి మధు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాటమయ్య , చేనేత చేతి వృత్తుదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి హాజరు కావడం జరిగింది అని తెలిపారు.ఈ సందర్భంగా కాటమయ్య, జింక చలపతి, మధు మాట్లాడుతూ భారతదేశంలో 1925 ఆవిర్భవించి దేశ స్వతంత్రం కోసం ఎన్నో ఉద్యమాలు ప్రాణ త్యాగాలు చేసి స్వాతంత్రం కోసం దేశంలో ఉన్న కార్మికులు కర్షకులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని తెలిపారు. నాటి నుండి నేటి వరకు పేద మధ్యతరగతి ప్రజల పక్షాన ఉంటూ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అనేక పోరాట రూపకల్పన చేసింది సిపిఐ అని అన్నారు. ఈనాటికీ 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించడం ఒక్క సీపీఐకే దక్కుతుందని తెలిపారు. ప్రజల యొక్క సమస్యలను పోరాటాల ద్వారా సల్ఫీ విజయాలను తెస్తోందని ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చి పరిష్కరించే దిశగా ఎన్నో పోరాటాలు చేసి ప్రజలకు న్యాయం చేకూర్చడం ఒక సిపిఐ కు మాత్రమే దక్కుతుందని సిపిఐ తో పాటు దానికి అనుబంధమైన సంఘాల ద్వారా వివిధ రకాల ఉద్యోగులకు న్యాయం చేకూర్చడం జరుగుతుందని ధర్మవరం పట్టణంలో స్వాగత తోరణాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. నేడు ధర్మవరం పట్టణంలో ఎర్రజెండాలు రెపరెపలాడుతూ మున్ముందు కూడా ప్రజల సమస్యల కు తాము ముందుంటామని నినాదాలు చేయడం జరిగిందన్నారు. మతోన్మాద బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహిస్తామని నిరంతరం ప్రజల కోసం, వారి సమస్యల కోసం, పేద మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల కోసం, భారత కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు వారి వెంట ఉండి, ఎన్నో ఉద్యమాలు చేసి, ప్రజల కోసం ప్రజలతో ఉండి పని చేసే పార్టీ మన భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ పార్టీ దేశంలోనే వందేళ్లు చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అని, సిపిఐ పేదల కోసం,భూముల కోసం, భుక్తి విముక్తి కోసం, పోరాటాలు చేసి కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం త్యాగాలను చేసిన పార్టీ మన సిపిఐ పార్టీ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయకార్యదర్శి రమణ, రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కుల్లాయప్ప, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, వెంకటనారాయణ, వెంకటస్వామి, సిపిఐ బత్తలపల్లి మండల కార్యదర్శి వెంకటేష్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సకల రాజా, వ్యవసాయ కార్మిక సంఘం బత్తలపల్లి మండల కార్యదర్శి సన్న పెద్దన్న ,రైతు సంఘం మండల కార్యదర్శి రామకృష్ణ, మహిళా సంఘం నాయకులు లలిత , నాగమ్మ సిపిఐ నాయకులు శ్రీనివాసులు, సురేష్, ఆదినారాయణ, రంగయ్య,సురేష్, శ్రీధర్, తాడిమర్రి సిపిఐ మండల నాయకులు లక్ష్మీనారాయణ, దాసు, సన్న పెద్దన్న ,చౌడప్ప, వసూరప్ప, పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సుఖదేవ్ నగర్ కాలనీలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు

విశాలాంధ్ర -అనంతపురం : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతజయంతి ఉత్సవాలు సిపిఐ నగరం సుఖదేవా నగర్ కాలనీలో ఘనంగా సీపిఐ జిల్లా సమితి సభ్యులు ఈశ్వరయ్య అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సంద్భంగా జాఫర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వాడ వాడలా 100 సంవత్సరాల ఉత్సవాలు జరపాలనే జాతీయ సమితి పిలుపుమేరకు అనంతపురం జిల్లాలోని అన్ని పార్టీ శాఖలలో ఘనంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. శుక్రవారం అనంతపురం పట్టణంలోని సుఖదేవ కాలనీ శాఖా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ…. సిపిఐ మనదేశంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కుల మత వర్గ తరతమ్యాలు లేని సమ సమాజం కోసం పోరాడిందని ఆనాడు సమాజంలో జమీందారీ జాగీర్దారీ వ్యవస్థలను రద్దు చేయాలని పెత్తందారులు పేదలు, పేద రైతాంగం పై సాగిస్తున్న దౌర్జన్యాలను అరికట్టాలని కార్మికులు కష్టజీవులకు శ్రమకు తగ్గ ఫలితం సాధించుటకు పోరాటం సాగించి విజయం సాధించిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో గ్రామీణ పేదలను ఐక్యం చేసి నిజాం నిరంకుశ సైన్యానికి సైతం ఎదురొడ్డి పోరాడిందని రైతాంగాన్ని కూలీల పోరుబాటలో ఆనాడు భూస్వాములు అనుభవిస్తున్న పేదల భూములు 10 లక్షల ఎకరాల భూములను పేద కూలీలకు రైతాంగానికి పంచిన చరిత్ర సిపిఐ దన్నారు. మనువాదులు ధ్వంసం చేయాలని చూస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కుల మతాల పేరుతో దేశ ప్రజల మధ్య చిచ్చు రేపే మత విద్వేషాలకు వ్యతిరేకంగా సిపిఐ అనేక దశాబ్దాలుగా పోరాడుతోందని అని పేర్కొన్నారు. నేడు కూడా కేంద్రంలో అటువంటి శక్తులు పెచ్చరిల్లిపోతున్న నేపద్యంలో మరోసారి మత ఉన్మాదాన్ని పెరిగిపోకుండా భిన్నత్వంలో ఏకత్వం గా బహుళ మతాలు కులాలు అన్నదమ్ముల వలె కలిసి జీవిస్తున్న మనదేశంలో అందరినీ గౌరవించే విధానాన్ని కొనసాగించుటకు, దేశంలోని వామ పక్షవాదులను,లౌకిక శక్తులను ఇండియా కూటమిగా ఏర్పాటు చేసి కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించుటకు సిపిఐ నిరంతరంశమిస్తోందన్నారు. పల్నాడు జిల్లాలో పార్టీ ఇచ్చిన పిలుపులలో పాల్గొనుచు నియోజకవర్గంలోని అనేక సమస్యలను పరిష్కరించుకొనుచు పులుపుల వెంకట శివయ్య స్ఫూర్తితో ఎర్రజెండా నీడలో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి మాట్లాడుతూ… సిపిఐ అనేక పోరాటాలు చేసిందని పార్టీ ఇచ్చిన పిలుపులో భూమికోసం భుక్తి కోసం శ్రమజీవుల బడుగు జీవుల సమస్యల పరిష్కారం కోసం వారి ఇళ్లస్థలాలు, రేషన్ కార్డులు మౌలిక సమస్యల పరిష్కారం కొరకు అనేక పోరాటాలు చేసి అనేక పోలీసు కేసులు ఎదుర్కొని ప్రజలకు వేలాదిమందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి వారి మౌలిక సమస్యలపై పోరాడి విజయం సాధించిన చరిత్ర సిపిఐదన్నారు. ప్రజల సమస్యలను నిరంతరం అధ్యయనం చేస్తూ ఒక్కొక్కటిగా పరిష్కరించుకొనుచు సిపిఐ నాయకత్వం ముందుకు సాగుతుందని నగరం కాలనీ ఇళ్లపట్టాలు మంచినీళ్లు కరెంటు తదితర సమస్యలను పరిష్కారం చేసుకొనవలసి ఉందని ఎర్రజెండా మన జరిపే పోరాటాలకు ప్రతి ఒక్కరూ కలిసి రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి శ్రీరాములు, నగర సహాయ కార్యదర్శి రమణ, అలిపీర, ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు మోహన్ కృష్ణ, నగర అధ్యక్షుడు ఆనంద్, నగర కార్యవర్గ సభ్యులు చంద్ బాషా జీలాన్, నగప్పా కాలనీ వాసులు పాల్గొన్నారు