Tuesday, May 13, 2025
Home Blog Page 295

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు

అధికారులు, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి సమీక్ష
నిర్మాణ పనులపై దిశానిర్దేశం

ఏపీ సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పరిశీలించారు. హిల్ వ్యూ పాయింట్ నుంచి కూడా పోలవరం డ్యామ్ ను పరిశీలించారు. గ్యాప్-1, గ్యాప్-2 పనులతో పాటు డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను కూడా చంద్రబాబు పరిశీలించారు. తన పర్యటన సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.

ఇక, పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు, పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతటి ప్రాధాన్యతా అంశమో వారికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ నిర్మాణాల షెడ్యూల్ ను చంద్రబాబు విడుదల చేయనున్నారు. కాగా, పోలవరం పర్యటనలో చంద్రబాబు వెంట రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు.

అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత భారీగా పెరిగిన పుష్ప-2 కలెక్షన్లు..

0

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ రికార్డుల బ్రేక్
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టై, బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత పుష్ప-2 కలెక్షన్లలో పెరుగుదల ట్రెండ్ కనిపిస్తోంది. వీకెండ్ అయిన రెండవ ఆదివారం (డిసెంబర్15) ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.75 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టిందని మూవీ కలెక్షన్లను ట్రాక్ చేసే ాశాక్‌నిల్క్్ణ కథనం పేర్కొంది. తెలుగు వెర్షన్ రూ. 16 కోట్లు, హిందీ వెర్షన్‌ ఏకంగా రూ.55 కోట్లు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్లలో స్వల్ప మొత్తంలో వసూళ్లను రాబట్టిందని పేర్కొంది. ఆదివారం వచ్చిన భారీ కలెక్షన్లతో ఈ సినిమా విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్ల మైలురాయిని అధిగమించిందని వెల్లడించింది. దీంతో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన మూడవ భారతీయ చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఆర్ఆర్ఆర్ (రూ.1,230 కోట్లు), కేజీఎఫ్: చాప్టర్-2లను (రూ.1,215 కోట్లు) పుష్ప-2 అధిగమించింది. ప్రస్తుతం బాహుబలి 2 (రూ.1,790 కోట్లు), ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ (రూ.2,070 కోట్లు) సినిమాలు మాత్రమే ముందున్నాయి. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే బాహుబలి-2 కలెక్షన్లను కూడా పుష్ప-2 అధిగమించే అవకాశాలు ఉన్నాయి.

గ‌న్ అప్ప‌గించిన మోహ‌న్ బాబు

ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి పీఎస్‌లో త‌న గ‌న్‌ను స‌రెండ‌ర్ చేసిన మోహ‌న్ బాబు
టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు త‌న లైసెన్స్ గ‌న్‌ను పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈరోజు హైద‌రాబాద్ నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి మండ‌లం రంగంపేట‌లోని త‌న యూనివ‌ర్సిటీకి వెళ్లారాయ‌న‌. అనంత‌రం చంద్ర‌గిరి పోలీస్ స్టేష‌న్‌లో త‌న డ‌బుల్ బ్యారెల్‌ లైసెన్స్‌డ్ గ‌న్‌ను పీఆర్ఓ ద్వారా డిపాజిట్ చేయించారు. ఇటీవ‌ల కుటుంబ గొడ‌వ‌ల నేప‌థ్యంలో గ‌న్ స‌రెండ‌ర్ చేయాల‌ని హైద‌రాబాద్ పోలీసులు ఆయ‌న్ను ఆదేశించ‌డంతో తాజాగా గ‌న్ అప్ప‌గించారు. మ‌రోవైపు జ‌ల్‌ప‌ల్లిలో త‌న నివాసం వద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌పై మోహ‌న్ బాబు తాజాగా మ‌రోసారి మాట్లాడారు. తాను ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌ర్న‌లిస్టుపై దాడి చేయ‌లేద‌న్నారు. ఈ సందర్భంగా మ‌రోసారి జ‌ర్న‌లిస్టుల‌ను ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు కోరారు. ఇక ఆదివారం నాడు దాడిలో గాయ‌ప‌డిన జ‌ర్న‌లిస్టును ఆసుప‌త్రికి వెళ్లి మోహ‌న్ బాబు, ఆయ‌న కుమారుడు మంచు విష్ణు ప‌రామ‌ర్శించిన విష‌యం తెలిసిందే.

ఫ్రాన్స్‌ను అతలాకుతలం చేసిన చిడో తుపాను.. వేలాదిమంది మృతి..

హిందూ మహాసముద్ర ద్వీప సమూహంలోని మయోట్‌ను తాకిన అత్యంత శక్తిమంతమైన తుపాను ాచిడో్ణ వేలాదిమంది ప్రాణాలు బలిగొంది. గత శతాబ్ద కాలంలోనే ఇది అత్యంత బలమైన తుపాను అని ఫ్రెంచ్ అధికారులు చెబుతున్నారు. తనకు తెలిసినంత వరకు ఈ తుపాను కారణంగా కొన్ని వేలమంది మృతి చెంది ఉంటారని ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులు కూడా వేలల్లో ఉండొచ్చని తెలిపారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో మృతుల సంఖ్యను కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదని ఫ్రెంచ్ అంతర్గతశాఖ మంత్రి పేర్కొన్నారు. చిడో తుపాను రాత్రికి రాత్రే మయోట్‌ను తాకినట్టు చెప్పారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగా ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు దెబ్బతిన్నట్టు వివరించారు. గత 100 ఏళ్లలో ఇంత బలమైన తుపాను ద్వీపాన్ని ఎన్నడూ తాకలేదని స్థానిక వాతావరణశాఖ తెలిపింది.

నిజం చెప్పాలంటే తాము విషాదాన్ని అనుభవిస్తున్నామని, అణుయుద్ధం తర్వాత ఉండే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని మయోట్ రాజధాని మమౌద్జౌ నివాసి ఒకరు తెలిపారు. తమ పొరుగు ప్రాంతం మొత్తం అదృశ్యమైందని చెప్పుకొచ్చారు. వేలాది గృహాలు శిథిలమైన ఏరియల్ వ్యూ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ విషాదంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

తెలంగాణలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీనికి తోడు చలిగాలులు వేధిస్తుండడంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని బేలాలో అత్యంత కనిష్ఠంగా 6.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని చాలా జిల్లాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ఇక, హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల లోపే నమోదయ్యాయి. మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో అత్యల్పంగా 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, బీహెచ్‌ఈఎల్‌లో 7.4, రాజేంద్రనగర్‌లో 8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చాంద్రాయణగుట్ట, కూకట్‌పల్లి, గోల్కొండ, సఫిల్‌గూడ, హయత్‌నగర్, ఉప్పల్, మల్లాపూర్, ఆదర్శనగర్ తదితర ప్రాంతాల్లో 13 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గూగుల్, మైక్రోసాఫ్ట్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు ఎలాన్ మస్క్ రెడీ!

ప్రస్తుతం ఈమెయిల్ మార్కెట్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న యాపిల్ మెయిల్, రెండోస్థానంలో జీమెయిల్
సెర్చింజన్ దిగ్గజం గూగుల్, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు షాక్ ఇచ్చేందుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ రెడీ అవుతున్నారు. ాఎక్స్ మెయిల్్ణ పేరుతో ఈమెయిల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ాఎక్స్‌ మెయిల్్ణ కూడా ఉంటే బాగుంటుందన్న ఓ ఎక్స్ యూజర్ సూచన మేరకు మస్క్ ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఎక్స్ మెయిల్ లాంచ్ అయితే అది నేరుగా జీమెయిల్, ఇతర ఈమెయిల్ సర్వీసులకు పోటీ ఇస్తుందని మస్క్ ఆ యూజర్‌కు సమాధానం ఇచ్చారు. సెప్టెంబర్ 2024 నాటికి గ్లోబల్ ఈమెయిల్ మార్కెట్‌లో యాపిల్ మెయిల్ ప్రస్తుతం 53.67 శాతంతో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 30.70 శాతంతో జీమెయిల్ రెండోస్థానంలో ఉండగా, అవుట్‌లుక్ (4.38 శాతం), యాహూ మెయిల్ (2.64 శాతం), గూగుల్ ఆండ్రాయిడ్ (1.72 శాతం) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడీ విషయంలోనూ పోటీకి మస్క్ రెడీ అవుతున్నట్టు ఆయన కామెంట్‌ను బట్టి అర్థం అవుతోంది. దీంతో ఎక్స్ యూజర్లు మరింత ఉత్సాహంగా.. ఎక్స్ ఫోన్్ణ గురించి కూడా ఆలోచించాలని కోరుతున్నారు.

జాకీర్ హుసేన్ మృతిపై చంద్రబాబు, నారా లోకేశ్ సంతాపం

ప్రముఖ తబలా విద్వాంసులు జాకీర్ హుస్సేన్ మృతి చెందడంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు.భారతీయ శాస్త్రీయ సంగీతంలో మహోన్నత వ్యక్తి అయిన తబలా మ్యాస్ట్రో జాకీర్ హుస్సేన్ ను కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. మంత్రముగ్ధులను చేసే ఆయన ప్రదర్శనలు సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయని కొనియాడారు. ఆయన వారసత్వం రానున్న తరాల్లో సంగీత ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటుందని పేర్కొంటూ, జాకీర్ హుస్సేన్ మృతికి సంతాపాన్ని ప్రకటించారు.సంగీత ప్రపంచం ఒక లెజెండరీని కోల్పోయిందని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మ్యూజికల్ జీనియస్ ను కోల్పోవడం బాధాకరమని అన్నారు. జాకీర్ హుస్సేన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

జాకీర్ హుసేన్ మృతిపై చంద్రబాబు, నారా లోకేశ్ సంతాపం

ప్రముఖ తబలా విద్వాంసులు జాకీర్ హుస్సేన్ మృతి చెందడంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు.భారతీయ శాస్త్రీయ సంగీతంలో మహోన్నత వ్యక్తి అయిన తబలా మ్యాస్ట్రో జాకీర్ హుస్సేన్ ను కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. మంత్రముగ్ధులను చేసే ఆయన ప్రదర్శనలు సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయని కొనియాడారు. ఆయన వారసత్వం రానున్న తరాల్లో సంగీత ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటుందని పేర్కొంటూ, జాకీర్ హుస్సేన్ మృతికి సంతాపాన్ని ప్రకటించారు.సంగీత ప్రపంచం ఒక లెజెండరీని కోల్పోయిందని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మ్యూజికల్ జీనియస్ ను కోల్పోవడం బాధాకరమని అన్నారు. జాకీర్ హుస్సేన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

సీనియర్ లెక్చరర్ వీరస్వామికి అరుదైన గౌరవం

విశాలాంధ్ర, కదిరి.కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ లెక్చరర్ డా.వి వీరాస్వామి కి అరుదైన గౌరవం దక్కిందని ఆయన తెలిపారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న దేశ విదేశాల్లోని ప్రముఖ వ్యక్తులను గుర్తించి లీడర్ షిప్ ఎక్సలెన్సెస్ అవార్డు 2024″ తో సత్కరించారన్నారు.ప్రత్యేకంగా అవార్డు విజేతల జీవిత వివరాలతో కూడిన ఓ పుస్తకాన్ని ప్రచురించగా సదరు పుస్తకంలో డా వీరాస్వామికి చోటు లభించడం తమ కళాశాలకు ఇంతటి గౌరవం రావడంతో తోటి అధ్యాపకులు ఆయనను అభినందించారు

దేశం కోసం ప్రాణాలు డిన్న వెంకటసుబ్బయ్యకు నివాళులు

విశాలాంధ్ర ధర్మవరం : దేశం కోసం ప్రాణాలు వొడ్డిన వెంకటసుబ్బయ్యకు ఆదర్శ సేవా సంఘం పార్కు సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి, గౌరవాధ్యక్షులు చేన్న ప్రకాష్, కార్యదర్శి నాగార్జున, మారుతి, హెమ్ కుమార్, మాజీ సైనికులు పవన్ కుమార్, నాగభూషణం, ఎన్ఎస్ రెడ్డి, శ్రీధర్ లు పట్టణంలోని పిఆర్టి వీధిలోగల పార్కులో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మృతుడు నార్పల గ్రామానికి చెందిన సైనికుడని, సైన్యంలో కూడా మంచి గుర్తింపు పొందడం జరిగిందని తెలిపారు. వెంకటసుబ్బయ్య మృతి చెందడం బాధాకరమని, వారి త్యాగం ఎందరికో స్ఫూర్తిని ఇస్తుందని తెలిపారు. 30 మంది తోటి జవాన్ల ప్రాణాలను కాపాడి వారు వీర మరణం పొందడం దేశం గర్వించదగ్గ విషయమని తెలిపారు.