Tuesday, May 13, 2025
Home Blog Page 296

కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయని చెత్త పాలన మీది…

వైసిపి పై మంత్రి నాదెండ్ల విసుర్లు
గత సీజన్‌లో వైసీపీ ప్రభుత్వం గుంటూరు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో కనీస సేకరణ కూడా చేపట్టలేదని, ఎందుకు చేయలేకపోయారని మంత్రి ప్రశ్నించారుపౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ . సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పుడూ రైతుల గురించే ఆలోచిస్తారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ాఅన్నదాతకు అండగా వైసీపీ్ణ పేరిట వైఎస్సార్‌సీపీ నాయకులు కలెక్టరేట్ల వద్దకు ధాన్యం బస్తాలు తీసుకెళ్లి ఫొటో‌షూట్లు చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపించే విషయంలో చంద్రబాబు సర్కారు ముందుంటుందని, అన్నదాతలకు అండగా నిలుస్తుందని తెలిపారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ధాన్యం కొనుగోలు విషయంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతన్నలకు బకాయిలు చెల్లించకుండా మోసం చేసిందని, వైసీపీ సర్కారు చెల్లించాల్సిన బకాయిలను కూడా కూటమి ప్రభుత్వమే చెల్లించిందని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఏ ప్రభుత్వం అండగా నిలబడుతుందో జనాలకు తెలుసునని వ్యాఖ్యానించారు.

వైసీపీ ప్రభుత్వంలో గత ఖరీఫ్ సీజన్‌లో డిసెంబర్ 13 నాటికి 9,40,936 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారని, అయితే కూటమి ప్రభుత్వం ఈ సీజన్‌లో ఇప్పటికే 16,34,151 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని ఆయన వివరించారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ రాకముందే రైతుల కళ్లల్లో సంతోషం కనిపిస్తోందని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ధాన్యం విక్రయాల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, దళారులకు తక్కువ ధరకే అమ్ముకోవదని ఆయన పునరుద్ఘాటించారు. ధాన్యం విక్రయాల విషయంలో రైతులను ఎవరైనా ఇబ్బంది పెట్టారని తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నిజానిజాలు తెలుసుకోండి.. తప్పుడు ప్రచారం చేయొద్దు: మోహన్ బాబు

జర్నలిస్టులపై దాడి కేసులో జరుగుతున్న పరిణామాలను వక్రీకరిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంచు మోహన్ బాబు ఆరోపించారు. ఈ విషయంపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారమవుతున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం తాను పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు రిజెక్ట్ చేసిందని మీడియాలో వార్తలు వస్తున్నాయని చెబుతూ.. అవన్నీ తప్పుడు కథనాలని కొట్టిపారేశారు. కోర్టు తన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను తన నివాసంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని మోహన్ బాబు తెలిపారు. నిజానిజాలు తెలుసుకుని, వాస్తవాలను మాత్రమే ప్రజలకు వెల్లడించాలని మీడియాకు మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు.

మీడియాను నేనే లోపలికి తీసుకెళ్లా.. మంచు మనోజ్

0

జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు ఫాంహౌస్ లో ఇటీవల మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. నటుడు మోహన్ బాబు ఓ మీడియా ప్రతినిధి చేతుల్లో నుంచి మైక్ లాక్కుని దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులదే తప్పని కొంతమంది కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు మోహన్ బాబును తప్పుబడుతున్నారు. తాజాగా ఈ ఘటనపై మంచు మనోజ్ స్పందించారు. ఫాంహౌస్ లోపలికి దూసుకు రావడంతో మీడియా ప్రతినిధులపై దాడి జరిగిందన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఈ ఇష్యూలో మీడియా ప్రతినిధుల తప్పేమీలేదని, తానే వారిని లోపలికి తీసుకెళ్లానని స్పష్టతనిచ్చారు. తన ఏడు నెలల కూతురును తెచ్చుకోవడానికి ఫాంహౌస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని చెప్పారు. గేట్లు మూసేసి తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని వివరించారు. దీంతో తాను గేట్లు పగలకొట్టి మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకుని లోపలికి వెళ్లానని చెప్పారు. ఇంతలో సడెన్ గా తన తండ్రి, ఇతరులు వచ్చి తమపై దాడి చేశారని చెప్పారు. ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ కు తీవ్ర గాయాలయ్యాయని మనోజ్ వివరించారు.

అల్లు అర్జున్ విడుద‌ల ఆల‌స్యంపై.. చట్టపరమైన చర్యల యోచ‌న‌లో ఆయన తరఫు న్యాయవాదులు!

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో నటుడు అల్లు అర్జున్‌ను తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయ‌న‌ను రిలీజ్‌ చేయ‌డంలో జాప్యం చోటు చేసుకున్న‌ట్లు బ‌న్నీ త‌ర‌ఫు న్యాయ‌వాదులు చెబుతున్నారు. దీంతో ఈ అక్రమ నిర్బంధంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు యోచిస్తున్నారు. శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలైన అనంతరం ఆయన తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీని జైలు అధికారులు స్వీకరించినప్పటికీ ఆయనను అక్రమ నిర్బంధంలో ఉంచారని అన్నారు. నిందితులను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నట్లు న్యాయవాది తెలిపారు.

ఁఆర్డర్ కాపీ అందుకున్నప్పటికీ, వారు ఆయ‌న‌ను (అల్లు అర్జున్‌) విడుదల చేయలేదు. మీకు ఆర్డర్ వచ్చిన వెంటనే, మీరు నటుడిని విడుదల చేయాలని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ, వారు అలా చేయ‌లేదు. కావాల‌నే ఆయ‌న‌ను అక్ర‌మ నిర్బంధంలో ఉంచారు. దీనిపై మేము చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల కోసం పోరాడుతాంఁ అని న్యాయ‌వాది అశోక్ రెడ్డి చెప్పారు.జైలు అధికారులకు బెయిల్‌ ఆర్డర్ అందడంలో ఎలాంటి జాప్యం లేదని బ‌న్నీ త‌ర‌ఫు న్యాయవాదుల‌ బృందం పేర్కొంది. తాము హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని త‌క్ష‌ణ‌మే సమర్పించామని తెలిపింది. హైకోర్టు మెసెంజర్ కూడా ఒక కాపీని అధికారులకు అందించారని పేర్కొంది.అయితే, తమకు అర్థరాత్రి బెయిల్ ఆర్డర్ వచ్చిందని, జైలు మాన్యువల్ ప్రకారం ఖైదీలను రాత్రి సమయంలో విడుదల చేయలేమని, మరుసటి రోజు ఉదయం నటుడిని విడుదల చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. ఇక తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్‌కు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. దాంతో దాదాపు 12 గంటల తర్వాత ఈరోజు ఉదయం 6.40 గంటలకు జైలు నుంచి ఆయ‌న విడుదలయ్యారు. ఇక విడుదలైన వెంటనే బ‌న్నీ తన కుటుంబ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌కు వెళ్లారు. అక్క‌డ‌ తన లాయర్లతో సుమారు గంటసేపు మాట్లాడారు.

తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు!

ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని, షెడ్యూల్ ఖరారు చేసే అంశం తుది దశలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ దాదాపుగా ఖరారైందని వివరించాయి. వచ్చే వారంలో అధికారికంగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అనధికారిక సమాచారం ప్రకారం.. మార్చిలో పరీక్షలు నిర్వహించాలని, ఆ నెలాఖరులోగా అన్ని పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా మార్చి 3వ తేదీ నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభిచనున్నట్లు సమాచారం. ఇంటర్ అన్ని గ్రూపులకు చెందిన పరీక్షలు నిర్వహించేందుకు దాదాపు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. నెలాఖరులోగా పరీక్షలు పూర్తిచేయాలంటే మార్చి 3న పరీక్షలు ప్రారంభించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఇక, ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ ఫిబ్రవరిలో పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షల ఫీజు గడువు డిసెంబర్ 3 తో ముగియగా ఆలస్య రుసుముతో జనవరి 2 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఇంటర్ బోర్డ్ కల్పించింది. రూ.2 వేల ఆలస్య రుసుముతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 9 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతారని ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. దీనికి తగ్గట్లు రాష్ట్రంలో పరీక్షలకు ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు.

పాఠకులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి..

జిల్లా గ్రంధాలయ ముఖ్య కార్యదర్శి రమ
విశాలాంధ్ర -ధర్మవరం:: పాఠకులు అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ గ్రంథాలయ అభివృద్ధికి మంచి గుర్తింపు తీసుకొని రావాలని జిల్లా గ్రంథాలయ శాఖ ముఖ్య కార్యదర్శి రమా తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణములోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన గ్రంథాలయ శాఖను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను వారు పరిశీలించారు. గ్రంధాలయ పండు బకాయిలను వెంటనే వసూలు చేయాలని వారు ఆదేశించారు. అంతేకాకుండా పాఠకుల సభ్యత్వములు పెంచేలా కృషి చేయాలని తెలిపారు. పాటకల నుండి ఎటువంటి ఫిర్యాదులు అందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గ్రంథాలయ రికార్డులు సక్రమంగా ఉన్నాయని తెలుపుతూ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని అంజలీ సౌభాగ్యవతి, సిబ్బంది సత్య నారాయణ, శివమ్మ, రమణ నాయక్, గంగాధర్ తో పాటు అధిక సంఖ్యలో పాఠకులు పాల్గొన్నారు.

రక్త దానం మరొకరికి ప్రాణదానం అవుతుంది..

16వ వార్డ్ కౌన్సిలర్ కేతా లోకేష్
విశాలాంధ్ర ధర్మవరం:: రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందని 16వ వార్డు కౌన్సిలర్ కేతా లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వైఎస్సార్ విగ్రహం వద్ద జరిగిన రక్తదాన శిబిరంలో వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బీరే శ్రీరాములు మాట్లాడుతూ ఈ శిబిరం చౌడేశ్వరి సేవా సమితి, రెడ్ క్రాస్ సొసైటీ తరఫున నిర్వహించడం జరిగిందని తెలిపారు. రక్త దానం చేసి, ప్రాణదాతలు కావాలని తెలిపారు. రక్తదానం చేయడం వలన ఎటువంటి అనారోగ్యము కలగదని తెలిపారు. ఈ శిబిరంలో 52 మంది రక్తదాతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. అనంతరం ముఖ్య అతిధిని ఘనంగా సన్మానించారు. రక్తదాతలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాముడు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు జయసింహ, డాక్టర్ సత్య నిర్ధారన్, బోనాల శివయ్య, దాసరి మంజు,రక్తదాతలు పాల్గొన్నారు.

ఘనంగా మానవ హక్కుల దినోత్సవం వేడుకలు..

ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన, రాజనీతి శాస్త్రం విభాగ అధిపతి డాక్టర్ బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు నడుమ ఘనంగా మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
అనంతరం ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ చిట్టెమ్మ మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్ధం తర్వత ఐక్యరాజ్యసమితి, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన 1948 డిసెంబర్ 10.తేదీ నాడు ప్రపంచ మానవళికిహక్కులు ప్రసాదం ఇవ్వడం జరిగిందని తెలియచేసారు. ప్రపంచంలోని అన్ని దేశాలు మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాయని, రాజ్యాంగంలోని పౌరులకు కల్పించిన హక్కులను అవగాహన చేసుకుని, వృద్ధి చెందాలని తెలిపారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, కార్మికులు, వెనుకబడిన వర్గాలతో పాటు ఇతర వర్గాలు తమ హక్కుల ఉల్లంఘనను గుర్తించి, హక్కులను కాపాడుకుంటూ దేశాభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. సమాజంలో మానవ హక్కుల ఉల్లంఘన పట్ల విద్యార్థులు జాగ్రత్త వహించి, తమ హక్కులను కాపాడుతూ, తోటి వారి హక్కులకు భంగం కలిగించకుండా, మంచి పౌరులుగా ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పావని, కిరణ్ కుమార్, భువనేశ్వరి, పుష్పావతి,మీనా, ఆనందు. తదితర అధ్యాపక బోధనేతర బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

వసతిగృహాల నిర్మాణ, మరమ్మత్తు పనులు సంక్రాంతిలోపు త్వరితగతిన పూర్తి చేయాలి

వసతి గృహాలలో సీసీ కెమెరా ఏర్పాటు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర -అనంతపురం : వసతిగృహాల నిర్మాణ, మరమ్మత్తు పనులు వచ్చే సంక్రాంతిలోపు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన విద్యా, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 11 సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లకు డిస్టిక్ మినరల్ ఫండ్ ద్వారా జిల్లాకు కోటి 12 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని, దీనికి సంబంధించి  పది హాస్టల్లో పనులు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన ఒకటి కూడా పూర్తి చేసి అధికార ప్రజా ప్రతినిధులతో ప్రారంభోత్సవం గావించాలన్నారు. ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన 5 కోట్ల 70 లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగిందని, వాటిని ఏపీఈడబ్ల్యూఐడిసి మరియు పంచాయతీరాజ్  ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా 36 హాస్టల్ కు సంబంధించిన పనులన్నీ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని, వసతి గృహాల వద్ద నిఘా ఏర్పాటల్లో భాగంగా సీసీ కెమెరాలు ఇప్పటికే టెండర్లు పూర్తి అయ్యాయని, వాటిని త్వరితగతిన ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జిల్లా పరిషత్ నుండి కేటాయించిన నిధులను జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సమాన నిష్పత్తిలో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కేటాయించి, వసతి గృహాలలో ప్రాముఖ్యత కలిగిన పనులను గుర్తించి, వాటిని పూర్తి చేయు విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని వసతి గృహాలలో ట్యూటర్లను రెండు వారాలలోపు  నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ సంబంధించిన పనులన్నీ సంక్రాంతి లోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. విద్యా, అనుబంధ శాఖలు మనకున్నటువంటి అన్ని శాఖల కంటే చాలా ముఖ్యమైనది మరియు  ప్రాముఖ్యమైనదని కావున ప్రతి ఒక్క అధికారి కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలని అధికారులకు తెలియజేశారు. ప్రతి ఒక్క అధికారి కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి సమస్యలను గుర్తించి వాటిని అధికమించేందుకు ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డి డి ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి, ఏపీఎం నాగరాజు, జిల్లా ఉపాధి కల్పన అధికారిని కళ్యాణి, మైనారిటీ వెల్ఫేర్ అధికారి జిల్లా అధికారి రామ సుబ్బారెడ్డి,బిసి వెల్ఫేర్, డిటిడబ్ల్యూఓ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

దేవాలయ భూములను ఆక్రమించిన వారికి నోటీసులు

-తహశీల్దార్ పి.విజయకుమారి

విశాలాంధ్ర-రాప్తాడు : గ్రామంలో ఉన్న దేవాలయ భూములను ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేస్తామని తహశీల్దార్ పి.విజయకుమారి అన్నారు. మండలంలోని బుక్కచెర్ల గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములకు అన్ని పత్రాలు, రికార్డులు ఉన్నా ఆన్లైన్లో నిషేదిత భూములుగా నమోదయ్యాయని సమస్యను పరిష్కరించాలని ఓ రైతు కోరారు. వివిధ భూసమస్యలపై రైతులు పలు అర్జీలు అందజేశారు. దేవాదాయ శాఖ ఈఓ సుధారాణి మాట్లాడుతూ దేవాదాయ భూములను ఎలాంటి హక్కు లేకుండా ఇతరులు సాగు చేస్తున్నారని, వీటిని దేవుని తరపున మాత్రమే లీజుకు ఇస్తామన్నారు. దేవుని మాన్యం భూములను రెవెన్యూ రికార్డుల్లో ప్రయివేటు వ్యక్తులు నమోదు చేసుకున్నారని వాటిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆదినారాయణమ్మ, ఆర్ఐ కరుణాకర్, వీఆర్ఓ సాయి, పంచాయతీ కార్యదర్శి నవీన్, ఫీల్డ్ అసిస్టెంట్ ఓబిలేసు, నాయకులు శ్రీనివాసరెడ్డి, ఓబిలేసు, బ్రహ్మానందరెడ్డి సచివాలయ సిబ్బంది, వీఆర్ఏ తలారి కర్ణ తదితరులు ఉన్నారు.