Monday, May 12, 2025
Home Blog Page 300

ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు : అఖిల భారత యువజన సమాఖ్య జిల్లాముఖ్య కార్యకర్తల సమావేశం రామకోటయ్య భవన్ లో షేక్ మున్నా అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మహంకాళి సుబ్బారావు హాజరైనారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ
అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లా లోఫిబ్రవరి 6,7,8,9 తేదీల్లోనిర్వహించడం జరుగుతుందని తెలిపారు..పాలకుల విధానాల వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనిఆరోపించారు.
2018 గ్రూప్-1 నియామకాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీఐ తో ఎంక్వైరీ చేయించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారం మెయిన్స్ పరీక్ష ను మరల నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.యువత
కు ఉపాధి దొరకకపోవడంతో దేశంలోప్రతి రోజు40నుంచి 45మందివరకు నిరుద్యోగులు స్వయంఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి అని తెలిపారు. విద్య ,వైద్యం,ఉపాధి,భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులు గాగుర్తించినా విద్య వ్యాపారంగామారిందని వైద్యంఅందరికీ అందడంలేదని చదువుకున్న నిరుద్యోగులకుఉ

పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో చంద్రబాబు, నారా లోకేశ్

బాపట్ల మున్సిపల్ స్కూల్ లో చంద్రబాబు, లోకేశ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాపట్లలో పర్యటిస్తున్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు, ఉపాధ్యాయులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి మార్కులు, ఐక్యూ తదితర అంశాలను ట్రాక్ చేయాలని… యూనివర్శిటీ స్థాయి వరకు ట్రాకింగ్ జరగాలని చెప్పారు. ఈ ట్రాకింగ్ వల్ల ఏ విద్యార్థికి దేనిపై ఆసక్తి ఉంది… సదరు విద్యార్థి ఏం చదివితే బాగుంటుందనే విషయం అర్థమవుతుందని అన్నారు. 9వ తరగతి నుంచి కంప్యూటర్ విద్యను బోధించాలని సూచించారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థిని, ఆమె తండ్రితో చంద్రబాబు ముచ్చటించారు. విద్యార్థిని మార్క్స్ రిపోర్టును ఆయన పరిశీలించారు. ఆమె ఆసక్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రూమ్ లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఇంకోవైపు కడప మున్సిసల్ హైస్కూల్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకున్నారు. టీచర్స్, పేరెంట్స్ మీటింగ్ లో ఆయన పాల్గొంటున్నారు.

జయలలిత ఎస్టేట్ లో దోపిడీ కేసు.. శశికళ, పళనిస్వామిల విచారణకు అనుమతినిచ్చిన కోర్టు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత ఆమెకు చెందిన ఎస్టేట్ లో పలు విలువైన వస్తువులు మాయమయ్యాయి. కొడనాడు ఎస్టేట్ లో జరిగిన ఈ దోపిడీ కేసులో మద్రాస్ హైకోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మాజీ సీఎం పళనిస్వామితో పాటు జయలలిత సన్నిహితురాలు శశికళను విచారించేందుకు అనుమతిచ్చింది. గతంలో వీరిని విచారించ వద్దంటూ జిల్లా కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. సీబీసీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జయలలితకు సంబంధించిన కొడనాడు ఎస్టేట్ లో 2017 లో సెక్యూరిటీ గార్డ్ ఓం బహదూర్‌ హత్య జరిగింది. ఆపై ఎస్టేట్ లోని పలు విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయి. ఈ కేసులో తొలుత పోలీసులు దర్యాఫ్తు జరిపినా ఫలితం లేకుండా పోయింది. కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో డీఎంకే అధికారంలోకి వచ్చాక సీఐడీకి అప్పగించింది. విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు.. ఈ కేసులో ఇప్పటి వరకు 100 మందిని విచారించి 10 మందిని అరెస్టు చేశారు. సీఐడీ దర్యాఫ్తు చేపట్టిన తర్వాత పళనిస్వామి, శశికళ కోర్టును ఆశ్రయించి తమను విచారించకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీనిపై సీఐడీ అధికారులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పళనిస్వామి, శశికళ, ఇళవరసిలను ప్రశ్నించేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరి మృతి

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే.. ఇవాళ ఉదయం ఫ్లోర్ మార్కెట్ ఏరియాలో దుండగులు సునీల్ జైన్ అనే వ్యక్తిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో సునీల్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు అక్కడున్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ వైపు పార్లమెంట్ సమాశాలు జరుగుతోన్న నేపథ్యంలో రాజధానిలో కాల్పుల ఘటన సంచలనం సృష్టిస్తోంది.

బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం!

ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం

ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ 12 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో 11, 12 తేదీల్లో తమిళనాడులో, 12న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతేకాదు, అల్పపీడనం వాయుగుండంగానూ మారే అవకాశం ఉందన్నారు.

నేడు బాప‌ట్ల‌లో సీఎం చంద్రబాబు ప‌ర్య‌ట‌న

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ బాపట్లలో పర్యటించనున్నారు. బాపట్లలోని మున్సిపల్ హైస్కూల్ లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో సీఎం పాల్గొంటారు. వ్యక్తిత్వ వికాసంతో కూడిన విద్యను విద్యార్థులకు బోధించడం, స్వీయ క్రమశిక్షణను నేర్పించడం వంటి అంశాలపై ఉపాధ్యాయులకు ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు. పాఠశాలల అభివృద్ధికి సహకరించిన పూర్వ విద్యార్థులను చంద్రబాబు సత్కరించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బాపట్లలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్టు జిల్లా ఎస్సీ తుషార్ తెలిపారు. చీరాల నుంచి బాపట్ల మీదుగా పొన్నూరు, గుంటూరు వైపు వెళ్లే వాహనాలనుౌ అంబేద్కర్ సర్కిల్, జమ్ములపాలెం ఫ్లైఓవర్, ఉప్పరపాలెం ఇందిరాగాంధీ సర్కిల్, దర్గా మీదుగా దారి మళ్లిస్తున్నట్టు చెప్పారు.

సిరియాలోని భారతీయ పౌరులు తక్షణమే వచ్చేయాలని విదేశాంగ శాఖ సూచన

సిరియాలో ఉన్న భారతీయ పౌరులు ఆ దేశాన్ని వీడి రావాలని కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. తదుపరి సూచన చేసేవరకు సిరియాకు ఎవరూ ప్రయాణించవద్దని అప్రమత్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం పొద్దుపోయాక భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అడ్వైజరీ విడుదల చేసింది. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని కూడా షేర్ చేసింది. డమాస్కస్‌లోని ఇండియన్ ఎంబసీ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలని అక్కడి భారతీయులకు సూచించింది. కమర్షియల్ విమానాలు అందుబాటులో ఉండి సిరియా నుంచి వచ్చేయగలిగేవారు వీలైనంత త్వరగా బయలుదేరండి. తక్షణమే బయలుదేరలేనివాళ్లు అత్యంత అప్రమత్తంగా ఉండండి. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. వీలైనంత వరకు బయటకు వెళ్లకండి. డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించేందుకు హెల్ప్‌లైన్ నంబర్ 963 993385973 సంప్రదించండి. ఈ నంబర్‌కు వాట్సాప్‌ సదుపాయం కూడా ఉంది. అత్యవసర ఈ-మెయిల్ ఐడీ ద్వారా ఎంబసీ సిబ్బందిని కూడా సంప్రదించి ఎప్పటికప్పుడు సలహాలు అడగవచ్చు అని అడ్వైజరీలో విదేశాంగ శాఖ పేర్కొంది.

కాగా సిరియాలో రాజకీయ సంక్షోభం నెలకొంది. రష్యా, ఇరాన్ మద్దతు ఉన్న అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తిరుగుబాటు గ్రూపులు, మిలిటెంట్లు ప్రయత్నిస్తున్నారు. టర్కీ మద్దతు ఉన్న ఈ తిరుగుబాటు దళాలు గత వారం రోజులుగా సిరియాలో తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌ను పడగొట్టడమే లక్ష్యమని ప్రకటించాయి. దీంతో సిరియాలో తీవ్రమైన కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.

వైభవంగా ప్రారంభమైన షష్టి మహోత్సవాలు

0

విశాలాంధ్ర, ముదినేపల్లి : ముదినేపల్లి మండలం సింగరాయపాలెం-చేవూరుపాలెం సెంటర్లో వేంచేసి యున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవాలు స్వామివారిని పెండ్లి కుమారుడు చేయుటతో ప్రారంభమయ్యాయి. ఈ షష్టి ఉత్సవాలు ఈనెల 18 వరకు కొనసాగనున్నాయి. ఈ తెల్లవారుజామున ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ , ప్రముఖులు శ్రీ స్వామివారి పుట్టలో పాలు పోయడంతో ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల్లో 6న శ్రీస్వామి వారిని అమ్మవార్లను పెండ్లి కుమారుడు , కుమార్తెను చేయుట , విగ్నేశ్వరపూజ , పుణ్యాహవాచన , పంచగవ్యప్రాసన , అంకురారోపణ , అగ్నిప్రతిష్టాపన , ద్వజారోహణ , నిత్వౌపాసన , బలిహరణ. 7న శ్రీస్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము. 9న కళ్యాణ రథయాత్ర. 10న పుష్కరిణిలో శ్రీస్వామి వార్ల తెప్పోత్సవము. 11న శ్రీస్వామివారికి ,మహాన్యస పూర్వక ఏకాదశి మహా రుద్రాభిషేకము , సహస్త్ర లింగార్చన , లక్షబిల్వార్చన , సాయంత్రం సహస్త్ర దీపాలంకరణ. 12న అష్టోత్తర శతకలశార్చన అభిషేకము. 13న సుబ్రహ్మణ్య హవనం. 15న ద్వజావరోహణ , ద్వాదశ ప్రదక్షణలు , శ్రీస్వామివార్ల పుష్పయ్యాలంకృత పర్యంకసేవ. 18న అన్నదాన మహా యజ్ఞ అన్నసమారాధన. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పారిశుద్ధ్యం , వైద్యం , క్యూ లైన్ల బారికెట్లు ఏర్పాటు చేసి శ్రీస్వామివారి దర్శనం శీఘ్రముగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయసహాయ కమిషనర్ రుద్రరాజు గంగా శ్రీదేవి తెలిపారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులుగా బొంగు రవికుమార్ , వెనిగళ్ళ సురేష్ , నీలం శివరమేష్ , పరసా కృష్ణ , బురుబోయిన సోవమ్మ , కొట్టి సుబ్బలక్ష్మి , దగాని నాగలక్ష్మి , బెజవాడ నాగ వెంకటరాధాకృష్ణ , పరసా రమేష్ లను దేవాదాయ శాఖ నియమించినట్లు రుద్రరాజు గంగాశ్రీదేవి తెలిపారు.

రానున్న మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి వర్షాలు

0


తెలంగాణలో రానున్న మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. రేపు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆ తర్వాత రెండు రోజులు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా రేపు ఉదయం పొగమంచు ఏర్పడే అవకాశముందని వెల్లడించింది.వచ్చే వారం రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని వెల్లడించింది.

అయ్యప్ప స్వాములకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు ఏర్పాటు

డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణము, గ్రామీణ ప్రాంతాలలో అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తాదులకు ధర్మవరం ఆర్టీసీ డిపో నుండి శబరిమలకు ప్రత్యేకంగా బస్సులను నిర్వహిస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవము నైపుణ్యం గల ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేశామని, ఐదు రోజుల ప్రయాణంతో కూడిన ప్యాకేజీ ముగ్గురు స్వాములకు ఉచితంగా ప్రయాణించడానికి వెసలపాటు కలిగించడం జరిగిందని తెలిపారు. కిలోమీటర్ కి సూపర్ లగ్జరీ 57 రూపాయలు ఎక్స్ప్రెస్ సర్వీస్ కి 62 రూపాయలు ఛార్జి వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 15వ తేదీ పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరి ప్రదర్శన కాణిపాకం గోల్డెన్ టెంపుల్ దర్శనార్థం ధర్మవరం ఆర్టీసీ డిపో నుండి ఈనెల 14వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అందులకు రానుపోను చార్జీ 1400 రూపాయలు మాత్రమేనని తెలిపారు. దర్శనానికి వెళ్లవలసిన భక్తాదులు ఆన్లైన్లో గాని బస్టాండ్ రిజర్వేషన్ కౌంటర్లో గాని సీట్లు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కలదని తెలిపారు. భగవంతుని సేవలో భక్తులు- భక్తుల సేవలో ఏపీఎస్ఆర్టీసీ ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 6303151302 కూగాని 9959225859 కు గాని సంప్రదించాలని తెలిపారు.