Monday, January 13, 2025
Home Blog Page 38

26 సార్లు రక్తదానం చేసిన కన్నా వెంకటేష్

విశాలాంధ్ర ధర్మవరం;! పట్టణంలోని రక్త బంధం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు కన్నా వెంకటేష్ 26 సార్లు రక్తదానం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు భాగంగా ధర్మారం నుండి కర్నూలుకు వెళ్లి అక్కడ 26వ సారిన రక్తదానం నిర్వహించడం జరిగిందని కన్నా వెంకటేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటివరకు తాను స్వచ్ఛందంగా ప్లేట్లెట్స్ 26 సార్లు, రక్తదానం 26 సార్లు వెరసి 52 సార్లు ఇవ్వడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. కేవలం అభిమానం మాత్రమే తాను ఈ రక్తదానం చేయడం జరిగిందని, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తి రక్తదానం చేసి ఇరువురు ప్రాణాలను కాపాడాలని, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ మానవతా విలువలను పెంపొందింప చేయాలని తెలిపారు.

ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని నైరా ఎరిటేడ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ గోపాల్ నాయక్ పాల్గొన్నారు.ఈ వేడుకలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కరస్పాండెంట్ శ్వేతా అరవపల్లి , ప్రిన్సిపాల్ మల్లికార్జున, వెంకటేష్ చురుగ్గా పాల్గొని గణిత శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం గణితశాస్త్ర పజిల్స్, క్విజ్‌లు ,ఇంటరాక్టివ్ గేమ్‌లతో సహా వివిధ ఆకర్షణీయమైన కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి, గణితాన్ని నేర్చుకోవడం సరదాగా ఆనందించేలా రూపొందించబడింది.
ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈవో గోపాల్‌ నాయక్‌ ప్రసంగిస్తూ నిత్యజీవితంలో గణితం కీలకపాత్ర పోషిస్తూ విద్యార్థుల కెరీర్‌ను తీర్చిదిద్దడంలో దాని ప్రాముఖ్యతను తెలియజేశారు. విద్యార్థులు తమ అకడమిక్ సాధనలో మరియు భవిష్యత్తు ప్రయత్నాలలో రాణించేందుకు గణితంలో బలమైన పునాదిగా పెంపొందించుకోవాలని ఆయన విద్యార్థులకు తెలియజేశారు.
కరస్పాండెంట్ శ్వేత , ప్రిన్సిపల్ మల్లికార్జున వెంకటేష్‌ కూడా విద్యార్థుల్లో గణితంపై ప్రేమను పెంపొందించాల్సిన ప్రాముఖ్యతను తెలియజేసారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో ఉపాధ్యాయుల అంకితభావం, కృషికి వారు అభినందనలు తెలిపారు.
గణితశాస్త్రం యొక్క శక్తికి పునరుద్ధరణ కృతజ్ఞతా భావంతో ఈవెంట్ ముగిసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, బోధ నేతర సిబ్బంది పాల్గొన్నారు.

కీర్తిశేషులు ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు కొరకు సంకల్ప మండల దీక్ష చేపట్టిన నర్సింహులు

విశాలాంధ్ర ధర్మవరం : కీర్తిశేషులు ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ప్రభుత్వం ఇవ్వాలని కోరుతూ సంకల్ప దీక్షను బి ఎల్ నరసింహులు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ తాను తాసిల్దార్ కార్యాలయ ఆవరణ ముందు 41 రోజులు పాటు సంకల్ప మండల దీక్షలు చేపడుతానని తెలిపారు. తెలుగు రాష్ట్రానికి కీర్తిశేషులు ఎన్టీఆర్ చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివని తెలిపారు. భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం వెనివెంటనే ప్రకటించాలని తెలిపారు. ఈ సంకల్ప మండల దీక్ష ఉదయం పదిగంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగిస్తానని తెలిపారు. ఈ దీక్ష పట్ల పలువురు మద్దతు పలికారు.

లబ్ధిదారులకు సొంత గృహాలను నిర్మించడమే ఎన్ డి ఏ ప్రభుత్వము యొక్క లక్ష్యం..

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; లబ్ధిదారులకు సొంత ఇల్లును నిర్మించడమే ఎన్ డి ఏ ప్రభుత్వము యొక్క ముఖ్య లక్ష్యము అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి గృహాలను నిర్మించుకోలేని లబ్ధిదారులకు నేడు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నిర్మించుతామని, ఎస్టీలకు 75000 ఎస్టీలకు చేనేతలకు అదనంగా 50,000 చెల్లిస్తున్నామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు వారు తెలియజేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వం లో జనసేన తెలుగుదేశం పార్టీల కార్యకర్తలను ఎన్నో హింసలకు గురిచేసి, ప్రభుత్వ పథకాలు అన్నింటికీ దూరం చేయడం జరిగిందని తెలిపారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులందరికీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి చేయాలనే వారి ధ్యేయము అని వారు స్పష్టం చేశారు. కాబట్టి ఇకనైనా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.

జనసేన పార్టీలోకి చేరిక:: నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం తంబాపురం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు బత్తలపల్లి మండల అధ్యక్షులు పురం శెట్టి రవి రమణారెడ్డి సంజీవరెడ్డి ల ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా చిలక మధుసూదన్ రెడ్డి వారందరికీ పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు ఎల్లప్పుడూ కృషి చేయాలని తెలిపారు, తాను అన్నివేళలా అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చినా ముందు ఉంటానని వారు స్పష్టం చేశారు.

పేదల పెన్నిధి వైయస్ జగన్మోహన్ రెడ్డి… వైఎస్సార్సీపి పట్టణ నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో వైయస్సార్ సిపి పార్టీ ధర్మవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేతిరెడ్డి సోదరుడు వెంకటకృష్ణారెడ్డి హాజరై, తన చేతుల మీదుగా కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైయస్సార్ విగ్రహానికి పూలల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి,గుర్రం శ్రీనివాస్ రెడ్డి, చందమూరి నారాయణరెడ్డి, బాల్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చడం జరిగిందని తెలుపుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వారు కొనియాడారు. ఎన్నికల సమయాలలో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చడం జరిగిందన్నారు. పేదల పెన్నిధి వైయస్ జగన్ రెడ్డి అని, వైసిపి హయాంలోనే పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని తెలిపారు. నేటి కూటమి ప్రభుత్వం ఎన్నో అపద్దాల హామీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయకుండా మోసం చేసిందని వారు ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పేదల పక్షాన నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ రమేష్, బడన్నపల్లి కేశవరెడ్డి, ముసవల్లి, సాయి, చౌడప్ప ,బాల్రెడ్డి, కునుటూరు గోపాల్ ,సుభాన్, కరీం, వార్డు కౌన్సిలర్లు, నాయకులు,ఇన్చార్జిలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

భారత కమ్యూనిస్ట్ పార్టీ (సి పి ఐ) జిల్లా కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న జగ్గయ్యపేట సమితి

విజయవాడ : భారత కమ్యూనిస్ట్ పార్టీ(సి పి ఐ) యన్.టి.ఆర్ జిల్లా సమితి సమావేశం విజయవాడ హనుమాన్ పేట లోని పార్టీ జిల్లా ఆఫీస్ లో జరిగింది.ఈ సమావేశం జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించగా,ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి ఆర్. రామకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతి పార్టీ సభ్యులు కృషి చేయాలని,ముఖ్యంగా పార్టీ లో యువతను ప్రోత్సహించి పార్టీ లో చేరేలా చూడాలని వారు తెలియజేశారు.దీర్ఘకాలంగా ఉన్న ప్రధాన సమస్యలపై పార్టీ పోరాడాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గ,పట్టణ సమితి కార్యదర్శులు అంబోజి శివాజీ,జూనెబోయిన శ్రీనివాసరావు,పట్టణ సహాయ కార్యదర్శి మాశెట్టి రమేష్,పార్టీ సభ్యులు మెటికల శ్రీనివాసరావు లు పాల్గొన్నారు.

రేయిన్ బో పాఠశాలలో సెమి క్రిస్మస్ వేడుకలు

0

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాలలో కరస్పాండెంట్ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆర్ సి ఎం చర్చి ఫాదర్ సంజీవరావు హాజరై క్రిస్మస్ సందేశమిచ్చారు. లోక కళ్యాణం నిమిత్తం యేసుక్రీస్తు మనుష్యు కుమారునిగా కన్యక మరియ గర్భం నందు ఈ లోకంలో జన్మించారని తెలిపారు. ప్రతి విద్యార్థి మంచి నడవడిక, నైతిక విలువలు పెంపొందించుకోవాలన్నారు. అలాగే ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం చిన్నారులు క్రిస్మస్ పుట్టుకకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం రంగారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఉపాధ్యాయులు పుల్లయ్య, రామకృష్ణ, శామ్యూల్, నాగరత్నమ్మ, జయశ్రీ, అనిత, రేఖ, కలావతి, ప్రత్యూష పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ పురస్కారాన్ని అందుకున్న మండ్లి కిషోర్ కుమార్

విశాలాంధ్ర -అనంతపురం : నగరంలోని సి.వి.ఆర్ పాఠశాల నందు ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేయుచున్న డాక్టర్ మండ్లి కిషోర్ కుమార్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. డాక్టర్ చివుకుల హనుమంతరావు చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు వారు డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం జాతీయ పురస్కారాన్ని మండ్లి కిషోర్ కుమార్ అందుకున్నారు. ఈ పురస్కారాన్ని వారు ఇస్రో శాస్త్రవేత్త కే.రామ్మోహన రావు, గుంటూరు జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజశేఖర్ చేతులమీదుగా అందుకోవడం జరిగినది. ఈ పురస్కారాన్ని అందుకున్నందుకు పాఠశాల సిబ్బంది హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రస్థాయి జూడో పోటీలకు రేయిన్ బో విద్యార్థులు ఎంపిక

0

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : రాష్ట్రస్థాయి జూడో పోటీలకు మండల కేంద్రమైన పెద్దకడబూరులోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల విధ్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ గోవిందరెడ్డి సోమవారం తెలిపారు. ఆలూరు జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న షోహత్ అలి (52ఖస్త్ర),అమరేష్ (36 ఖస్త్ర), 7వ తరగతి చదువుతున్న శివ (45ఖస్త్ర) ల జూడో పోటీల్లో ప్రతిభ చాటి విజేతలుగా నిలిచారు. విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు అంజి ఆధ్వర్యంలో కరస్పాండెంట్ గోవిందరెడ్డి, ఉపాధ్యాయులు ప్రసాద్, పుల్లయ్య, రామకృష్ణ, శామ్యూల్ అభినందించారు.

అమరావతి నిర్మాణం… మరో రూ. 2,723 కోట్ల పనులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రపంచ బ్యాంకు అండతో అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరుగులు పెట్టించే పనిలో ఉన్నారు. తాజాగా అమరావతిలో మరో రూ. 2,723 కోట్ల పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. సీఆర్డీయే 44వ సమావేశంలో ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 12 నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. మరోవైపు, ఇప్పటి వరకు రూ. 47,288 కోట్ల విలువైన పనులకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది.