Sunday, May 11, 2025
Home Blog Page 4

పల్లకి ఉత్సవములో ఊరేగిన చెన్నకేశవుడు..

ఆలయ ఈవో వెంకటేశులు, అడ హక్ కమిటీ చైర్మన్ చెన్నంశెట్టి జగదీశ్వర ప్రసాద్
విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం వారి బ్రహ్మోత్సవ వేడుకలు 5వ రోజు దాతలు, భక్తాదులు, ఆలయ ఈవో వెంకటేశులు, అడహక్ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఉదయంపల్లకి ఉత్సవంలో స్వామివారు పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. తొలుత అర్చకులు కోనేరాచార్యులు, మకరందబాబు ,చక్రధర్ లు వేదమంత్రాలు ,మంగళ వాయిద్యాలయం ప్రత్యేక అర్చనలు, పూజలు చక్కటి అలంకరణ గావించారు. వాహనానికి ఉభయ దాతలుగా వ్యవహరించిన వారి పేరిటన ప్రత్యేక పూజలను నిర్వహించారు. తదుపరి వారిని చైర్మన్ ఘనంగా శాలువాతో సత్కరించారు. తదుపరి పట్టణ పురవీధుల గుండా ప్రత్యేకమైన వాహనంలో స్వామివారు ప్రజల దర్శనార్థం ఊరేగించారు. ఈ సందర్భంగా అన్నమయ్య సేవా మండలి అధ్యక్షులు పోరాల్ల పుల్లయ్య వారి శిష్య బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉభయ దాతలతో పాటు పట్టణ పుర ప్రముఖులు, ఆలయ సిబ్బంది రామశాస్త్రి, మల్లికార్జున, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తెలుగు కథలు, ఇంగ్లీష్ గ్రామర్ పై మెలకువలపై అవగాహన..

గ్రంథాలయ అధికారిని. అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో 9వ రోజు తెలుగు కథలు, ఇంగ్లీష్ గ్రామర్పై మెలకువలను, శిక్షణగా ఇవ్వడం జరిగిందని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ చదువుతోపాటు తెలుగు ఇంగ్లీష్ విషయాలపై
మెలుకువలను తెలుసుకున్నప్పుడు ఎంతో ఉపయోగపడుతుందని, సులభతరం అవుతుందని తెలిపారు. ధ్యాన యోగం కూడా శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో చదువు, పోటీ పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన అంశాలకు గల పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి అంతేకాకుండా మా గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు కూడా నిర్వహిస్తున్నామని కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినచో, రుసుమును దాతల ద్వారా సేకరించడం జరుగుతుందని ఇటువంటి అవకాశాన్ని కూడా పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.

నేత్రదానం చేసిన వృద్ధుడు.. విశ్వదీప సేవా సంఘం

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన కోదండ రామాలయ సభ్యులు అన్నం వెంకటనారాయణ మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల అనుమతి మేరకు విశ్వదీప సేవా సంఘం వారు నేత్రదానంపై అవగాహన కల్పించి కుటుంబ సభ్యుల సహకారంతో విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కుళ్లాయప్ప, కంటి రిట్రోల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర, భాస్కర్, విజయ్ భాస్కర్ రెడ్డి, కంటి వైద్యులు డాక్టర్ నరసింహులు నేత్రాలను సేకరించారు. నేత్రానికి సహకరించిన కుటుంబ సభ్యులకు విశ్వదీప సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు పి. చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షులు సురేష్ ,ఉపాధ్యక్షులు శేఖర్ రెడ్డి తోపాటు సుబ్రహ్మణ్యం, జుజారు రఘు, కేశవరెడ్డి, ధనుంజయ, మాధవ, ప్రభాకర్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇసుక అక్రమ రవాణాను అధికారులు అరికట్టండి.. ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర -ధర్మవరం; ధర్మవరం డివిజన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాను సంబంధిత అధికారులు తప్పక అరికట్టాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డిఓ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు, గనుల అధికారులకు సమావేశాన్ని ఆర్డిఓ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అక్రమంగా ఇసుక రవాణా తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. మండల స్థాయి సిబ్బందికి అక్రమ రవాణా నివారణ చర్యల అమలులో తీసుకోవలసిన చర్యలు గూర్చి వివరించడం జరిగిందని తెలిపారు. అక్రమ రవాణా జరిగినట్లు రుజువైతే రవాణా చేయు వ్యక్తులు వాహనములను సీజ్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇసుక రవాణా పర్యవేక్షక ఇన్చార్జులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ విభాగం అధికారులు పాల్గొన్నారు.

డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు..

లాయర్ బాలసుందరి, ఎం ఎల్ ఎస్ ఏ లక్ష్మీదేవి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవో హోం లో హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టు జడ్జిల ఆదేశాల మేరకు డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సులను లాయర్ బాలసుందరి, ఎమ్మెల్యే లక్ష్మీదేవి, పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలను డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాలని, అట్లు పాటించని యెడల కఠిన చర్యలు చట్టపరంగా తీసుకోబడును అని తెలిపారు. కార్మికుల హక్కులు, ఇన్సూరెన్స్లు, ఈస్ట్రన్ కార్డ్స్, లేబర్ ఆక్ట్ ,ఉచిత న్యాయ సహాయం, మండల న్యాయ సేవా కమిటీ మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ వారు న్యాయ సహాయమును అందిస్తారని తెలిపారు. కానిస్టేబుల్ శివానంద మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవని తెలిపారు. కావున డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు.

అమర జవాన్లకు ఆదర్శ పార్కులో నివాళులు..

ఆదర్శ సేవా సంఘం, ఆదర్శ పార్కు కమిటీ.
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల ఏడవ తేదీన మన భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసి మన దేశ ఆపరేషన్ సింధూర ద్వారా సైనిక సత్తా నిరూపించడం జరిగిందని ఆదర్శ సేవా సంఘం సంఘ అధ్యక్షులు భీమిశెట్టి కృష్ణమూర్తి గౌరవాధ్యక్షులు చెన్నాసూరి ప్రకాష్ కార్యదర్శి నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర ద్వారా సైనిక సత్తా చూపడం పట్ల వారు సంఘీభావాన్ని ప్రకటించారు. అంతకుమునుపు అమరవీరులకు వారు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలను ఆపరేషన్ సింధూర ద్వారా విజయవంతం తో ధ్వంసం చేయడం మొట్టమొదటి విజయము అని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మారుతి, కుమార్, నాగభూషణం ,ప్రభాకర్ గుప్తా, నాగరాజు, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి పౌరుడూ దేశ భద్రతకు భాగస్వామి కావాలి

–ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

హరీష్ బాబు నేతృత్వంలో ధర్మవరంలో బీజేపీ ర్యాలీ

విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలో మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా దేశ భద్రత కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ను ప్రజలకు వివరించి, దేశభక్తి భావాలను ప్రోత్సహించారు. ర్యాలీ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ, భారత సైన్యం సాహసోపేతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటింది అని తెలిపారు. ఈ విజయాన్ని ప్రజలతో పంచుకోవడం మా బాధ్యత, అని అన్నారు. అలాగే, దేశ భద్రత కోసం ప్రతి పౌరుడు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, యువత, మహిళలు, వృద్ధులు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ర్యాలీ సమయంలో జాతీయ జెండాలు పట్టుకుని జై హింద్, భారత్ మాతా కీ జై వంటి నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీ ప్రజల్లో దేశభక్తి భావాలను రేకెత్తించింది. ర్యాలీ ముగింపు సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ, భారత సైన్యం సాహసోపేతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటింది అని,
ఈ విజయాన్ని ప్రజలతో పంచుకోవడం మా బాధ్యత, అని అన్నారు. అలాగే, దేశ భద్రత కోసం ప్రతి పౌరుడు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ ద్వారా ధర్మవరం ప్రజలు దేశ భద్రతపై తమ మద్దతును వ్యక్తపరిచారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో దేశభక్తి భావాలను పెంపొందించేందుకు బీజేపీ కృషి చేస్తుందని వారు తెలిపారు.

అమరవీరుడు మురళి నాయక్ మృతికి శ్రీవాణి విద్యా సంస్థలు దిగ్బ్రాంతి

విశాలాంధ్ర -అనంతపురం :అమరవీరుడు మురళి నాయక్ మృతికి శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాల సీఈఓ పి. సుధాకర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె. హెచ్. వనజమ్మ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ వై నాగరాణిలు గురువారం దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
నిన్న రాత్రి పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన యుద్ధంలో దేశం కోసం వీరమరణం పొందిన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి తండా శ్రీరాం నాయక్ కుమారుడు మురళి నాయక్ మన దేశం కోసం వీరమరణం పొందారన్నారు. ఎం మురళి నాయక్ 2019 -2022 విద్యాసంవత్సరాలలో బీకాం శ్రీ వాణి కళాశాల లో పూర్తి చేశాడని, ఈ మూడేళ్ల వ్యవధిలో యన్ సి సి కార్యక్రమాలలో చురుకుగా ఉంటూ, స్పోర్ట్స్ లో కూడా చాలా బహుమతులు గెల్చుకోవడం జరిగిందన్నారు. డిగ్రీ మూడవ సంవత్సరంలో ఆర్మీలో స్థానాన్ని సంపాదించి అతని తల్లిదండ్రులతో పాటు కాలేజీ ఉపాధ్యాయులు తోటి విద్యార్థులను ఆశ్చర్య పరిచాడని పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తు నిన్న రాత్రి ఘటనలో తెలుగు జవాన్ మురళి నాయక్ మరణించడం చాలా బాధాకరం అని ,ఇటువంటి యువ కిశోరం ను కోల్పోవటం భరత మాతకు తీరని లోటని అన్నారు. కళాశాల అతని మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అతని వీరమరణం పట్ల అధ్యాపకులు ఏ. సుధీర్ రెడ్డి,ఎన్ సి సి కోఆర్డినేటర్లు రామస్వామి నాయక్, నర్మదా, సి. ముత్యాలప్ప, కొండన్న, నర్సా నాయుడు, స్వర్ణలత, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు అతనికి అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

కురుబ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

కురుబ సంఘం, యువజన ఉద్యోగుల సంఘం
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని కురుమ కులానికి చెందిన పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేస్తామని యువజన ఉద్యోగుల సంఘం వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి లో 500 మార్కులు పైబడిన వారు, ఇంటర్మీడియట్ లో 900 మార్కులు పైబడిన విద్యార్థులు మే నెల20వ తేదీ లోపల కుల ధ్రువీకరణ పత్రము, మార్కుల జాబితా జిరాక్స్ లను యశోదమ్మ ,వకీలు పెద్దయ్య కురుబ కళ్యాణమండపం, ధర్మవరం చిరునామాకు అందజేయాలన్నారు. అదేవిధంగా ఐఐటి ఇంజనీరింగ్, నీట్ ఎంబిబిఎస్ నందు సీట్లు సాధించిన విద్యార్థులు, గ్రూప్ వన్, గ్రూప్ టు తదితర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారందరికీ సన్మానం నిర్వహించబడును అని తెలిపారు. (మా ద్వారా సమాచారం ఇచ్చిన వారికి మాత్రమే) మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 990 8387330 లేదా 9491867165కు గాని 9440808732 కు సంప్రదించాలని తెలిపారు.

జమ్మూలో ఉద్రిక్తత.. మూడు ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వే

భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లోని సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాక్ బలగాలు కాల్పులు జరపడం, దాడులకు తెగబడుతుండడంతో ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. దాడులు మరింత తీవ్రం కావచ్చనే భయంతో జమ్మూ నుంచి బయటి ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే, బస్ స్టేషన్లలో రద్దీ నెలకొంది.

జమ్మూ ప్రజల ఆందోళనల నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. జమ్మూ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం మూడు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. జమ్మూ, ఉధంపూర్ ల నుంచి ఢిల్లీకి ఈ రైళ్లు నడుస్తాయని పేర్కొంది. దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రయాణికుల డిమాండ్‌ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.