Thursday, January 16, 2025
Home Blog Page 53

రాయదుర్గం,లో జనవరి 7న ఏ ఐ వై ఎఫ్ మహాసభల కరపత్రాలు విడుదల

జిల్లా మహాసభలు జయప్రదం చేయండి…

విశాలాంధ్ర- అనంతపురం : ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పిలుపు
అనంతపురం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో యువజన సమాఖ్య నాయకులు గోడ పత్రాల,కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ… దేశ, రాష్ట్రలోను పాలకుల విధానాల వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం ఘోరంగావిఫలమైందని ఆరోపించారు. దేశంలో అన్ని రంగాల్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేయకుండా ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యకు 25 శాతం నిధులు కేటాయిస్తే మన దేశంలో కేవలం 6.5 శాతం కేటాయించి చేతులు దులుపుకుంటున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల వైపు యువతను ప్రొత్సహిస్తుంటే మన దేశంలో యువత కులం, మతం, సనాతన ధర్మం అంటూ తిరోగమనం వైపు నెట్టివేయబడుతున్నారని మండిపడ్డారు. సమాజ మార్పుకోసం జరిగే ప్రజా పోరాటాల్లో యువతరం ముందుండాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనకై పగతిశీల యువత నిరంతరం ఉద్యమించాలన్నారు. ఏఐవైఫ్ 20 జిల్లా మహాసభల్లో రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని , ప్రభుత్వా శాఖల్లో ఖాళీ ఉన్నా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలనీ అన్నారు. ఎన్నో పోరాట ఫలితంగా సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటికరణ కు వ్యతిరేకంగా మహిళలపై జరుగుతున్న దాడులకు ,వివిధ సామాజిక ,ఆర్థిక రాజకీయ, నూతన పరిశ్రమలు నెలకొల్పాలని, కియా పరిశ్రమల్లో 70 శాతం మంది ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అంశాలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. అనంత జిల్లా యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ 20 వ ఏ ఐ వై ఎఫ్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆనంద్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు మోహన్ కృష్ణ, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి ధనుంజయ, ఏఐవైఎఫ్ అనంతపురం నగర అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్ బాబు, శ్రీనివాస్, నగర సహాయ కార్యదర్శి రాంబాబు, శర్మస్, లక్ష్మి రంగ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

హ్యాపీ నెస్ ప్రోగ్రామ్ సుదర్శన క్రియను సద్వినియోగం చేసుకోండి.. జిఆర్. అనుప్.

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎన్జీవో హోం లో ఈనెల 24వ తేదీ నుండి 29వ తేదీ వరకు హ్యాపీనెస్ సుదర్శన క్రియను నిర్వహిస్తున్నట్లు సీనియర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ జిఆర్. అనుఫ్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గురుదేవ్ రవిశంకర్ ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రాణాయామం, ధ్యానం, జ్ఞానము, అద్భుతమైన ప్రక్రియలతో ఈ హ్యాపీనెస్ ప్రోగ్రాం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 5:30 నుండి 8:30 వరకు, తదుపరి సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు 2 బ్యాచ్లుగా నిర్వహిస్తామని తెలిపారు. నేటి సమాజంలో జీవన ప్రక్రియకు ఈ హ్యాపీనెస్ ప్రోగ్రాం సుదర్శన క్రియ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు శ్రీకాంత్ సెల్ నెంబర్ 9842254375కు సంప్రదించాలని తెలిపారు. కావున ఈ కార్యక్రమాన్ని పట్టణ,గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతులు కావాలని వారు తెలిపారు.

దస్తావేజు లేఖరులకు న్యాయం చేయండి..

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేకరులుగా మాకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం దస్తావే జు లేఖరులు మాట్లాడుతూ మేము బయట బాడుగులకు ప్రైవేటు వారి రూములు తీసుకొని పత్రాలు రాసుకుంటున్నామని చెప్పినా కూడా మున్సిపల్ సిబ్బంది వారు అందులకు అంగీకరించడం లేదని, గత పాలకుల మాట మేరకు కొత్తగా సబ్ రిజిస్టార్ కార్యాలయం సంత మార్కెట్లోకి మార్చడం జరిగిందన్నారు. మున్సిపల్ కార్యాలయం సిబ్బంది ఒత్తిడి మేరకు మాకు కూడా కొన్ని రూములు ఆలయం జరిగిందని రూములు ఇచ్చినప్పుడు మాకు గుడ్ విల్ మొత్తము బాడుగ తక్కువ ఇస్తాము అని చెప్పి వేలంలో కూడా మీరు పాట పాడండి చూస్తాములే అని మా అందరిచే పాట పాడించడం జరిగిందన్నారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది గుడ్ విల్ 3 లక్షల రూపాయలు బాడుగ 3000 రూపాయలు అని చెప్పి ఉండగా వాటన్నింటినీ కనిపెట్టి మా అందరి చే బలవంతంగా వేలంలో పాల్గొనేటట్లు చేయడం జరిగిందన్నారు. వేలంపాట అయిపోయిన తర్వాత సిబ్బంది ఒక్కొక్కరుకి గుడ్ విల్ మొత్తం తొమ్మిది లక్షల 50 వేల రూపాయలు, బాడుగ పదివేల రూపాయలు అని చెప్పడం జరిగిందన్నారు. ఇది మా బోటీ వాళ్లకు ఎంత మాత్రమూ సరికాదని వారు తెలిపారు. తదుపరి మేము మున్సిపల్ సిబ్బందితో విభేదించగా అంత మొత్తము కట్టలేము అని చెప్పినా కూడా వినలేదని వారు బాధను వ్యక్తం చేశారు. అంతేకాకుండా అప్పుడే లక్ష రూపాయలు కట్టండి చాలు నిదానంగా మీకు బయట బాడుగలు ఎంత ఉంటాయో అంతే బాడుగ తగ్గించి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఆ హామీ కేవలం బూటకపు మాటలేనని తెలిపారు. ఇక్కడ బాత్రూములు వాటర్ సౌకర్యము ఏమియు లేదని, ధర్మవరం నందు గత పాలనలో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించిందని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది గుడ్ విల్ మొత్తములను మా నుండి బలవంతంగా వసూలు చేయడం జరిగిందని, ఇప్పుడు కూడా మాకు పనులు లేవు అని గుడ్ విల్ కట్టలేని పరిస్థితిలో ఉన్నామని వారు స్పష్టం చేశారు. కావున మున్సిపల్ కమిషనర్ గా మీరు మా సమస్యలను మా కష్టాలను గుర్తించి మాకు న్యాయం చేయాలని వారు మున్సిపల్ కమిషనర్ ను కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు మల్లికార్జున, మహేష్, అల్లం రామాంజి, గోపి, బాలాజీ, వెంకటేష్, మహేంద్ర, భాస్కర్ ,పవన్, అనిల్, రామాంజి, మల్లికార్జున, కీర్తి, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలియ కులస్థుల సమస్యలపరిష్కారానికి కృషిచేస్తాం

ఏకగీవ్రంగా ఎంపికైన బహుత్తమ పద్మశాలియ సంఘం అద్యక్షుడు, ఉ పాద్యక్షులు పుత్తారుద్రయ్య, జింకానాగభూషణ

విశాలాంధ్ర- ధర్మవరం : పద్మశాలియ కులస్థుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని నూతనంగా ఎంపికైన పద్మశాలియ సంఘం అద్యక్ష, ఉపాధ్యక్షుడు పుత్తారుద్రయ్య, జింకా నాగభూషణంలు పేర్కొన్నారు. పట్టణంలోని మార్కెండేయ కల్యాణమండపంలో కులబాందువులు, పెద్దల సమక్షం లో బహుత్తమ పద్మశాలియ సంఘంనూతనకమిటిని అధ్యక్షుడు పుత్తారుద్రయ్య,ఉపాద్యక్షుడు జింకానాగభూషణను ఏకగ్రీవంగా ఎంపికచేశారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ.. మార్కెండేయస్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. అంతేకాకుండా పేదలకు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆలయ అభివృద్ధి కోసం అందరిని సమన్వయంతో కలుపుకుంటామన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే మార్కెండేయస్వామి కల్యాణ మహోత్సవాలను కూడా వైభవంగా నిర్వహిస్తామన్నారు.అనంతరం నూతనంగా ఎంపికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులను పద్మశాలియ కులస్థులు, పలువురు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలంకి వెం కటరామయ్య, గుర్రంలక్ష్మీనారాయణ, జింకా గోవిందు, పోలంకి హరి, జింకాపురుషోత్తం, జింకాగిరి, జానపాటి మోహన్,మెటీకల కుళ్లాయప్ప, రంగా శ్రీనివాసులు, పడకల భాస్కర్, ఊట్ల నరేంద్ర,పోలంకి హరి, పద్మశాలియ కుల బాంధవులు వందల మంది పాల్గొన్నారు.

విద్యార్థులకు అన్నదానం చేయడం నా అదృష్టంగా భావిస్తాను.. న్యాయవాది గుంటప్ప

విశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులకు అన్నదానం చేయడం నా అదృష్టంగా భావిస్తాను అని న్యాయవాది గుంటప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో న్యాయవాది గుంటప్ప తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కళాశాలలోని 445 విద్యార్థినిలకు స్వయంగా భోజన పంపిణీ చేశారు. ఈ భోజన పంపిణీలో కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి కాంత్ రెడ్డి కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్ కూడా వారి చేతుల మీదుగా విద్యార్థినిలకు భోజన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పట్టణంలోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప తెలిపారు. అనంతరం చిన్నప్ప మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ దాతల సహాయ సహకారములతో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టడం మాకెంతో సంతృప్తిని ఇస్తోందని తెలిపారు. మున్ముందు మరిన్ని సహాయ సహకారాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు భోజన పంపిణీ కార్యక్రమం చేపట్టిన న్యాయవాదికి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి కళాశాల ప్రిన్సిపాల్, చైర్మన్కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.

రోగులకు సేవ చేయడం మా అదృష్టం..

శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు సేవ చేయడమే మా అదృష్టము అని శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని 380 మంది రోగులకు, వారి సహాయకులకు భోజనపు ప్యాకెట్లను వైద్యులు, నర్సుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమానికి దాతగా శ్రీవారి రామ్మోహన్రావు రిటైర్డ్ రేడియోలజిస్ట్ సహకారంతో నిర్వహించడం జరిగిందన్నారు. వారికి మా సేవా సమితి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగిందన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న ఈ సేవలు ఎవరికో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. రోగులకు ఇటువంటి సేవా కార్యక్రమం వరం లాగా మారిందని తెలిపారు. అనంతరం ఆసుపత్రి తరపున డాక్టర్ మాధవి సేవాసమితి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఆసక్తిగల దాతలు సెల్ నెంబర్ 9966047044 గాని 903044065కు గాని సంప్రదించవచ్చునని తెలిపారు.

యాచకులకు దుప్పట్లు పంపిణీ

శ్రీ సత్య సాయి సేవ సమితి

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని రైల్వే స్టేషన్, ఆర్టిసి బస్టాండ్, ఆలయాల దగ్గర గల యాచకులకు శ్రీ సత్యసాయి సేవా సమితి సుబ్బదాసు భజన మందిరం ఎన్టీఆర్ సర్కిల్ వారు 50 దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశీస్సులతో తాము పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు అన్నదానం, అల్పాహారం లాంటి కార్యక్రమాలను దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం చలికాలం ఉన్నందున యాచకులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని తృప్తిని ఇచ్చిందని తెలిపారు. మానవసేవే మాధవసేవ అన్న స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతి వ్యక్తి తన వద్ద ఉన్న దానిలో కొంతవరకు దాన కార్యక్రమం నిర్వహించడం వల్ల మానవత విలువ పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి ప్రిన్సిపాల్.. జెవి.సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకుల కొరకు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల-తారకరామాపురం గుట్ట కింద పల్లి లో ఈనెల 17వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబు, జిల్లా నైపుణ్య అధికారి బి.హరికృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మూడు కంపెనీల కొరకు ఉద్యోగమేల నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్మీడియట్ ,డిప్లమా, డిగ్రీ ,పీజీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులని జరిపారు. నెలకు 15వేల రూపాయల నుండి 25వేల రూపాయల వరకు జీతం ఉంటుందని తెలిపారు. ఉద్యోగాల కు ఎంపికైన వారు అనంతపురం జిల్లా, శ్రీ సత్య సాయి జిల్లా, బెంగళూరు లలో ఉద్యోగం చేయవలసి ఉంటుందని తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా తో పాటు ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలు (జిరాక్స్ అండ్ ఒరిజినల్) తీసుకొని రావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9182288465 కు సంప్రదించాలని తెలిపారు.

సజావుగా జరిగిన నీటి సంఘాల ఎన్నికలు.. ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 44 నీటి సంఘాలకు ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని ఆర్డిఓ మహేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 44 నీటి సంఘాలలో 318 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయని 318 కి గాను 308 ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారని ప్రాదేశిక నియోజకవర్గంలో ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నుకోబడ్డారని, 09 ప్రాదేశిక నియోజకవర్గ లా సభ్యులు క్లియర్ వేకెన్సీ గా డిక్లేర్ చేయడం జరిగిందన్నారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని 44 నీటి సంఘాలకు అనగా ధర్మవరం- 8, బత్తలపల్లి-2, రామగిరి-6 తాడిమర్రి-1, ముదిగుబ్బ-11, చెన్నై కొత్తపల్లి-9, కనగానపల్లి-7 మొత్తం 44 లకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పదవులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.

నోటీసులకు స్పందించకపోతే మోహన్ బాబును అరెస్ట్ చేస్తాం

: పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు
సినీ నటుడు మోహన్ బాబు విషయంలో అంతా చట్ట ప్రకారమే జరుగుతోందని… అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. మోహన్ బాబును విచారించేందుకు మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలని తెలిపారు. మోహన్ బాబుకు తాము ఇప్పటికే నోటీసులు ఇచ్చామని… అయితే ఆయన డిసెంబర్ 24వ తేదీ వరకు సమయం అడిగారని సీపీ చెప్పారు. కోర్టు కూడా ఆయనకు సమయం ఇచ్చిందని తెలిపారు. 24వ తేదీ తర్వాత నోటీసులకు స్పందించకపోతే మోహన్ బాబును అరెస్ట్ చేస్తామని చెప్పారు. మోహన్ బాబు దగ్గర ఉన్న గన్స్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో లేవని తెలిపారు. ఆయన వద్ద ఉన్న గన్స్ ను చిత్తూరు జిల్లా చంద్రగిరిలో డిపాజిట్ చేశారని చెప్పారు. తాను దాడి చేయడంతో జర్నలిస్టు గాయపడ్డారు కాబట్టి… ఆయనను పరిమర్శించేందుకు మోహన్ బాబు వెళ్లి ఉంటారని తెలిపారు.