Saturday, January 11, 2025
Home Blog Page 70

ఐక్యతగా ముందుకెళ్దాం సమస్యలను పరిష్కరించుకుందాం.. కుంచెపు గంగరాజు

విశాలాంధ్ర -తనకల్లు :సమన్వయంతో సంఘటితంగా నియోజకవర్గంలోని వడ్డెర్లందరూ ఐకమత్యంతో ముందుకెళ్లి సమస్యలను పరిష్కరించుకోవడానికి కృషి చేద్దామని కదిరి నియోజకవర్గం వడ్డెర్ల సంఘం అధ్యక్షుడు కొంచెపు గంగరాజు అభిప్రాయపడ్డారు. మండల కేంద్రంలోని చౌడేశ్వరి దేవాలయంలో మండలంలోని వడ్డెర్లందరూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కదిరి నియోజకవర్గ ఓడ్డెర్ల సంఘం అధ్యక్షుడు కుంచపు గంగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డెర్లు ఆర్థికంగా ఎదగడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు ముఖ్యంగా తమ పిల్లల చదువులపై నిర్లక్ష్యం వహించవద్దని ప్రతి ఒక్క వడ్డెర పిల్లలు ఉన్నత చదువులు చదవడానికి ప్రోత్సాహం అందివాలన్నారు మండలంలో దాదాపు 60 మంది రాచ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని వారి కుటుంబాలకు భరోసా తో పాటు ఎటువంటి రాజకీయ వచ్చిండు తమపై ప్రభావం చూపకుండా చూస్తామన్నారు భవన నిర్మాణ కార్మిక వృత్తిలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడానికి ముందుంటామన్నారు. వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి సమస్యను పరిష్కరించుకుందామని ప్రతి మండలంలో గ్రామస్థాయి నుంచి వడ్డెరలను బలోపేతం చేసి కమిటీల ద్వారా సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.
మండల నూతన కమిటీ ఎన్నిక.. మండల అధ్యక్షుడుగా ఈ తోడు కిష్టప్పఉపాధ్యక్షుడిగా బూడిదగడ్డ శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర మండల మహిళా అధ్యక్షురాలుగా హిమగిరి ఉపాధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వల్లపు ఉత్తన్న గౌరవ అధ్యక్షుడు గంగరాజు తాలూకా కమిటీ ఉపాధ్యక్షులు డేరంగుల గంగరాజు ప్రధాన కార్యదర్శి వల్లపు వడ్డే బాబు ప్రచార కార్యదర్శి నాగార్జున తలుపుల సెక్రెటరీ అనిల్ గాండ్లపెంట అధ్యక్షులు గంగరాజు యూత్ లీడర్ రాజేష్ కదిరి ప్రచార కమిటీ శివ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు రమణమ్మ జయరాం తో పాటు మండలంలోని అన్ని వడ్డెర కుటుంబాలు పాల్గొన్నారు.

కార్పొరేటర్ పద్మావతికి నివాళులు అర్పించిన సిపిఐ నాయకులు

విశాలాంధ్ర- అనంతపురం : ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నీలం రాజశేఖర్ రెడ్డి భవనం నందు సోమవారం కార్పొరేటర్ పద్మావతి ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి సిపిఐ నగర కార్యదర్శి సి. జాఫర్ కామ్రేడ్ వరలక్ష్మి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జాఫర్ పాల్గొని మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ మహిళాసమాఖ్య జిల్లా కోశాధికారిగా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా అనంతపురం నగరంలోని కార్పొరేటర్ గా మున్సిపల్ ఆఫీసులో సిపిఐ గళం విప్పి యధాదిష్టిగా మాట్లాడి ఎన్నో కార్యక్రమాలు కాలనీలో వాటర్ సంబంధించి డ్రైనేజీ కాలువలు వీధిలైట్లు ఆ డివిజన్ అభివృద్ధి కొరకు ఎంతో తోడ్పాటునిచ్చిన కామ్రేడ్ పద్మావతి కి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అనంతపురం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పార్వతీ ప్రసాదు మాట్లాడుతూ… ఆమె మరణం మహిళా సమాఖ్య కి ఎంతో తీరని లోటు అని పేర్కొన్నారు. మహిళా సమాఖ్య కి డివిజన్ నుండి రాష్ట్ర నలుమూలల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఢిల్లీ వరకు పార్టీ కోసం సేవలు చేశారన్నారు. సోదరి భావంతో ఎంతో ప్రేమగా ప్రతి మనిషిని ఆకట్టుకునే విధంగా అందరితో కలిసి మెలిసి మహిళా సమాఖ్యలో ఎన్నో అరెస్టులకు గాని ధర్నాలలో గాని రాస్తారోకో లో గాని మహిళ సమస్యల పరిష్కారాల కోసం భార్యాభర్తల విషయాల్లో పోలీస్ స్టేషన్ లో గాని మున్సిపల్ ఆఫీసులో గాని మహిళా పక్షపాతిగా ఎన్నో ఉద్యమాలలో పాల్గొనడం జరిగిందన్నారు. ఆమె స్ఫూర్తితోనే మహిళా సమాఖ్య ముందుకు పోతోందని ఆమెకు ప్రగాఢ సంతాపం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు జానకి సింగనమల నియోజకవర్గం కార్యదర్శి లక్ష్మీదేవి కమ్మక్క రమాదేవి అనిత వనజ ప్రజానాట్యమండలి హక్కులప్ప తదితరులు పాల్గొని సంతాపం తెలియజేయడం జరిగింది

కార్యకర్తలకు అండగా టీడీపీ

0

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : సభ్యత్వం పొందే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం అండగా ఉంటుందని టీడీపీ బీసీ సెల్ నాయకులు తలారి అంజి, మొట్రు రామాంజనేయులు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని బీసీ కాలనీలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వం పొందే కార్యకర్తలకు 5 లక్షలు వరకు భీమా సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా టిడిపి ప్రభుత్వం ఉంటుందని వారు వెల్లడించారు. కావున ప్రతి కార్యకర్త ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం అందజేత

0

వీరభద్రుడి సన్నిధిలో ఎమ్మెల్యే విరుపాక్షి

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా): మండల పరిధిలోని కైరిప్పల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పెద్దమ్మ అవ్వ ఆలయ నిర్మాణానికి ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి లక్ష రూపాయలు, కురువ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు శశికళ, కృష్ణమోహన్ దంపతులు రూ.16 వేలు విరాళంగా అందజేశారు. సోమవారం శ్రీ భద్రకాళి, వీరభద్ర స్వాముల వారి నిశ్చితార్థ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే విరుపాక్షి, కురువ సంఘం రాష్ట్ర మహిళ నాయకురాలు వైయస్సార్సీపి నేత శశికళ, కృష్ణమోహన్ దంపతులు వీరభద్రుడి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ అవ్వ గుడి నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించి ఆలయ నిర్వహకులు, గ్రామ పెద్దలకు లక్ష రూపాయలు విరాళాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్దంగా ఉన్న ఆలయానికి గ్రామస్థులు అందరూ ముందుకు వచ్చి విరాళాలు అందచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దొరబాబు, వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్య, మాజీ కన్వీనర్ రామాంజనేయులు, సొసైటీ మాజీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, సర్పంచ్ తిమ్మక్క తనయుడు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ బీటెక్ వీరభద్ర, వైయస్సార్సీపి సీనియర్ నాయకులు దత్తాత్రేయ రెడ్డి, మసాలా ప్రకాష్, అశోక్ నాయుడు, తెవులు ప్రకాష్, జీకే వీరేష్, కుక్కల రంగన్న, ఎంపీటీసీ లక్ష్మి భర్త లక్ష్మన్న, కృష్ణమూర్తి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇండ్ల పట్టాలను వెంటనే మంజూరు చేయాలి

ఆర్డీవో జి. కేశవ నాయుడు కు వినతి పత్రం అందజేసిన సిపిఐ నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు విశాలాంధ్ర అనంతపురం రూరల్ : ఉప్పరపల్లి పొలంలో సర్వేనెంబర్ 194-8 ఇండ్ల పట్టాలను వెంటనే మంజూరు చేయాలి ని ఆర్డీవో జి. కేశవ నాయుడు కు సిపిఐ నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు వినతి పత్రం అందజేశారు. సోమవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం ముందు వినపట్టాలని మంజూరు చేయాలని సిపిఐ నగర్ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర సహాయ కార్యదర్శి బి.రమణ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు, ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. సంతోష్ కుమార్, నగర్ సహాయ కార్యదర్శి అలిపిర పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి ఎన్.శ్రీరాములు మాట్లాడుతూ…అనంతపురము రూరల్ ఉప్పరపల్లి పొలంలో స.నెం. 194-8 నందు దాదాపు 250 మంది గత కొన్ని నెలలుగా పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారన్నారు. ఈ మధ్యకాలంలో అధిక వర్షాల వల్ల పై భాగంలో వుండే కనగానపల్లి చెరువుకు గండి పడడం వలన చెరువు నీరంతా పండమేరు వంక ద్వారా నీరు ఎక్కువగా రావడం వలన మా ప్రాంతమంతా నీట మునిగింది అన్నారు. ఇది గత ప్రభుత్వంలో ఇందిరమ్మకాలనీ, జగనన్న ఇండ్లు వంకకు 50 అడుగుల దూరంలో 300 ఇండ్లు ప్రభుత్వ అధికారులు నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. సర్వే.నెం. 194-8 వంక పరంబోకు కాదు, వంకకు 1000 అడుగుల దూరంలో ఉందని ఇది ఈ గ్రామకంఠ భూమి అని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇండ్లు లేని ఇరుపేదలకు 2 సెంట్ల స్థలము ఇండ్లు నిర్మించుకోవడానికి 4 లక్షల రూపాయలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడం జరిగిందన్నారు.
అనంతపురము రూరల్, ఉప్పరపల్లిపొలం 194-8 స్థలంలో నివాసముంటున్న అర్హులైన పేద ప్రజలకు హౌసింగ్ ద్వారా ఇండ్లు నిర్మించి పట్టాలు ఇవ్వవలసినదిగా కోరడం జరిగిందన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి సంతోష్ కుమార్ మాట్లాడుతూ… ఓట్ల కోసం పేదలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే వారిని పట్టించుకోవడం లేదన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిరుపేదలు కు పట్టాలుకోసం ధర్నా చేస్తున్నారంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటువంటి న్యాయం జరగడం లేదని ప్రజలు తెలుసుకోవాలన్నారు. పేద ప్రజలకు పట్టాలిప్పించేంతవరకు అంచలంచలుగా ధర్నాలు నిర్వహిస్తామన్నారు. నగర సహాయ కార్యదర్శి బి.రమణ మాట్లాడుతూ… కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, నిర్మాణానికి నాలుగు లక్షల ఇస్తామని వాగ్దానం చేయడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలుగా వస్తున్న ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు అన్నారు. ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది అన్నారు. పేద ప్రజలకు పట్టాలు ఇచ్చేంతవరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో జి కేశవ నాయుడు స్పందిస్తూ తాను స్వయంగా వచ్చి సర్వే నెంబర్లను పరిశీలిస్తానని ప్రభుత్వ భూమి అయితే తప్పకుండా పట్టాలు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మైనారిటీ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్, సిపిఐ మహిళా సమైక్య నాయకురాలు జయలక్ష్మి, వరలక్ష్మి, సిపిఐ నాయకులు కృష్ణుడు, జి రాజు, ఆర్ సుందర్ రాజు, ఎన్. జిలాన్ భాష, నాగప్ప, మునాఫ్ వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ధర్మవరం నృత్య ప్రదర్శన

గురువు డాక్టర్.ఆర్. మానస
విశాలాంధ్ర ధర్మవరం: శ్రీకాళహస్తిలో జరిగిన కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎస్బిఐ కాలనీకి చెందిన మానస నృత్య కళా కేంద్రం వారి శిష్య బృందం నిర్వహించిన నిత్య ప్రదర్శన అక్కడ అందరిని ఆకట్టుకోవడం జరిగిందని గురువు డాక్టర్. ఆర్. మానస తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆలయ కమిటీ వారితోపాటు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు మాకు ఆహ్వానం పంపించడం జరిగిందని, దైవకార్యం మా వంతుగా ఒక అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావించి అక్కడ వెళ్లి నాట్య ప్రదర్శన నిర్వహించడం జరిగిందని తెలిపారు. నాట్య ప్రదర్శనలో మా ద్వారా ఆన్లైన్లో 25 మంది ప్రత్యక్షంగా నేర్చుకున్న నలుగురు మొత్తం విరిసి 29 మంది శిష్య బృందం నాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈనాట్య ప్రదర్శనలో శివతాండవం, శివాష్టకం, మహాగణపతి, తిల్లనా అనే నాట్య ప్రదర్శనలు అక్కడి భక్తాదులను విశేషంగా ఆకట్టుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ధర్మవరం ద్వారా నాట్య ప్రదర్శన చేసిన తనుష్క, రేఖ, గౌతమి, శాంది లతోపాటు ఆన్లైన్లో నేర్చుకున్న వారు కూడా ఈనాటి ప్రదర్శన నిర్వహించడం గర్వకారణంగా ఉందని తెలిపారు. తదుపరి ఆలయ కమిటీ వారు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు కలిసి నాట్య ప్రదర్శన చేసిన వారందరితో పాటు గురువు మానసాను కూడా ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శనలు చేసిన వారితోపాటు మానస తల్లిదండ్రులు కృష్ణ, తులసి కూడా పాల్గొన్నారు.

ప్రతి పేదవాడికి కంటి వెలుగును ప్రసాదించడమే మా కర్తవ్యం..

లయన్స్ క్లబ్ కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం : ప్రతి పేదవాడికి కంటి వెలుగును ప్రసాదించడమే మా కర్తవ్యం అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాలచార్యులు, కార్యదర్శి రమేష్ బాబు, కోశాధికారి ఉలవల నాగరాజు, సభ నిర్వాహకులు వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) లయన్స్ ఉచిత కంటి చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి క్యాంపు దాతగా కీర్తిశేషులు మెటికల చెన్నమ్మ, కీర్తిశేషులు మెటికల చెన్నప్ప ఙ్ఞాపకార్థం కుమారుడు లయన్ మెడికల కుల్లాయప్ప వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల తాము కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అనంతపురం డిఆర్టిఏ వెలుగు పీడీ.ఈశ్వరయ్య, అనంతపురం ఫిజికల్ డైరెక్టర్ సునీత పాల్గొన్నారు అని తెలిపారు. అనంతరం లయన్స్ క్లబ్ కమిటీ వారు మాట్లాడుతూ భారత దేశంలోనే లయన్స్ క్లబ్ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు వేలాదిమందికి లయన్స్ క్లబ్ ద్వారా కంటి వెలుగును ప్రసాదించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. కంటిలోని శుక్లమును తొలగించి కంటిచూపు కోసం మా వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నామని తెలిపారు. నేడు లయన్స్ క్లబ్ సేవలు పేదలకు వరంలాగా మారడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 58 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 35 మంది ఆపరేషన్కు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులు ఈశ్వరయ్య, సునీత మాట్లాడుతూ కంటి చూపును కలిగించడంలో ధర్మవరం లైన్స్ క్లబ్ ముందంజలో ఉందని, ఇందుకు అందరూ ఎంతో రుణపడి ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా సమాజంలో నేత్రదానం కూడా చేస్తే ఇరువురికి కంటి చూపు లభిస్తుందని తెలిపారు. కావున ప్రతి పేదవాడు లైన్స్ క్లబ్ సేవలను వినియోగించుకున్నప్పుడే క్లబ్ కు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు మోహన్దాస్, గోశే రాధాకృష్ణ, రాజగోపాల్, పళ్లెం వేణుగోపాల్ ,పుట్లూరు నరసింహులు, సాగా సురేష్, వెంకటేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మంచి వంటతోనే చక్కటి ఆరోగ్యం ..

డిప్యూటీ ఎమ్మార్వో లక్ష్మీదేవి
విశాలాంధ్ర ధర్మవరం:: మంచి వంటలోనే చక్కటి ఆరోగ్యం లభిస్తుందని, ఇంటి వంటనే ప్రతి ఒక్కరూ ఇష్టపడితే చక్కటి ఆరోగ్యంతో కూడిన భవిష్యత్తు లభిస్తుందని డిప్యూటీ ఎమ్మార్వో లక్ష్మీదేవి తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని కోర్టు రోడ్డు లక్ష్మీ హెచ్పి గ్యాస్ ఏజెన్సీదారులు గోవిందు చౌదరి వారి స్వగృహ ఆవరణములోఁహమారా రసోయ్-హమారా జవాబు దారిఁఅన్న అంశంలో భాగంగాఁవంటగది-మన బాధ్యతఁఅన్న విషయంపై మహిళలకు అవగాహన సదస్సుతోపాటు పాటించాల్సిన విధి విధానాలు జాగ్రత్తలు గూర్చి వివరించడం జరిగింది. అనంతరం 20 మంది మహిళలచే వివిధ రకాల వంట పోటీలను నిర్వహించారు. ఈ వంట పోటీలో రుచిగా చేసే వంటకాలపై ప్రత్యేక శ్రద్ధను ఘనపరిచి 5 మంది మహిళలను విజేతగా ప్రకటించారు. అనంతరం ముఖ్య అతిధి లక్ష్మీదేవి చేత బహుమతులను పంపిణీ చేశారు. అనంతరం లక్ష్మీదేవి తో పాటు గ్యాస్ ఏజెన్సీదారులు గోవిందు చౌదరి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఇంటి వంటపై తక్కువ మమకారం చూపుతూ, బయట భరత్ ఆహారాన్ని తినడం వల్ల అనేక రోగాలను కొని తెచ్చుకోవడం జరుగుతుందని తెలిపారు. కానీ ఇంటి వంటలు గల రుచి మరో చోట ఉండదని తెలిపారు. మహిళలు కూడా చక్కటి వంట చేసేందుకు ఇష్టపూర్వకంగా చేసినప్పుడే అది రుచికరంగా ఉంటుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు పట్ల మహిళలు గ్యాస్ ఏజెన్సీదారులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కీర్తి చౌదరి, అనంతశయన, గ్యాస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎయిడ్స్ అవగాహన దినోత్సవం, ర్యాలి నిర్వహణ–ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని స్థానిక కె. హెచ్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ డే (ఎయిడ్స్ వ్యాధి అవగాహన దినోత్సవం ) ను ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ అధికారి డా. బి.గోపాల్ నాయక్ అధ్వర్యంలో, కళాశాల ప్రిన్సిపాల్ డా: కె ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ త్రివేణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న, ప్రజలలో అవగాహన పెంచి, ప్రాణాలను రక్షించడానికి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పాటిస్తున్నాము అని తెలిపారు. హెచ్‌ఐవి/ఎయిడ్స్‌పై పోరాటంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేయడానికి వైరస్‌తో జీవిస్తున్న వారికి మద్దతునిచ్చేందుకు ఈ రోజు ప్రపంచ వేదికగా నిలుస్తుంది అన్నారు. 2024 సంవత్సరం నకుగాను థీమ్ ఁరైట్స్ పాత్: మై హెల్త్, మై రైట్!ఁ. ప్రతి ఒక్కరూ, ప్రతిచోటా, హెచ్ఐవి ప్రసారాన్ని నిరోధించే, సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందించగల , అంతిమంగా అంటువ్యాధిని అంతం చేసే వనరులు, సేవలకు ప్రాప్యతకు అర్హులని థీమ్ నొక్కి చెబుతుంది అని తెలిపారు.యువకులు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని, అదేవిధంగా ఇతరులకు తెలియజేయాలని, జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణగా, మంచి ఆలోచనలతో భవిష్యతును నిర్ణయించుకొని, ముందుకు నడవాలని తెలిపారు. మనం నిత్య జీవితంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరమని, ఎయిడ్స్ పాజిటివ్ వచ్చిన వారిని వివక్ష చూపకుండా వారికి సమాజంలో బ్రతికేలాగా ధైర్యం ఇవ్వాలని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో డా. ఎస్.చిట్టెమ్మ, ఎస్. పావని, ఎ.కిరణ్ కుమార్, మీనా, బి. ఆనంద్, శ్రీమతి హైమావతి తదితర అధ్యాపక, అధ్యాపకేతర బృందం ,విద్యార్థులు పాల్గొన్నారు.

ఎయిడ్స్ పట్ల అందరూ అవగాహన చేసుకోవాలి..

శక్తి మైత్రి మహిళా సంఘం స్వచ్ఛంద సంస్థ
విశాలాంధ్ర ధర్మవరం:: ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని శక్తి మైత్రి మహిళా సంఘం స్వచ్ఛంద సంస్థ, డైరెక్టర్ నారాయణమ్మ, డిప్యూటీ డిఎంహెచ్వో సెల్వియా సల్మాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ డే సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, ఐసిటిసి, ధర్మవరం శక్తి మైత్రి మహిళా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపట్ల చులకన ఉండరాదని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధులు తగిన వైద్య చికిత్సలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక మహిళ సెక్షర్ లో చెన్నైలో ఫిబ్రవరి 1986లో కనుకోవడం జరిగిందన్నారు. ఇండియాలో సుమారు 2.54 మిలియన్ ప్రజలు హెచ్ఐవి తో జీవిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 3.2 లక్షల మంది హెచ్ఐవి తో జీవిస్తున్నారని అంచనాగా తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2018-19 లో 0.14 శాతంగా ఉన్న హెచ్ఐవి వ్యాప్తి 2020-21 లో 0.31 శాతంగా మారిందన్నారు. హెచ్ఐవి ని ముందుగా గుర్తించాలని, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రులలో హెచ్ఐవి కి తగిన వైద్య చికిత్సలు, ఆరోగ్య సూత్రాలు కూడా తెలుపబడునని తెలిపారు. శ్రీ సత్య సాయి జిల్లాలో హెచ్ఐవి తోపాటు ఎయిడ్స్ కొరకు అందుబాటులో పలు సేవలను కూడా నిర్వర్తిస్తున్నట్లు వారు తెలిపారు. హెచ్ఐవి ఏ విధంగా వస్తుంది? పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తారు? హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు ఏఆర్టి మందులు ఎక్కడ దొరుకుతాయి? అన్న విషయాలను వివరించడం జరిగిందని తెలిపారు. ఈ అవగాహన ర్యాలీలోనే మానవహారంతో పాటు ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ సునీల్ కుమార్ రాయల్, డాక్టర్ పుష్పలత, డాక్టర్ సురేష్ నాయక్, డాక్టర్ కిరణ్ కుమార్, టిబి సూపర్వైజర్ భాష, ఆశా వర్కర్లు, ఐసిటిసి కౌన్సిలర్ వనమాల, ల్యాబ్ టెక్నీషియన్ భార్గవి, ఓ ఆర్ డబ్ల్యు ఎస్ సిబ్బంది కవిత, లక్ష్మి, సరస్వతి, శర్మ ,త్రివేణి తదితరులు పాల్గొన్నారు.