విశాలాంధ్ర నెల్లూరుటౌన్: విద్యుత్ మీటర్ రీడర్లు కు ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని సిఎండి ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయాలనిఎస్ ఈ ఆఫీస్ వద్ద నిరసన చేపట్టిన విద్యుత్‌మీటర్ రీడర్ల సంఘం ఎస్ ఈని కలిసి వినత పత్రం ఇవ్వడంజరిగినది.ఎస్పిడిసిఎల్ మీటర్ రీడర్లకు ఎస్క్రో అకౌంట్ ద్వారా సెప్టెంబర్ వేతనాలు చెల్లించాలని ఎస్ ఈ కి ఉత్తరవలుజారీచేసినకాంట్రా
క్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాల
ని మీటర్ రీడర్స్ విద్యుత్ భవనంవద్ద నిరసనకార్యక్రమం చేపట్టారు. వీరి నిరసనకు
ఎస్ఈ స్పందిస్తూ నెలలోపు మీటర్ రీడర్స్ కు ఎస్క్రో అకౌంట్ ద్వారా వేతనాలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినారు.ఈ కార్యక్రమంలో ఏఐటియూసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్,మీటర్ రీడర్స్ ప్రధాన కార్యదర్శి హజరత్ వలి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కృష్ణ ,మీటర్ రీడర్స్ కోశాధికారి బాలకృష్ణ , వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటసుబ్బయ్య ,రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
విద్యుత్ మీటర్ రీడర్లు కు ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలి–ఏఐటియూసి
ఒకే నెలలో రెండు సార్లు పించన్లు ఇచ్చిన ఘనత టీడీపీదే…
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఒకే నెలలో రెండోసారి పింఛన్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని టీడీపీ సీనియర్ నాయకులు ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఏసేపు అన్నారు. శనివారం మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఏసేపు, కంబదహాల్ గ్రామంలో టీడీపీ గ్రామ అధ్యక్షులు మునెప్పలు పింఛన్లు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకేనెలలో రెండవసారి పింఛన్లు పంపిణీ చేయడం లబ్ధిదారులకు ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. గత వైసీపీ పాలనలో ఒకటో తేదీ ఆదివారం వస్తే మూడో తేదీన పింఛన్లు ఇచ్చే వారన్నారు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేసి లబ్ధిదారుల కళ్లల్లో కూటమి ప్రభుత్వం ఆనందం చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
టీజీపీఎస్‌సీ కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ నియామకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం ఆమోదించారు. ప్రస్తుత ఛైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో ముగియనుంది. అందుకే కొత్త ఛైర్మన్ నియామకానికి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా, 45 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వారిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. చివరికి బుర్రా వెంకటేశం పేరును సీఎం ఎంపిక చేసి, నియామక ఫైల్‌ను గవర్నర్‌కు పంపగా ఆయన ఆమోదించారు.ఇక బుర్రా వెంకటేశం 1968 ఏప్రిల్ 10న తెలంగాణలోని జనగామ జిల్లాలో జన్మించారు. 1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన… రాజ్‌భవన్ సెక్రటరీ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పని చేశారు.ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు కలెక్టర్ అయ్యారంటూ బుర్రా వెంకటేశం గురించి పలు వేదికలపై ప్రస్తావించారు.
మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకనున్న ఫెంగల్ తుపాను..
చెన్నైలో కుండపోత.. విమానాల రద్దు
ఫెంగల్ తుపాను ఈ సాయంత్రం తీరం దాటనున్న నేపథ్యంలో తమిళనాడు రాజధాని చెన్నై సహా పొరుగున ఉన్న పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరైకల్, పుదుచ్చేరి సమీపంలోని మహాబలిపురం సమీపంలో తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. భారీ వర్షాలు జీవనాన్ని అతలాకుతలం చేశాయి. చెన్నై విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే పలు లోకల్ రైళ్ల సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన కారణంగా తమిళనాడులోని ఏడు తీర ప్రాంతాల్లో ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీచేసింది. తుపాను పుదుచ్చేరి తీరాన్ని తాకే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షం కారణంగా చెన్నై ఎయిర్‌పోర్టులో పది విమానాల రాకపోకలు రద్దయ్యాయి. విమానాలను రద్దు చేసినట్టు ఇండిగో ప్రకటించింది. అబుదాబి నుంచి చెన్నై రావాల్సిన ఇండిగో విమానం ను బెంగళూరుకు మళ్లించారు. సబర్బన్ పరిధిలోని అన్ని లోకల్ రైళ్ల సర్వీసులను కుదించారు. చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించింది. చెన్నైతోపాటు సమీపంలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, మయిలదుతురై, నాగపట్టణం, తిరువూరు వంటి డెల్టా జిల్లాల్లో ఈ ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రధాన రోడ్లపై ప్రజా రవాణాను ప్రభుత్వం నిలిపివేసింది. తమిళనాడు వ్యాప్తంగా 2,220 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 500 మందిని వాటిలోకి తరలించారు.
వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం
కాలి బూడిదైన 200 వాహనాలు
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌లోని వాహనాల పార్కింగ్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 200 ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు శాఖ అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), స్థానిక పోలీసు బృందంతో పాటు 12 ఫైర్ బ్రిగేడ్ వాహనాలతో మంటలను ఆర్పేశారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని సమాచారం. కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనలో దగ్ధమైన ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రైల్వే ఉద్యోగులవేనని అధికారులు చెప్పారు. రెండు గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఏపీ విద్యార్థులకు త్వరలో హోలిస్టిక్ కార్డులు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇకపై హోలిస్టిక్ కార్డులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థి ఎత్తు, బరువు, బీఎంఐ, బ్లడ్ గ్రూప్ సహా పూర్తి వివరాలను ప్రతీ ఆరు నెలలకు ఒకసారి వీటిలో నమోదు చేస్తారు. ఇప్పటి వరకు ఇస్తున్న ప్రోగ్రెస్ కార్డులకు మార్పులు చేర్పులు చేసి ఈ హోలిస్టిక్ కార్డులను రూపొందించారు. ప్రతీ కార్డులోనూ క్యూఆర్ కోడ్ ను అధికారులు ముద్రించారు. ఈ కార్డులు విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి, విద్యార్థిని మరింతగా తీర్చిదిద్దేందుకు తోడ్పడతాయని వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న విద్య, విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను బట్టి 1 నుంచి 5 వరకు స్టార్లు ఇస్తారు. దీంతో రేటింగ్ తక్కువగా ఉన్న స్కూళ్లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి వాటిని మెరుగుపరిచే వీలుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే నెల 7 లోగా ఈ ప్రక్రియ పూర్తిచేసి, పేరెంట్స్ టీచర్ మెగా మీటింగ్ లో చర్చించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మరోవైపు, ఈ మీటింగ్ కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని, ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధమయ్యాయని తెలుస్తోంది. పేరెంట్స్ కు ఆహ్వాన పత్రిక పంపడంతో పాటు వారి మొబైల్ ఫోన్లకు సందేశాలు కూడా పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.
శత్రు దేశాలపై దాడి చేసే హక్కు రష్యాకు ఉంది: కిమ్ జోంగ్ ఉన్
ఆత్మరక్షణ కోసం శత్రు దేశాలపై దాడి చేసే హక్కు రష్యాకు ఉందని ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. అమెరికా దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్ కు దీర్ఘశ్రేణి క్షిపణులను అందించి… రష్యాపై దాడి చేసేందుకు ప్రేరేపించాయని కిమ్ విమర్శించారు. శత్రువులపై రష్యా కూడా ప్రతీకార చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. శత్రువులపై దాడి చేసే హక్కు రష్యాకు ఉందని అన్నారు. రష్యాతో సైనిక సంబంధాలతో పాటు అన్ని రంగాల్లో బంధాలను విస్తరించుకుంటామని చెప్పారు. కిమ్ జోంగ్ ఉన్ తో రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్ సమావేశమయ్యారు. బెలౌసోవ్ బృందానికి ఉత్తరకొరియా రక్షణ మంత్రిత్వ శాఖ విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేసినట్టు కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. మరోవైపు, ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యాకు కిమ్ జోంగ్ ఉన్ సైనిక సాయాన్ని అందిస్తున్నారు. 10 వేలకు పైగా సైనికులను రష్యాకు పంపించారు. రష్యాకు ఉత్తరకొరియా సైనికులను పంపడాన్ని అమెరికా తప్పుపట్టింది. ఈ క్రమంలో రష్యా-ఉత్తరకొరియా రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కిమ్ సైనిక సాయానికి బదులుగా ఉత్తరకొరియాకు యాంటీ మిస్సైల్ సిస్టమ్ ను రష్యా పంపించింది.
స్వతంత్ర పలస్తీనాతోనే పరిష్కారం
స్వతంత్ర పలస్తీనాతోనే పరిష్కారం
ఏథెన్స్: పలస్తీనా ప్రజలకు అంతర్జాతీయ సంఫీుభావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) తరపున పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్ కౌట్సోంబస్ సంపూర్ణ సంఫీుభావాన్ని ప్రకటించారు. ‘ఇజ్రాయిల్‌ది మారణహోమమని, నెతన్యాహు చేస్తున్నది యుద్ధ నేరమని, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)కు ఆయన వాటెండ్ నేరస్తు డని, అమెరికా, నాటో, యూరోపి యన్ యూనియన్ మద్దతుతో గాజా స్ట్రిప్‌లో జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్న పలస్తీనా ప్రజలతో… యావత్ ప్రపంచ ప్రజలతో మా గళాన్ని కలుపుతున్నాం’ అని దిమిత్రిస్ ఉద్ఘాటించారు. పశ్చిమాసియాతో పాటు యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొన్నది. న్యూ డెమొక్రసీ ప్రభుత్వం అధ్వర్యంలో నాటో దేశాల మద్దతుతో యుద్ధాల్లో మా దేశం జోక్యం చేసుకోకుండా మా ప్రజలు పోరాడుతున్నారని ఆయనన్నారు. ఈ పరిణామాలు కీలకంగా మారుతున్నాయని చెప్పారు. ఎర్ర సముద్రం ఫ్రిగేట్ నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గాలని, ఇజ్రాయిల్‌తో తెగతెంపులు చేసుకోవాలని, సైనిక, ఆర్థిక, రాజకీయ సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మరక్షణ సాకుతో 17వేల మంది చిన్నారులు సహా 44వేల మంది పలస్తీనియన్ల ప్రాణాలు తీయడం, వెస్ట్‌బ్యాంక్, లెబనాన్, సిరియా, యమెన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడటం ఆమోదయోగ్యం కాదని దిమిత్రిస్ కౌట్సోంబస్ తేల్చిచెప్పారు. సైన్యాన్ని మోహరించి దురాక్రమణకు పాల్పడుతుండటాన్ని ఆత్మరక్షణ అంటే ప్రపంచంలో ఎక్కడా ఒప్పుకోరని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇజ్రాయిల్ దురాక్రమణను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. 1967 ఒప్పందం ప్రకారం నిర్దేశించిన సరిహద్దులతో, తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర ఏకీకృత పలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారమన్నారు.స్వతంత్ర పలస్తీనా దేశాన్ని గుర్తించేందుకు 2015లో గ్రీక్ పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిందని గుర్తుచేశారు. నాటి ఆ నిర్ణయాన్ని తక్షణమే మన దేశం అమలు చేయాలని కమ్యూనిస్టు పార్టీ తరపున గ్రీస్ ప్రభుత్వాన్ని దిమిత్రిస్ డిమాండ్ చేశారు.
అలా జరిగితేమా అస్త్రాలన్నీ తీస్తాం: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్ అణ్వస్త్రాలు సేకరిస్తేగనుక తమ వద్ద ఉన్న అన్ని ఆయుధాలను వినియోగించేందుకు వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి జో బైడెన్ తప్పుకునే ముందు ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలను సమకూరుస్తారన్న వార్తల క్రమంలో పుతిన్ ఈ మేరకు హెచ్చరికలు జారీచేయడానికి ప్రాధాన్యత ఏర్పడిరది. ‘మేము యుద్ధం చేస్తున్న దేశం అణు శక్తిగా ఆవిర్భవిస్తే మేమేం చేయాలి? మా వద్ద ఉన్న అన్ని అస్త్రాలను బయటకు తీయాలి! శుత్రు దేశ వినాశనానికి వాటిని వినియోగించాలి’ అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఆ దేశం ప్రతి అడుగును నిశితంగా గమనిస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా ఏదైనా సరఫరా చేయాలని అనుకోవడం నాన్ ప్రొలిఫిరేషన్ కమిట్‌మెంట్ల ఉల్లంఘనే అవుతుందని ఉక్రెయిన్‌కు నాటో దేశాల సాయాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ సొంతంగా ఒక్క అణు ఆయుధాన్ని తయారు చేసుకోలేదు కానీ రోడియో థార్మిక పదార్థంతో బాంబును తయారు చేసి కాలుష్యాన్ని సృష్టించ గలదని చెప్పారు. ఒకవేళ అదే జరిగితే రష్యా ప్రతిస్పందన తగిన విధంగా ఉంటుందని పుతిన్ అన్నారు.