Saturday, December 28, 2024
Home Blog Page 85

గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

విశాలాంధ్ర ఉరవకొండ (అనంతపురం జిల్లా) : గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ నిర్వహించే గ్రంథాలయ వారోత్సవాల గోడపత్రికను బుధవారం స్థానిక గ్రంథాలయంలో మండల  విద్యాశాఖ అధికారులు ఈశ్వరప్ప, రమాదేవి, ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రంథాలయ అధికారి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రమా ఆదేశాలతో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది నవంబరు 14 నుంచి 20వ తేదీ వరకూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వారోత్స వాల్లో భాగంగా ప్రారంభం రోజున మొదలుకుని బాలల దినోత్సవం, పుస్తక ప్రదర్శన, విద్యార్థినీ, విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మే ళనం, గ్రంథాలయ ఉద్యమకారుల సంస్కరణ సభలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయన్నారు. చివరి రోజు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. ఈ వారోత్స వాల్లో ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేనా మీ కూటమి పరిపాలన…?

కార్యకర్తలు అధైర్య పడవద్దు మీకు అండగా మేముంటాం

విశాలాంధ్ర- రాజాం. ( విజయనగరం జిల్లా) : తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు జగన్మోహన్ రెడ్డి డ ఆయన కుటుంబ సభ్యులపై, పార్టీ నాయకులపై చాలా దారుణంగా మార్ఫింగ్ ఫోటోలతో పోస్ట్ లు పెడుతున్నారు వారి పై కూడా చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెళ్ళాన చంద్రశేఖర్ (పెదబాబు), రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రాజేష్ తలే, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్ మోహన్ రావు.ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే కేసులు పెడతారా.ఇదెక్కడి పాలన చంద్రబాబు.వైయస్సార్ సీపీ కార్యకర్తలే టార్గెట్ గా కేసులు పెడుతూ అరెస్ట్ లు చేస్తున్నారు.ఏ ఒక్కరూ అధైర్యపడకండి.. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సునాయాసంగా హామీలిస్తారు వదిలిపెట్టేస్తారు 2014లో హామీలన్నీ అలాగే చేసారు. రుణమాఫీ, సున్నావడ్డీ, ధరల స్థిరీకరణ, డ్వాక్రా రుణమాఫీ, సున్నావడ్డీ, చేనేత రుణాలు, నిరుద్యోగ భృతి అన్ని హామీలూ ఎగరగొట్టారు.
2024లో అబద్ధాలతో మళ్లీ ప్రజలను నమ్మించారు గతంలో రోశయ్యగారు, వైయస్ఆర్ కూడా చంద్రబాబు హామీల తీరు గురించి విమర్శించారు. ప్రతిసారి ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మి మోసపోతున్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండి.నరసింహులు, టౌన్ కన్వీనర్ పాలవలస. శ్రీనివాస రావు, మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు వాకముల్ల.చిన్నం నాయుడు, వైస్ ఎంపీపీ యాలాల.వెంకటేష్,ప్రసాద్,బాబూరావు మరియు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాలాంధ్ర వార్తకు స్పందించిన రాజాం మున్సిపల్ కమిషనర్

విశాలాంధ్ర- రాజాం ( విజయనగరం జిల్లా) : గత రెండు రోజుల క్రితం విశాలాంధ్ర పత్రికలో ప్రధాన కూడలి, రహదారిపై లైట్లు వెలగకపోయినా పట్టించుకోని సిబ్బంది అనే శీర్షిక ప్రచురించడంతో వెంటనే రాజాం మున్సిపల్ కమిషనర్ జె.రామప్పలనాయుడు స్పందించి స్టాకు ఉన్న మేరకు సెంట్రల్ లైటింగ్ లో ఉన్న వెలగని 120 వాల్ట్స్ లైట్లును వెంటనే తొలగించి వెలిగే లైట్లు అమర్చమని ఏఈ భాగ్యలక్ష్మి కు ఆదేశించారు.అంబేద్కర్ జంక్షన్, బొబ్బిలి జంక్షన్ లో వెలిగే 200 వాల్ట్స్ లైట్ల ప్రస్తుతానికి స్టాకు లేనందువలన వాటిని మార్చలేదని త్వరలో స్టాకు వస్తుంది వెంటనే మారుస్తామని ఏఈ భాగ్యలక్ష్మి తెలిపారు.

వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలి

ఇన్సాఫ్ మైనారిటీ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్

విశాలాంధ్ర అనంతపురం : కేంద్ర ప్రవేశపెడుతున్న వక్ఫ్ సవరణ బిల్లును ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాలని ఇన్సాఫ్ మైనారిటీ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్ పేర్కొన్నారు. భారత కమ్యునిస్టు పార్టీ యొక్క మైనారిటీ వింగ్ ఁఇన్సాఫ్ఁ అనంతపురం నగర సమితి ఆధ్వర్యంలో ,స్థానిక జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్ మాట్లాడుతూ…బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని ప్యానెల్, నవంబర్ 25న ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి వారంలో వక్ఫ్ బిల్లుపై తుది నివేదికను ప్రవేశపెట్టనున్నది అన్నారు. 16 మంది ఎంపీలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, ఎన్‌డిఎ కేంద్ర ప్రభుత్వానికి కీలక భాగస్వామ్యం అన్నారు. భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ా ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు పాత్ర కీలకమైనదన్నారు. కేంద్ర ప్రభుత్వ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకత తెలిపితే మోడీ ప్రభుత్వం పరిగణ లోకి తీసుకోవాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. కేరళ ప్రభుత్వం కూడా వక్ఫ్ సవరణ బిల్లుకు తమ వ్యతిరేకత తెలిపిన విషయం అందరికి తెలిసిందే అన్నారు. ఏపీలో మైనారిటీలకు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం దాదాపు 4వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు తమ వ్యతిరేకత తెలిపితే మైనారిటీ హృదయాల్లో చంద్రబాబు నాయుడు నిలిచిపోతారన్నారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు అల్లి పీరా , అధ్యక్షులు చాంద్ బాషా, తదితరులు పాల్గొన్నారు..

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్య రంగాలకు రాష్ట్ర బడ్జెట్ లో భారీ కేటాయింపు

– ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్ర బడ్జెట్ లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య కోసం రూ. 18,421 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కు,ఆర్థిక శాఖామాత్యులు పయ్యావుల కేశవ్కు, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ బడ్జెట్ కేటాయింపు 23 శాతం పెరిగినట్లు తెలిపారు. పాఠశాల,కళాశాల, ఉన్నత విద్య తరవాత అత్యధికంగా ఆరోగ్య రంగానికి కేటాయింపులు చేయడం ద్వారా ప్రజారోగ్య సంరక్షణకు ప్రాముఖ్యతనిస్తూ, ఎన్డీయే ప్రభుత్వం తమ సంకల్పాన్ని ప్రదర్శించింది అని ఆయన అన్నారు.
ఈ కేటాయింపు ద్వారా రాష్ట్రంలోని ఆరోగ్య సేవలు మరింత మెరుగుపడతాయని, ప్రజల ఆరోగ్యం కోసం కీలకమైన పథకాలు, సదుపాయాలు మరింత విస్తరించనని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి మరింత ముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడం ఎల్లప్పుడూ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని ఆయన తెలిపారు. ఈ ప్రగతిశీల బడ్జెట్ కేటాయింపుతో, ప్రజల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధ కట్టుబాటును కొనసాగిస్తుందన్నారు అని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం యొక్క హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

వినికిడి సమస్య లేని ఆంధ్రప్రదేశ్గా కొనసాగిస్తాం..

విశాలాంధ్ర ధర్మవరం : వినికిడి సమస్య లేని ఆంధ్రప్రదేశ్గా కొనసాగించాలని ఆరోగ్య శాఖామంత్రి ఎన్డీఏ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్జీవోహంలో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ.. సెల్వియా సల్మాన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మెడికల్ ఆఫీసర్లకు, సూపర్వైజర్లకు ,ఆశా కార్యకర్తలకు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పట్టణము గ్రామాలలో వినికిడి లేని వారిపై సర్వే చేసి నివేదికను తయారు చేయాలని తెలిపారు. ఈనెల 25వ తేదీ పోతుకుంట రోడ్డు నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో వినికిడి లోపం ఉన్నవారికి స్క్రీనింగ్ చేసి ఉచితంగా వినికిడి మిషను ఇవ్వబడునని తెలిపారు. అనంతరం మంత్రి ఎన్డీఏ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వినికిడి లోపం ఉన్న వారిని సర్వేలో గుర్తించి అందరికీ న్యాయం జరిగేటట్లు అధికారులు చూడాల్సిన బాధ్యత ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో పని చేసినప్పుడే కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లతోపాటు బిఎల్టిఓ డాక్టర్ తిప్పయ్య నాయక్, ఆప్తాలిమిక్ ఆఫీసర్, సిహెచ్వోలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

ప్రజా పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..

సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్
విశాలాంధ్ర ధర్మవరం : ఈనెల 14న తలపెట్టిన ప్రజా పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ నాయకులతోపాటు పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యుత్ ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక అమలు సరిగా లేదని, నిత్యావసర ధరలు తగ్గించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెనువెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఉద్యోగుల తొలగింపును విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా పోలవరం నిర్వహిస్తులకు పరిహారము, ప్యాకేజీ ఇచ్చి, ప్రాజెక్టును విని వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మారుతి తోపాటు పెద్దన్న ,సిహెచ్ భాషా, ఎస్ఎఫ్ఐ నాగార్జున పాల్గొన్నారు.

డిస్కవర్ అనంత హై క్వాలిటీ గం బూట్స్ పంపిణీ

పారిశుద్ధ్య కార్మికులను కాపాడటమే మా లక్ష్యం అనంత డిస్కవరీ అనిల్ కుమార్

విశాలాంధ్ర -అనంతపురం : నగరంలోని మురికి కాలువలు దిగి పని చేసే పారిశుద్ధ్య కార్మికుల కోసం డిస్కవర్ అనిల్ కుమార్ ముంబై నుండి హై క్వాలిటీ గం బూట్స్ తెప్పించి ఒకటవ సర్కల్లోని 14 సచివాలయాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా అనంతపురం అనిల్ కుమార్ మాట్లాడుతూ… పారిశుద్ధ కార్మికులను కాపాడుకోవడం నగరంలోని ప్రతి పౌరుని బాధ్యత అని పేర్కొన్నారు. వారి బాగోగులు చూసుకోవడం కేవలం ప్రభుత్వం బాధ్యత ఎంత ఉందో మన కోసం వాళ్ల ప్రాణాలు పణంగా పెట్టి పని చేసే పారిశుద్ధ కార్మికుల బాగోగులు ప్రతి పౌరుని బాధ్యత కూడా అంతే ఉందన్నారు . ఈ గం బూట్లు పంపిణీ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతలు సుమారు 150 మంది కార్మికులకు ఈ గం బూట్స్ అందజేస్తామని దీనికి సుమారు 1 లక్ష ఖర్చు అవుతుందన్నారు. ఈ గం బూట్స్ ను డంప్యాడ్లో జీవనోపాధి కోసం చెత్త లో ఉండే ఐరన్, ఇతర వస్తువులను ఏరుకునే వారు కి కూడా అందజేసి డంప్యాడ్ లో వెళ్లే ప్రతి ఒక్కరు ఈ బూట్లు ధరించే విధంగా చేస్తామన్నారు. బూట్లు ధరించి డంప్యాడ్ లో వెళ్లే వారికి ప్రత్యేకంగా బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.

బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు సీరియస్..

నోటీసు ఇవ్వకుండా కూల్చివేతలు చేయవద్దని ఆదేశాలు

బుల్డోజర్ న్యాయంపై దేశవ్యాప్తంగా చర్చ
నిర్మాణాల కూల్చివేతకు 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాల్సిందేనన్న సుప్రీంకోర్టు
నోటీసులను రిజిస్టర్డ్ పోస్టులో పంపడంతోపాటు నిర్మాణం వెలుపల అంటించాలని ఆదేశాలు
నిర్మాణాలను ఎందుకు కూల్చివేస్తున్నదీ స్పష్టమైన కారణం తెలపాలన్న ధర్మాసనం
రాజ్యాంగ పరిరక్షణకు పౌర హక్కుల పరిరక్షణ చాలా అవసరమని స్పష్టీకరణ
రూల్ ఆఫ్ లాను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు బుల్డోజర్ చర్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీచేసింది. కూల్చివేతకు 15 రోజుల ముందు భవన యజమానికి నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో మార్గదర్శకాలు పాటించాల్సిందేనని పేర్కొంది. రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపడంతో పాటు నిర్మాణం వెలుపల నోటీసులు అంటించాలని తెలిపింది.

ఆ నిర్మాణాన్ని ఎందుకు కూల్చేస్తున్నదీ స్పష్టమైన కారణం తెలపాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. కూల్చివేతను వీడియో తీయాలని ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. రాజ్యాంగ పరిరక్షణకు పౌర హక్కుల పరిరక్షణ చాలా అవసరమని పేర్కొన్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ఏకపక్ష చర్యకు వ్యతిరేకంగా చట్ట నియమాలు తప్పనిసరని, చట్టపరమైన ప్రక్రియ అటువంటి చర్యను క్షమించదని స్పష్టం చేసింది.

కార్యనిర్వహణ అధికారే న్యాయమూర్తి పాత్ర పోషించి చట్టాన్ని పాటించకుండా ఇంటి కూల్చివేతకు ఆదేశాలిస్తే అది రూల్ ఆఫ్ లాను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. కూల్చివేతలకు సంబంధించి సంబంధిత వెబ్‌సైట్‌లో నోటీసులను ప్రదర్శించాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, నోటీసులను తప్పకుండా రిజిస్టర్డ్ పోస్టులోనే పంపాలని పేర్కొంది.

సోషల్‌ మీడియాలో పోస్టులపై పిల్.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ పిల్ వేయడంపై హైకోర్ట్ అభ్యంతరం తెలిపింది. సోషల్ మీడియా ఆక్టివిస్ట్‌లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టు విజయబాబు వేసిన పిల్‌పై హైకోర్ట్‌లో ఈరోజు (బుధవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులకు సంబంధించి పిల్ వేయడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరించింది. పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చట్టనిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటే తాము ఎలా నిలువరించగలమని వ్యాఖ్యలు చేసింది. పిల్‌‌కు సంబంధించి తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.