లెబనాన్‌లో సమాధుల కింద ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా నిర్మించిన భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ (ఐడీఎఫ్) గుర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. కిలోమీటర్‌కు పైగా పొడవున్న ఈ సొరంగం సరిహద్దు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సొరంగ నిర్మాణం కోసం దాదాపు 4,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను ఉపయోగించి ఉంటారని ఐడీఎఫ్ అంచనా వేసింది.ఈ వీడియోను షేర్ చేసిన ఇజ్రాయెల్ ఆర్మీ.. ఇలాంటి ఎన్నో టన్నెళ్లను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. ఈ సొరంగంలో కమాండ్ కంట్రోల్ రూములు, తుపాకులు, రాకెట్ లాంచర్లు, స్లీపింగ్ క్వార్టర్లు, డజన్ల కొద్దీ ఆయుధాలు, ఇతర సామగ్రి ఉన్నట్టు తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని గ్రామాల్లో హిజ్బుల్లా ఇలాంటి సొరంగాలను నిర్మించినట్టు వివరించింది. మరోవైపు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 3,186 మంది ప్రాణాలు కోల్పోయారు. 14,078 మంది గాయపడ్డారు. శనివారం ఒక్క రోజే 53 మంది మరణించారు.
ఏపీలో పలు చోట్ల మూడు రోజులపాటు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ అప్రమత్తం చేశారు. నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, దీని ప్రభావంతో మంగళ, బుధ, గురువారాల్లో వానలు పడతాయని చెప్పారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి మంగళవారం లోగా అల్పపీడనంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గుర్తించింది. తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ దిశగా కదులుతుందని, తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు పయనించే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, నిన్న ఏపీలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడ్డాయి.
శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్
ఏపీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2024-25ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ కాపీస్‌లోని పద్దులను చదివి వినిపిస్తున్నారు. అంతకుముందు ఆయన గత ప్రభుత్వ తప్పిదాలపై విమర్శలు చేశారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉన్నదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంది. గత ప్రభుత్వ పాలనను ప్రజలు పాతరేశారు. 93శాతం ప్రజల ఆమోదాన్ని కూటమి ప్రభుత్వం పొందగలిగిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని తగ్గించిందని విమర్శించారు.
అలాగే పరిమితికి మించిన అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. లోపభూయిష్టమైన విధానాలను అనుసరించి.. అభివృద్ధిని కుంటుపడేలా చేసిందన్నారు. శాశ్వత రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని రాష్ట్రాన్ని పునర్మిర్మాణ దిశగా నడిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుందని, గత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించిందని గత ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేదన్నారు. కాగా, నీటి పారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్‌ను ఆర్థిక శాఖ రూపొందించినట్లు స్పష్టం అవుతుంది.
బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2,35,916.99 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ. 32,712.84 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ. 34,743.38 కోట్లు, ద్రవ్య లోటు రూ. 68,742.65 కోట్లుగా పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగం ద్వారా వెల్లడించారు. బడ్జెట్‌లో వివిధ కీలక రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు.ఏపీ 2024 ఉ 25 వార్షిక బడ్జెట్ రూ. 2.94 లక్షల కోట్లు.
ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్.
.రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2.34లక్షల కోట్లు.
.మూలధనం వ్యయం అంచనా రూ. 32,712 కోట్లు.
.రెవెన్యూ లోటు రూ. 34,743 కోట్లు.
.ద్రవ్య లోటు రూ. 68,743 కోట్లు.
.జీఎస్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19శాతం.
.జీఎస్డీపీలో ద్రవ్యలోటు అంచనా 2.12 శాతం.
.వ్యవసాయ బడ్జెట్ రూ. 43,402.33 కోట్లు.
.వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 11,885 కోట్లు.
.ఉన్నత విద్యకు రూ. 2,326 కోట్లు కేటాయింపు.
.ఆరోగ్య రంగానికి రూ. 18,421 కోట్లు కేటాయింపు.
.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 16,739 కోట్లు కేటాయింపు.
.పట్టణాభివృద్ధికి రూ.11,490 కోట్లు కేటాయింపు.
.గృహ నిర్మాణ రంగానికి రూ. 4,012 కోట్లు కేటాయింపు.
.జలవనరులు రూ. 16,705 కోట్లు.
.పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు.
.ఇంధన రంగానికి రూ. 8,207 కోట్లు.
.ఎస్సీ కాంపొనెంట్ కు రూ. 18,497 కో్ట్లు.
.ఎస్టీ కాంపోనెంట్ కు రూ. 7,557 కోట్లు.
.బీసీ కాంపొనెంట్ కు రూ. 39,007 కోట్లు.
.అత్యల్ప వర్గాల సంక్షేమానికి రూ. 4,376 కోట్లు.
.ఉచిత సిలిండర్ పంపిణీకి రూ. 895 కోట్లు.
.మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం రూ. 4,285 కోట్లు.
.నైపుణ్యాభివృద్ధికి రూ. 1,215 కోట్లు.
.పాఠశాల విద్యకు రూ. 29,090 కోట్లు
.ఉన్నత విద్యకు రూ. 2,326 కోట్లు.
ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు… వైసీపీ ఎమ్మెల్యేలు దూరం
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అంతకుముందు, ఏపీ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. దాదాపు రూ.2.9 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. బడ్జెట్ అనంతరం అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాలను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్‌ను కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.
భారత 51వ చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం
భారతదేశ 51 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయించారు. 2019 జనవరి నుంచి సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్టికల్ 370 సహా పలు కీలక కేసుల్లో తీర్పులిచ్చిన బెంచ్ లలో జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉన్నారు. వచ్చే ఏడాది మే 13 వరకు ఆయన సీజేఐగా బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా, రాష్ట్రపతి భవన్ లో జరిగిన సీజేఐ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయశాఖమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు హాజరయ్యారు.
క్రికెట్లో సత్తా చాటిన ధర్మవరం జట్టు… క్రికెట్ కోచ్ రాజశేఖర్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఆర్డిటి నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్‌లో క్రికెట్ రసవత్తంగా జరిగింది. అనంతరం క్రికెట్ కోచ్ రాజశేఖర్ మాట్లాడుతూ ఇందులో భాగంగా ధర్మవరంలో నార్పల అండర్-16 అమ్మాయిలు జట్టు, ధర్మవరం అండర్-16 అమ్మాయిలు జట్టు తలపడ్డ ఇందులో టాస్ గెలిచి, బ్యాటింగ్‌కు దిగిన నార్పల జట్టు 23.3 ఓవర్లలో 100/10 పరుగులు చేసిందన్నారు. ధర్మవరం జట్టులోని హస్మిత 5 వికెట్లు కాగా, తర్వత బ్యాటింగ్‌కి దిగిన ధర్మవరం జట్టు 9 ఓవర్లలో 102/1 పరుగులు చేసిందన్నారు. ధర్మవరం జట్టు లోని హస్మిత 56(31) పరుగులతో అజేయంగా నిలచి,ధర్మవరం జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది అని కోచ్ రాజశేఖర్ తెలియజేసారు. అనంతరం విజేతలకు కోచ్ రాజశేఖర్ తో పాటు ఇతర క్రీడాకారులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
నేడే ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం..
అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ
విశాలాంధ్ర ధర్మవరం: పేద ప్రజలకు కంటి వెలుగులు ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ కార్యదర్శి నాగభూషణ కోశాధికారి సుదర్శన్ గుప్తా ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు గోరకాటి పుల్లమ్మ ,కీర్తిశేషులు గోరకాటి పెద్దారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు కోడళ్ళు గోరకాటి ప్రమీదమ్మ గోరకాటి రఘునాథరెడ్డి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ శిబిరంలో ఉదయం ఉచిత వైద్య చికిత్సలు, ఉచిత ఆపరేషన్, ఉచిత రవాణా సౌకర్యం, ఉచిత అద్దాల పంపిణీ ఉంటుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ ,గ్రామీణ, ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రతి పేదవాడికి కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యము అని తెలిపారు.
టీకాలతోనే ఆరోగ్యం
అంతర్జాతీయ రోగనిరోధక దినోత్సవం
డాక్టర్. ఏ. మహేష్
కన్సల్టెంట్ పీడియాట్రిషన్
విశాలాంధ్ర అనంతపురం : పసిపిల్లల నుండి చిన్నారుల వరకు వారికి వచ్చిన జబ్బులపై, ఇతర సమస్యలపై నిర్లక్ష్యం చేయకూడదని కిమ్స్ సవేరా డాక్టర్. ఏ. మహేష్
కన్సల్టెంట్ పీడియాట్రిషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులకు సకాలంలో టీకాలు (వ్యాక్సిన్లు) వేయించడం ద్వారా కావాల్సిన వ్యాధి నిరోధక శక్తిని పొందగలుగుతారన్నారు. చిన్నపిల్లల్లో టీకాలు చాల కీలకమైన పాత్ర వహిస్తాయి అని తెలిపారు. రోగనిరోధక శక్తి పెంచడానికి ఈ టీకాలు చాలా ఉపయోగపడుతాయి అని పేర్కొన్నారు. స్థానికంగా ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ఈ టీకాల మీద ప్రజల్లో అనేక అపోహాలు ఉన్నాయన్నారు . టీకాలు వేయడం ద్వారా చిన్నపిల్లలు బలహీనపడతారన్నారు. వ్యాధులు వ్యాప్తి చెందుతాయనే అనుమానాలు ఉన్నాయన్నారు . టీకాలు వేయడం ద్వారా చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు . పోలియో, ఇతర అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటాయని
ప్రజల్లో ఈ టీకాల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 10వ తేదీన వరల్డ్ ఇమ్యునైజేషన్ డే ని నిర్వహిస్తారు. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రజలకు టీకాల మీద అవగాహన పెంచడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతారు అని తెలిపారు. ఈ సంవత్సరం ఁప్రతిఒక్కరికి సాధ్యమే ఉ టీకాలు అందరికీ అందాలి.ఁ అనే థీమ్ తో ముందుకు వెళ్తున్నారన్నారు .
ఈ టీకాలు రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో సహాయపడతాయి అని పేర్కొన్నారు. పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయించి మనం వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు, అది మనల్ని మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా రక్షిస్తుంది, ఎందుకంటే వ్యాధిని వ్యాప్తి చేయదన్నారు. ఈ టీకాల సహాయంతో అనేక ప్రాణాంతక అంటు వ్యాధుల ప్రాబల్యాన్ని, స్మాల్ పాక్స్‌ను తగ్గించగలిగాం. అంతేకాకుండా ఈ ప్రపంచం నుండి పోలియోను నిర్మూలించే అంచున ఉన్నామన్నారు. టీకాలు వేసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు . అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, గ్రామాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా చాలా వరకు వ్యాక్సిన్‌లను ఉచితంగా అందిస్తున్నారన్నారు.
ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక
విశాలాంధ్ర. రాజాం. విజయనగరం జిల్లా.
రాజాం నియోజకవర్గం నూతన కార్యవర్గం ని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల అధికారులుగా బొత్స బుద్ధుడు,బొత్స జానకిరావు , కంబాల సుదర్శన్ వ్యవహరించారు. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినవి. గౌరవ అధ్యక్షులుగా తురక బలరాం,అధ్యక్షులుగా ధర్మాన కృష్ణ ప్రధాన కార్యదర్శిగా బోనెల గౌరీశ్వరరావు కోశాధికారిగా కలమట జగన్నాథం, ఉపాధ్యక్షులుగా దూసి సుదర్శన్ జాయింట్ సెక్రటరీగా బత్తిన సురేష్, మీడియా కన్వీనర్లుగా గుడిబండ సూర్యనారాయణ, భీంపల్లి తిరుపతిరావు, తేగల మోహన్ లను ఎన్నుకోబడ్డారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నుకోబడిన బొత్స జానకిరావు సూర.జయకృష్ణ అలాగే మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నుకోబడ్డ కలమట జగన్నాధమును ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరూ ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో జరజాన.నీలయ్య నక్క తవిటయ్య అల్లిన. తవిటి రావు,పాపారావు, మారెళ్ల కృష్ణమూర్తి, తలచింతల లక్ష్మీప్రసాదరావు,వర్రి దాలయ్య,డర్రు సుందర్ రావు, కురమాన దిలీప్ గూనాన., సింహాచలం,సూర శిరీష బూర అప్పారావు తదితరులు పాల్గొన్నారు
ప్రతిభ కనబరిచిన ఆర్టీసీ ఉద్యోగులకు నగదు ,ప్రశంసా పత్రాలు పంపిణీ..
డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఆదాయ అభివృద్ధికి కృషిచేసిన, ప్రతిభ ఘనపరిచిన ఆర్టీసీ ఉద్యోగులకు నగదు, ప్రశంసా పత్రాలను డిపో మేనేజర్ సత్యనారాయణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ ఉద్యోగుల అభినందన సభను వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్టోబర్-2024 లో ఉత్తమ ప్రతిభ ఘనపరిచిన కండక్టర్లు డ్రైవర్లు గ్యారేజ్ సిబ్బందికి తన చేతుల మీదుగా నగదు ప్రశంసా పత్రాలను అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ రాబోయే రోజులలో మరింత పోటీ తత్వముతో పనిచేసి, ఆర్టీసీ డిపోకు మంచి గుర్తింపు తేవాలని తెలిపారు. అంతేకాకుండా ప్రయాణికులు పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ గౌరవంగా ఉండాలని, తదుపరి కేఎంపిఎల్ పెంచి డిపో అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని వారు తెలిపారు. అనంతరం ప్రతిభ ఘనపరిచిన ఎనిమిది మంది ఆర్టీసీ ఉద్యోగులను అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో ఇరమై (576977 కండక్టర్ ),నరసింహులు(576444 కండక్టర్),జివిఆర్ రెడ్డి (550140 కండక్టర్ ),నాగరాజు(408166 కండక్టర్),
యన్ నరసింహులు ( 575754 కండక్టర్ ),పి పోలేరప్ప (408421 డ్రైవర్ ),వి ఆంజనేయులు (577005 డ్రైవర్ ),ఏ ఏ నారాయణ (408915 డ్రైవర్ ) కలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు శ్రీరాములు, జిపి రెడ్డి, నాగ శేఖర్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.