Friday, December 13, 2024
Homeఆంధ్రప్రదేశ్భారత 51వ చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం

భారత 51వ చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం

భారతదేశ 51 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయించారు. 2019 జనవరి నుంచి సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్టికల్ 370 సహా పలు కీలక కేసుల్లో తీర్పులిచ్చిన బెంచ్ లలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఉన్నారు. వచ్చే ఏడాది మే 13 వరకు ఆయన సీజేఐగా బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా, రాష్ట్రపతి భవన్ లో జరిగిన సీజేఐ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయశాఖమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు