Tuesday, December 10, 2024
Homeఆంధ్రప్రదేశ్టీకాలతోనే ఆరోగ్యం

టీకాలతోనే ఆరోగ్యం

అంతర్జాతీయ రోగనిరోధక దినోత్సవం
డాక్టర్. ఏ. మహేష్
కన్సల్టెంట్ పీడియాట్రిషన్

విశాలాంధ్ర అనంతపురం : పసిపిల్లల నుండి చిన్నారుల వరకు వారికి వచ్చిన జబ్బులపై, ఇతర సమస్యలపై నిర్లక్ష్యం చేయకూడదని కిమ్స్ సవేరా డాక్టర్. ఏ. మహేష్
కన్సల్టెంట్ పీడియాట్రిషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులకు సకాలంలో టీకాలు (వ్యాక్సిన్లు) వేయించడం ద్వారా కావాల్సిన వ్యాధి నిరోధక శక్తిని పొందగలుగుతారన్నారు. చిన్నపిల్లల్లో టీకాలు చాల కీలకమైన పాత్ర వహిస్తాయి అని తెలిపారు. రోగనిరోధక శక్తి పెంచడానికి ఈ టీకాలు చాలా ఉపయోగపడుతాయి అని పేర్కొన్నారు. స్థానికంగా ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ఈ టీకాల మీద ప్రజల్లో అనేక అపోహాలు ఉన్నాయన్నారు . టీకాలు వేయడం ద్వారా చిన్నపిల్లలు బలహీనపడతారన్నారు. వ్యాధులు వ్యాప్తి చెందుతాయనే అనుమానాలు ఉన్నాయన్నారు . టీకాలు వేయడం ద్వారా చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు . పోలియో, ఇతర అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటాయని
ప్రజల్లో ఈ టీకాల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 10వ తేదీన వరల్డ్ ఇమ్యునైజేషన్ డే ని నిర్వహిస్తారు. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రజలకు టీకాల మీద అవగాహన పెంచడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతారు అని తెలిపారు. ఈ సంవత్సరం ఁప్రతిఒక్కరికి సాధ్యమే ఉ టీకాలు అందరికీ అందాలి.ఁ అనే థీమ్ తో ముందుకు వెళ్తున్నారన్నారు .
ఈ టీకాలు రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో సహాయపడతాయి అని పేర్కొన్నారు. పిల్లలందరికీ వ్యాక్సిన్‌ వేయించి మనం వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు, అది మనల్ని మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా రక్షిస్తుంది, ఎందుకంటే వ్యాధిని వ్యాప్తి చేయదన్నారు. ఈ టీకాల సహాయంతో అనేక ప్రాణాంతక అంటు వ్యాధుల ప్రాబల్యాన్ని, స్మాల్ పాక్స్‌ను తగ్గించగలిగాం. అంతేకాకుండా ఈ ప్రపంచం నుండి పోలియోను నిర్మూలించే అంచున ఉన్నామన్నారు. టీకాలు వేసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు . అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, గ్రామాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా చాలా వరకు వ్యాక్సిన్‌లను ఉచితంగా అందిస్తున్నారన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు