Monday, January 6, 2025
Home Blog Page 99

బ్యాంకు మరింత అభివృద్ధి చెందాలి

అనంత ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
విశాలాంధ్ర -అనంతపురం : ది గుత్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మరింత అభివృద్ధి చెందాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్ సర్కిల్లో ఉన్న యస్.జె. టవర్స్ మొదటి అంతస్తులో ది గుత్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నాల్గవ శాఖని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బ్యాంకు ద్వారా పేద ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమిరిటీస్ విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, ది గుత్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ జిలాని, డిసిఓ అరుణకుమారి, న్యాఫ్కబ్ డైరెక్టర్ సిహెచ్ రాఘవేంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

ఏపీ యుటిఎఫ్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా శెట్టిపి జయ చంద్రారెడ్డి వరుసగా మూడోసారి ఎన్నిక

విశాలాంధ్ర ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్( ఏపీ యుటిఎఫ్), శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా ధర్మవరం పట్టణానికి చెందిన శెట్టిపి జయచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం రోజున కదిరి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత ఉన్నత పాఠశాల నందు జరిగిన సత్యసాయి జిల్లా స్వర్ణోత్సవ మహాసభల నందు వరుసగా మూడవసారి (03) ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. జయచంద్రా రెడ్డి గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా యుటిఎఫ్ అధ్యక్షులుగా రెండుమార్లు మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా ఫ్యాప్టో చైర్మన్ గా కొనసాగారు.
ఈ సందర్భంగా జయచంద్రా రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం యుటిఎఫ్ కొనసాగిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అపరిస్కృతమైన ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలియజేశారు…. తన ఎన్నికకు ఏకగ్రీవంగా సహకరించిన జిల్లా వ్యాప్త యూటీఎఫ్ నాయకులకు, కార్యకర్తలకు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు.. ఈయన ఎంపిక పట్ల ధర్మవరం జోన్ యుటిఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, ఆంజనేయులు, లక్ష్మయ్య, హరికృష్ణ, సాయి గణేష్ , న.రామాంజనేయులు, అమర్ నారాయణరెడ్డి, మేరీ వర కుమారి ,లతా దేవి గోపాల్ రెడ్డి, శివయ్య, సకల చంద్ర శేఖర్, సురేష్, జనార్ధన్ బాబు, మల్లేష్, బిల్లే రామాంజనేయులు, రాంప్రసాద్, హరి శంకర్, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

గ్రామాలలో నిర్వహించే గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి..

తాసిల్దార్ (ఎఫ్ ఎ సి) సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం : జిల్లా కలెక్టర్ చేతన్, ఆర్డీవో మహేష్ ఆదేశాల మేరకు మండలములోని వివిధ పంచాయతీలలో గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు తాసిల్దార్ (ఎఫ్ ఎ సి) సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రజా సమస్యల పరిష్కారిక వేదిక లో భాగంగా ఈ గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఆయా గ్రామసభలలో సంబంధిత అధికారులు ఉంటారని, ప్రజలు తమ యొక్క సమస్యలను ఏవైనా సరే తెలుపుకునే అవకాశం తో పాటు దరఖాస్తును ఇస్తూ తమ ద్వారా రసీదును కూడా పొందవచ్చునని, అనంతరం ఆన్లైన్లో నమోదు చేసి, విచారణ తర్వాత షెడ్యూల్ తేదీ ప్రకారం పరిష్కరించబడునని తెలిపారు. ఇప్పటికే గ్రామాలలో గ్రామ సభల యొక్క వివరాలను సంబంధిత సచివాలయం, వీఆర్వోల ద్వారా తెలియపరచడం జరిగిందని తెలిపారు. ఈనెల 12న దర్శనమల, 13న నేలకోట, 14న మల్లా కాలువ, 15న ఏలుకుంట్ల, బుడ్డారెడ్డిపల్లి, 19న రావుల చెరువు, 20న తుమ్మల, సుబ్బారావు పేట, 21న పోతుల నాగేపల్లి, 22న గోట్లూరు, 26న చిగీచెర్ల, 27న రేగాటిపల్లి ,28న కునుతురు, 29న ధర్మవరంలో ఉంటుందని తెలిపారు.

క్రీడలను ప్రోత్సహిస్తున్న సంద రాఘవ అభినందనీయులు

-ఐదవ రోజు సాగిన క్రికెట్ పోటీలు
-ముఖ్యఅతిథిగా హాజరైన వన్టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం : ఎంతోమందిలో క్రీడా నైపుణ్యమున్నప్పటికీ సరైన ప్రోత్సాహం లేక ఇబ్బంది పడుతున్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రముఖ చేనేత నాయకులు సంద రాఘవ ముందుకు రావడం అభినందనీయమని ఒకటవ పట్టణ సీఐ నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నీలో భాగంగా 5 వ రోజు సిఐ నాగేంద్ర ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. పోటీల్లో రెండు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగింది. మొదటిసారి విశ్వనాథ్ వర్సెస్ ఎస్ ఎల్ వి జట్ల మధ్య పోటీలు నిర్వహించగా ఇందులో ఎస్ఎల్వి జట్టు కు విజయం వరించింది. అనంతరం ఛాలెంజర్ వర్సెస్ నాయక్ జట్ల మధ్య పోటీ నిర్వహించగా నాయక్ జట్టు ఘన విజయం సాధించింది. మూడోసారి అర్జున్ టైటాన్స్ వర్సెస్ సోమందేపల్లి పోటీ నిర్వహించగా సోమండేపల్లి జట్టు విజయాన్ని సాధించింది. అనంతరం దంపెట్ల, అగ్రహారం జట్ల తలపడగా అగ్రహారం జట్టు విజయాన్ని అందుకుంది. ఐదవ సారి జరిగిన క్రికెట్ పోటీలో మేడాపురం వర్సెస్ కనగానపల్లి జట్ల మధ్య పోటీ నిర్వహించగా మేడాపురం జట్టు విజయాన్ని అందుకుంది. చివరిగా ఎర్రోనిపల్లి వెర్సెస్ వెంకటన్న లయన్స్ మధ్య పోటీ జరగగా వెంకటన్న లయన్స్ కు విజయం వరించింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ప్రముఖ చేనేత నాయకులు సంద రాఘవ, నిర్వాహకులు జింకా పురుషోత్తం, శ్యాంసుందర్, అఖిల్, జావేద్, భరత్, సాయినాథ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కుల గణనను తక్షణమే చేపట్టాలి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్

విశాలాంధ్ర -అనంతపురం : ఆంధ్ర రాష్ట్రంలో కుల గణనను తక్షణమే చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ పేర్కొన్నారు. సోమవారం సిపిఐ జిల్లా ఆఫీసులో పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. ఇందులో సహయ కార్యదర్శులు నారాయణ స్వామి, మల్లికార్జున జిల్లా నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో కుల గణన చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ, బీహార్ తదితర రాష్ట్రాలలో కుల గణన ప్రారంభమయినదని అని పేర్కొన్నారు. 2027 లో దేశవ్యాపితంగా పార్లమెంటు, ఆసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న క్రమంలో కుల గణన చేపడితే దళితులకు, వెనకబడిన వర్గాలకు ఎక్కడెక్కడ ఏఏ స్థానాలలోః, ఎన్ని నియోజకవర్గాలు రిజర్వేషను చేయాలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఆయా కులాల ప్రజలకు ఏఏ ప్రభుత్వ పథకాలు అందించాలనే విషయం పాలకులకు తెలియ వస్తుందన్నారు. వీటితో పాటు కులాల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల సంఖ్యను పెంచడం లేదా తక్కువ జనాభా ఉంటే తగ్గించడం లాంటి విషయాలలో కూడా రాజకీయ పార్టీలకు అవగాహణ వస్తుందని జగదీష్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరికి సమగ్ర, సమాన అవకాశాలు కల్పించబడతాయన్నారు. అభివృద్ధి ఫలాలను కులాల జనా బా ఆధారంగా పంపిణి చేయడానికి ప్రభుత్వానికి సృస్టత వస్తుందన్నారు. కుల గణన చేపట్టడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి బి .సి , దళిత , మైనార్టీ కుల సంఘాలను కలుపుకొని సదస్సులు, రౌండ్ టేబుల్ మీటింగులు జరపాలని పార్టీ శ్రేణులకు జగదీష్ సూచనలు చేశారు.

పేకాట స్థావరంపై పోలీసులు దాడు లు

10మంది అరెస్ట్–రూ.59, 100 నగదు స్వాధీనం… వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం:: రాబడిన సమాచారం మేరకు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో దుర్గమ్మ గుడి వెనక భాగాన పేకాట ఆడుతున్న స్థావరంపై వన్టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ తన సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పదిమందిని అరెస్టు చేసి, రూ.59,100 లా నాగదును స్వాధీనం చేసుకొని, జూదరులపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం కోర్టుకు తరలించినట్లు సిఐ తెలిపారు.

ఆకట్టుకున్న ధర్మవరం రాకింగ్ స్టార్స్ డాన్స్ అకాడమీ నృత్య ప్రదర్శనలు

రాకింగ్ స్టార్ డాన్స్ అకాడమీ డాన్స్ మాస్టర్ లోకేష్ కు భారత్ బుక్ ఆఫ్ రికార్డు 2024 కైవసం
విశాలాంధ్ర ధర్మవరం : హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియం లో భారత్ ఆర్ట్స్ సమస్త వారు, బాలోత్సవ్ చిల్డ్రన్స్ డే సెలెబ్రేషన్స్ వేడుకలు అంగరంగ వైభావంగా జరిగాయి.. ఈ కార్యక్రమం ఆహ్వానం కొరుకు ధర్మవరం రాకింగ్ స్టార్స్ డాన్స్ అకాడమీ విద్యార్థులు పాల్గున్నారు.. ఈ సందర్బంగా డాన్స్ మాస్టర్ లోకేష్ మాట్లాడుతూ.. భారత్ ఆర్ట్స్ వారు నిర్వహించిన బలోస్తావ్ చిల్డ్రన్స్ డే వేడుకలుకు రవీంద్ర భారతి ఆర్ట్స్ వారు మమ్మల్ని ఆహ్వానించునందుకు మాకు ఎంతో సంతోషం ఉందని, అలాగే మా అకాడమీ చేసిన నృత్యలు అందర్నీ ఎంత గానో ఆకట్టుకోవడం జరిగిందని తెలిపారు.ఈ నాట్య ప్రదర్శన లో, , సోనీ,తన్మాయ్,శ్రావణి వందన, , శిరీష్ , దిలీప్ , కావ్య, సునీల్ ఈ నాట్య ప్రదర్శన లో పాల్గొన్నారు అని తెలిపారు.అనంతరం నృత్య ప్రదర్శన చేసిన అందరికి రవీంద్ర భారతి సంస్థ వారు , అలాగే సీనియర్ యాక్టర్స్ దివ్య వాని , జబర్దస్త్ ఆర్టిస్ట్స్ చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సత్కరించారు అని తెలిపారు. తదుపురిగా డాన్స్ మాస్టర్ లోకేష్ కు భారత్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డును సంస్థ వారు అందజేయడం జరిగిందన్నారు. డాన్స్ మాస్టర్ లోకేష్ మాట్లాడుతూ కళ అంటే ధర్మవరం, ధర్మవరం అంటేనే కళ అనే ధర్మవరశీ లో ఎందరో నాట్యం మీద ఆసక్తితో ఉన్నారని వారిని అన్నివిధాలుగా తీర్చాధిద్దాడమే తన లక్ష్యం అని, అలాగే నాట్యం నేర్చుకోవాలి అని ఆసిక్తితో ఉన్నవారికి పేద పిల్లలకు నా వంతుగా ఉచితంగా డాన్స్ నేర్పిస్తారని తెలియచేసారు.. అలాగే నా తల్లి తండ్రులు కి నా పాదాభివందనలు నన్ను ఈ అవార్డు వచ్చేలా ఎంత గానో కృషి చేసిన నా విద్యార్థులకు,నాతోటి స్నేహితుడు డాన్స్ మాస్టర్ ముందు ఉండి నడిపించిన అస్లాం కి కృతజ్ఞతలు తెలియచేసారు.

మౌలానా ముస్తాక్ అహ్మద్ కి అభినందన వెల్లువ

విశాలాంధ్ర ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ గా మౌలానా ముస్తాక్ అహ్మదును నియమించడం పట్ల ముస్లిం మైనారిటీ సంక్షేమం వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణములోని నోమాని, ముద్రస ఏ కాసి పుల్ ఉలూమ్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ సయ్యద్ ఉమర్ ఫారూఖ్ వారు ముస్తాక్ అహ్మద్ కు తమ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో మౌలానా ముస్తాక్ అహ్మద్ మరిన్ని పదవులను అధిరోహిస్తూ ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేయాలని వారు తెలిపారు.

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం..

అధ్యక్ష, కార్యదర్శులు జయసింహ, నాగభూషణం
విశాలాంధ్ర ధర్మవరం : పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం అని అధ్యక్షులు బి. జయసింహ, కార్యదర్శి డి. నాగభూషణ ,కోశాధికారి వై.సుదర్శన్ గుప్తా,ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ గట్టు హరినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) లో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ వివిధ రూపాలలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సేవలను అందిస్తూ పేద ప్రజల మన్ననలను పొందుతుండడం మాకెంతో సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. అంతేకాకుండా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కూడా నడుస్తోందని తెలిపారు. ఈ కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం రోటరీ క్లబ్బు ,శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ- శ్రీ సత్య సాయి జిల్లా వారి సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు గోరకాటి పుల్లమ్మ, కీర్తిశేషులు గోరకాటి పెద్దారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గోరకాటి ప్రమీలమ్మ గోరకాటి రఘునాథరెడ్డి వ్యవహరించడం పట్ల క్లబ్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరానికి వచ్చిన పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి పేదవానికి ఉచిత వైద్యం, ఉచిత ఆపరేషన్లు, ఉచిత రవాణా సౌకర్యం, ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేస్తున్నట్టు వారు తెలిపారు. ఈ శిబిరంలో 145 మంది కంటి రోగులు పాల్గొనగా అందులో 96 మందికి ఆపరేషన్కు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఆపరేషన్లు చేయించుకున్న వారందరూ కూడా మీ యొక్క ఆపరేషన్లు రోటరీ క్లబ్ ద్వారా నిర్వహించామన్న సమాచారాన్ని ప్రతి ఒక్కరు తెలియజేయాలని తెలిపారు. నేటి ఈ శిబిరానికి విశేష స్పందన రావడం పట్ల అందరికీ రోటరీ క్లబ్ వారు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. అంతేకాకుండా నేత్రదానమును కూడా ప్రతి ఒక్కరూ అవసరమైన సమయంలో చేయాలని వారు తెలిపారు. అలా నేత్రదానం చేస్తే రెండు జీవితాలలో వెలుగులు నింపుతారని తెలిపారు. అనంతరం డాక్టర్ రాధిక తో పాటు దాతలను కూడా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పల్స్ పోలియో చైర్మన్ రత్నశేఖర్ రెడ్డి, రమేష్ బాబు, శివయ్య ,కొండయ్య ,శ్రీనివాసుల రెడ్డి, బండారు వెంకటచలం, మనోహర్ గుప్తా, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం అత్యంత వైభవంగా పూర్వ విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు రాఘవేంద్ర, శివరాం, నాగార్జున, నరేంద్ర మాట్లాడుతూ2003-04 సంవత్సరపు బ్యాచ్కు సంబంధించిన తాము 90 మంది ఒకే చోట కలవడం ఎంతో సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇస్తోందని తెలిపారు. ఆనాటి తీపి గుర్తులను జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి గురువులను కలవడం ఒక అపూర్వ సంఘటనగా ఉందని వారు తెలిపారు. నేడు పూర్వ విద్యార్థుల ఆయన మేము గురువులు తల్లిదండ్రుల ఆశీస్సుల మేరకు వారి వారి స్థాయిలలో జీవితంలో స్థిరపడడం జరిగిందని తెలిపారు. ఏది ఏమైనా గురువులను మరోసారి ఒకే వేదిక మీద కలవడం మాకు చక్కటి ఉత్సాహంతోపాటు గర్వంగా ఉందని తెలిపారు. 90 మంది విద్యార్థులు వేదిక మీద ఆనాటి పాఠశాలలో తాము నేర్చుకున్న జ్ఞాపకాలను వారు మాట్లాడారు. తదుపరి పాఠశాల హెచ్ఎం రాంప్రసాద్, మాజీ హెడ్మాస్టర్ శ్రీనివాసులురెడ్డి, డ్రిల్ మాస్టర్ లక్ష్మీనారాయణ, సైన్స్ టీచర్ సంజీవయ్య, ఆంగ్లం టీచర్ శ్రీనివాసులు ఘనంగా సత్కరించారు. త్వరలో మా పూర్వ విద్యార్థుల తరఫున పాఠశాలకు తగిన సహాయ సహకారాలను తప్పక అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 90 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని ఈ సమ్మేళన విజయవంతం చేశారు.