విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : స్థానిక జి.సి.ఎస్.ఆర్. కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కళాశాల డిగ్రీ విభాగానికి చెందిన 43 మంది విద్యార్థులు వివిధ రక్త గ్రూపులకు చెందిన రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. పురుషోత్తమరావు మాట్లాడుతూ ఒకప్పుడు అన్నదానం గొప్పదని అనేవారు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దానాల కంటే రక్తదానమే గొప్పది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు లేదా క్షతగాత్రులకు విద్యార్థులు అందించే రక్తం ఎంతగానో ఉపయుక్తమవుతుంది. రెడ్ క్రాస్ సహకారంతో ఇప్పటివరకు వేలాది ప్రాణాలు రక్షించబడ్డాయి. అందుకే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలిు అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజాం బ్రాంచ్ రెడ్ క్రాస్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్, ప్రముఖ ఇఎన్టి నిపుణులు డాక్టర్ పెనుమత్స రఘు బాబు, రెడ్ క్రాస్ సభ్యుడు పెంకి చైతన్య కుమార్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ చౌదరి రవీంద్ర కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ పీవోలు చిరికి శ్రీనివాసరావు, తురంగి విశ్వనాథం, అలాగే పలువురు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.


