విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో పలు కార్యక్రమాలు చేసేందుకు ప్రసాద వితరణ శాలకు రేకుల షెడ్డు నిర్మాణం కొరకు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు లక్ష్మీపతి, కార్యదర్శి విజయ రాఘవేంద్ర, బిజెపి నాయకుడు శ్యామ్ రావు తదితరులు ఆలయంలో ఆలయ ఈవో వెంకటేశులు సమక్షంలో అడ హక్ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీష్ కు 3 లక్షల రూపాయలు విలువచేసే రేకుల షెడ్డు కునగదును అందజేశారు. ఈ సందర్భంగా చెన్నంశెట్టి జగదీష్, వెంకటేశులు బ్రాహ్మణ సంఘం వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. తొలుత రేకుల షెడ్డు కొరకు ఆలయ ఈవోను అనుమతి కోరడం జరిగిందని వారు తెలిపారు. దీంతో ప్రసాద వితరణశాలకు రేకుల షెడ్డు ఏర్పడితే చాలా ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శివ, పనిరాజ్, కిషోర్, జయసింహ ,శేషు, మణి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రేకుల షెడ్డు నిర్మాణమునకు బ్రాహ్మణ సంఘం విరాళం
RELATED ARTICLES