Thursday, December 11, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశాకాంబరి అలంకరణలో వాసవి మాత..

శాకాంబరి అలంకరణలో వాసవి మాత..

- Advertisement -

వాసవి మహిళా మండలి.. అధ్యక్షురాలు పోలమడ రూప రాగిణి
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని కే పి టి లో గల వాసవి దేవాలయంలో వాసవి మాత శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాన్ని వివిధ ఆకులతో, అరటి మెట్లతో, మామిడాకులతో, వివిధ రకాల కాయగూరలతో అలంకరించిన వైనం అందరిని విశేషంగా ఆకట్టుకుంది. తొలుత అర్చకులు నారాయణమూర్తి, చంద్రశేఖర్ శర్మ ఉత్సవ, మూలవిరాట్ విగ్రహాలకు ప్రత్యేక పూజలు, అర్చనలు, వివిధ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు పోలమడ రూప రాగిణి, కార్యదర్శి కాకుమాని కళ్యాణి, కోశాధికారి నల్లపేట మంజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శాకాంబరి అలంకరణ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, ఆర్యవైశ్యుల సహాయ సహకారాలు, ఆర్యవైశ్య సంఘం దాని అనుబంధ సంస్థల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. శాకంబరీ అలంకరణలో 1000 కేజీల తో 14 పండ్ల రకాలు, 22 రకాల కాయగూరలతో వెయ్యి కేజీల కలుపుకొని అలంకరణ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం మహిళలచే వాసవి సహస్రనామం పారాయణం, పలు గీతాలు సామూహికంగా నిర్వహించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఉత్సవ, మూలవిరాట్ విగ్రహాలకు శాకంబరి అలంకరణను నిర్వహించి ఆర్యవైశ్యులకు దర్శనం ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడంలో సహకరించిన వారందరికీ కూడా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దేశం, రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులతో ఆలయం కిటకిట లాడింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జూటూరు రమణయ్య, వాసవి ట్రస్ట్ చైర్మన్ పిన్ను ప్రసాద్, వాసవి మహిళా మండలి సభ్యులు కలవల శ్రీదేవి, పిన్ను సాయిజ్యోతి, ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య ఆలయ సంఘం యొక్క వివిధ అనుబంధ సంస్థల వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు