Tuesday, November 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగుండెపోటు రాకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలి

గుండెపోటు రాకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలి

- Advertisement -

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్
విశాలాంధ్ర ధర్మవరం : గుండె పేటు రాకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తీపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలను వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల పాటు అన్ని రోగాలకు నిష్ణాతులైన వైద్యులచే వైద్య చికిత్సలతో పాటు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. ముఖ్యంగా గుండె పోటు రావడానికి నాలుగు రకాల కారణాలు ఉన్నాయని, అందులో షుగరు కంట్రోల్లో లేకపోవడం, బీపీ ఎక్కువ ఉండడం, పొగాకు పదార్థాలైన సిగరెట్లు తాగడం, అధికంగా మద్యం సేవించడం, పాన్ పరాగ్ తదితర లాంటివి నమలడం చేయరాదని తెలిపారు, అంతేకాకుండా అధిక బరువు ఉన్నవారు కొలెస్ట్రాల్లో పెరుగుతుందని, తద్వారా గుండె రక్తనాళాలు పూడుకు పోతాయని, రక్త ప్రసరణ ఉండదని తెలిపారు. సరి అయిన శారీరక శ్రమ లేకపోవడం కూడా ఒక కారణమని తెలిపారు. ఇక గుండె నొప్పి (హార్ట్ ఎటాక్) లక్షణాలకు వెళితే ఎడమ లేదా కుడి వైపు నొప్పి, మెడ వైపు నొప్పి, వీపు వైపు నొప్పి, చెమట పట్టడం, వాంతులు రావడం, బేదులు కలగడం, కళ్ళు తిరగడం, దవడ నొప్పి, బీపీ పెరగడం లాంటివి లక్షణాలు అని తెలిపారు. అంతేకాకుండా గుండె నొప్పి వచ్చినప్పుడు కొంతమంది అపోహలకు పోరాదని వారు స్పష్టం చేశారు. ఇందులో కడుపు నొప్పి వచ్చినప్పుడు గ్యాస్ ట్రబుల్ అని చాలామంది అపోహలకు గురవుతారని, అది పూర్తిగా తప్పు అని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వము కూడా శమీ అనే కార్యక్రమాన్ని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవేశపెట్టిందని తెలిపారు. దీనివల్ల గుండె నొప్పి వచ్చినప్పుడు, లేదా లక్షణాలు వచ్చినప్పుడు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో 40 వేల రూపాయలు విలువ చేసే ఇంజక్షన్ వైద్యులు ఉచితంగా వేస్తారు అని తెలిపారు. అందుకే ఈసీజీ పరీక్ష చేసినప్పుడు గుండె యొక్క స్థితి ఆటోమేటిక్గా తెలుస్తుందని. తద్వారా హార్ట్ ఎటాక్ ను గుర్తించే అవకాశం ఉందని తెలిపారు. కావున పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు గుండె నొప్పి విషయంలో అపూహలకు తావు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు వహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల సలహాలను పాటిస్తూ వైద్య చికిత్సలు పొందాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు