Sunday, December 14, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎన్ డి ఏ ప్రభుత్వము యొక్క మోసాలు ప్రతి ఇంట తెలియజేయండి..

ఎన్ డి ఏ ప్రభుత్వము యొక్క మోసాలు ప్రతి ఇంట తెలియజేయండి..

- Advertisement -

వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : ఎన్డీఏ ప్రభుత్వము యొక్క మోసాలను ధర్మవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ప్రతి ఇంటికి తెలియజేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మారుతి రాఘవేంద్ర స్వామి కళ్యాణమండపంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షురాలు ఉశాశ్రీ చరణ్ హిందూపూర్ పార్లమెంట్ అబ్జర్వర్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వేంపల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ 143 హామీలు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కిందని తెలిపారు. వంచనకు మారుపేరు చంద్రబాబు అని తెలిపారు. ప్రజల్ని మోసపూరిత హామీలతో నమ్మించడం, వంటించడం చంద్రబాబు నైజం అని వారు స్పష్టం చేశారు. అనంతరం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ను వారు విడుదల చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ మోసాలను ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, ఎన్నో ఇబ్బందులకు ప్రభుత్వం గురిచేసిందని వారు మండిపడ్డారు. ప్రతి రైతుకు 20వేల రూపాయలు అందిస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేకపోవడం దారుణము కాదా అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పడ్డలకు మద్దతు ధర కూడా ఇవ్వకుండా పతనావస్థకు దిగజారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సిలిండర్లు ఉచితమని చెప్పి ఒక సిలిండర్ కి స్వస్తి పలకడం సమంజసమా అని వారు ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం వాలంటీర్లను తొలగించిందని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను కూడా రద్దు చేసిందని వారు మండిపడ్డారు. చంద్రబాబు వంచన గ్రహించే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత కనపడుతోందని వారు తెలిపారు. ఇటీవల గోరంట్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి వచ్చిన జన సంద్రాన్ని చూసి చంద్రబాబు షాక్ తిన్నారని తెలిపారు. త్వరలో వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసి తీరుతామని వారు తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి ఒక కన్ను ప్రజలు అయితే మరొక కన్ను కార్యకర్తలేనని వారు స్పష్టం చేశారు. చంద్రబాబు మోసాలను, ఎన్డీఏ మోసాలను వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులు సమన్వయంగా ఐక్యమత్యంతో ప్రతి ఇంటికి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలలో జయభేరి మోగించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల సీనియర్, జూనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ పదాధికారులు, అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు