విశాలాంధ్ర- ధర్మవరం : తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే అనారోగ్యంతో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా కార్యకర్త బళ్ళారి నాగరత్నమ్మ కుటుంబానికి పరిటాల శ్రీరామ్ తరపున టిడిపి నేతలు మృతురాలు భర్త బళ్లారి వెంకటేష్ కు 40 వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ నేతల చేతులు మీదుగా ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన బళ్లారి నాగరత్నమ్మ పార్టీలో ఎన్నో సేవలు అందించిందని, ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తెలిపారు. నాగరత్నమ్మ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు.
టిడిపి మహిళా కార్యకర్త కుటుంబానికి పరిటాల శ్రీరామ్ ఆర్థిక సహాయం అందవేత
- Advertisement -
RELATED ARTICLES


