మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది..
హిందూపురం జిఆర్పి హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని పోతుకుంట బ్రిడ్జ్ కింద గల రైల్వే పట్టాలపై పట్టణంలో సాయి నగర్కు చెందిన పర్వతయ్య కుమారుడు నున్న మల్లప్ప (53) రైలు కిందపడి మృతి చెందాడని హిందూపురం జిఆర్పి రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రైల్వే కీ మెన్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగిందని, రైల్వే పట్టాల వద్ద పడిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సాయి నగర్ లో మల్లప్ప చేనేత కార్మికుడిగా జీవిస్తున్నాడని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై తాము విచారిస్తున్నట్లు వారు తెలిపారు. మృతునికి భార్యతో పాటు పిల్లలు కూడా కలరని వారు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


