పలు వాహనాలకు జరిమానా విధింపు
ఆర్డిఓ మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం డివిజన్ పరిధిలో గల తాడిమర్రి బత్తలపల్లి ధర్మవరం మండలాలలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న పలు వాహనాలపై ఆర్డిఓ మహేష్ ఆకస్మిక దాడి చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలో పలు ఇసుక వాహనాలను తరలిస్తున్న జెసిబి తో పాటు పలు వాహనాలను గుర్తించి సీజ్ చేసి జరిమానా విధించడం జరిగిందని ఆర్డీవో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న ఫిర్యాదులు అధికంగా రావడంతో ఈ ఆకాష్మిక దాడులను నిర్వహించడం జరిగిందని తెలిపారు. అక్రమ ఇసుక తరలింపులో మూడు ట్ర క్టర్లు, రెండు ట్రిప్పర్లు ,ఒక జెసిబి వాహనాలను గుర్తించి సీజ్ చేసి జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పురాతమైతే మైండ్స్ అండ్ మినరల్స్ చట్టం కింద నేరంగా భావించి కేసులను నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గ ప్రజలు కూడా ఇలాంటి అక్రమ ఇసుక రవాణా కార్యకలాపాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని పోవాలని తెలిపారు. సమాచారమిచ్చిన వారి పేరును గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వానిబంధనలను ఎవరైనా అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని వారి హెచ్చరించడం జరిగింది. అనంతరం పోలీస్ శాఖ గనుల శాఖకు తగిన సూచనలను వారు తెలియజేశారు. అంతేకాకుండా ఈ తనిఖీల ద్వారా అధికారులు అక్రమ ఇసుక రవాణా చర్యలపై నిఘా కొనసాగించాలని, సమాచారం అందిన వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. ఈ ఇసుక అక్రమ రవాణాపై ఎవరిని ఉపేక్షించమని వారు తెలియజేశారు.
అక్రమ ఇసుక రవాణాపై ఆర్డిఓ దాడి..
- Advertisement -
RELATED ARTICLES


