Homeఆంధ్రప్రదేశ్మాచర్లలో నిర్భయ తరహా దాడి..

మాచర్లలో నిర్భయ తరహా దాడి..

- Advertisement -

పల్నాడు జిల్లా మాచర్లలో ఒంటరి మహిళపై జరిగిన పాశవిక దాడి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మాచర్లలో ఒంటరిగా ఉంటున్న 32 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగినిపై ఒక దుండగుడు కిరాతకంగా అత్యాచారం చేశాడు. ఈ ఘటన గత గురువారం సాయంత్రం జరిగింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా సత్తెనపల్లికి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతుండగా… నీళ్లు కావాలంటూ దుండగుడు బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత కత్తితో బెదిరించి ఆమెపై దాడికి దిగాడు.బాధితురాలిని వివస్త్రను చేసి, కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా, ఆమె ప్రైవేట్ భాగాల్లోకి ఇనుప రాడ్ దూర్చి అత్యంత క్రూరంగా హింసించాడు. తనను తాను కాపాడుకునేందుకు బాధితురాలు తనకు ఃఎయిడ్స్ః ఉందని చెప్పినా, నిందితుడు వినకుండా దారుణానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.ప్రస్తుతం బాధితురాలు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేసు విచారణ బాధ్యతను అదనపు ఎస్పీ స్థాయి అధికారికి అప్పగించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని ప్రాథమికంగా గుర్తించారు. ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి.మాచర్ల ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మానంద రెడ్డి ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. మహిళలపై ఇటువంటి దాడులు జరగడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు