- Advertisement -
ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడి ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి చెందింది. ప్రమాదంలో ఇన్ఫోసిస్ టెకీ సౌమ్య రెడ్డి (25) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఓఆర్ఆర్‌పై వీరు ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టింది. కారులో సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతురాలు సౌమ్య రెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలగా పోలీసులు గుర్తించారు.


