Homeజిల్లాలుశ్రీ సత్యసాయికేంద్ర బృంద సభ్యులు పర్యటన

కేంద్ర బృంద సభ్యులు పర్యటన

- Advertisement -

ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం;; స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ – 2025 లో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండల పరిధిలోని చిగ్గిచెర్ల గ్రామపంచాయతీని కేంద్ర బృంద సభ్యులు గ్రామములో పర్యటించారు. ఇందులో భాగంగా గ్రామములోని జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్, అంగన్వాడీ కేంద్రము, ప్రాధమిక ఆరోగ్యకేంద్రం, గ్రామసచివాలయం, చెత్త సంపద కేంద్రము, గ్రామములో ఉన్న గృహాలును మరుగుదొడ్లును, నీటి వసతి, పరిసరాలు పరిశుభ్రత ను, మురుగు నీటి వనరులును వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. తొలుత సచివాలయంలో రికార్డులను వారు పరిశీలించారు. ప్రజలకు చేస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యము లో భాగంగా మరుగుదొడ్లు, బాత్రూములు, హ్యాండ్ వాష్, డస్ట్ బిన్నుల వినియోగంపై వారి వారి అభిప్రాయాలను అడిగి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, గత ఐదు సంవత్సరాలు తర్వాత ఈసారి ఎలా ఉంది పోలిక అని ప్రజలను అడిగి చెత్త నుండి సంపద తయారును పనితీరును అక్కడ ఉన్నటువంటి పలు రికార్డులను వారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మరుగుదొడ్ల వినియోగం చిగిచెర్ల గ్రామంలో 98 శాతము అమలు కావడం గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు. తదుపరి ఘన పదార్థాల రవాణాకు ఏర్పాట్లు, ద్రవ వ్యర్థాల నిర్వహణ గూర్చి ,బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయుట లాంటి అంశాలపై పలు సూచనలను తెలియజేశారు. తదుపరి గ్రామపంచాయతీ ఆఫీసు పనితీరును అడిగి తెలుసుకుంటూ, పలు రికార్డులు కూడా వారు పరిశీలించారు. మొత్తం మీద చిగిచెర్ల గ్రామం నిర్వహణపై కేంద్ర బృందం సభ్యులు సంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో కేంద్ర బృంద సభ్యులు కే రామాంజినేయులు , జిల్లా ఎస్. బి.ఎమ్. కొ ఆర్డినేటర్స్ అనంత , డి. సాయి నాథ్ బాబు , మండల అధికారులు , డి ప్యూటీ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు , గ్రామ సర్పంచ్ బాబయ్య , పంచాయతీ సెక్రెటరీ రెడ్దమ్మ , గ్రామ నాయకులు రాఘవ రెడ్డి ,పార్థ రెడ్డి , చండ్రాయుడు, ఫీల్డ్ అసిస్టెంట్లు ,గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు