మానవతా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి.
విశాలాంధ్ర ధర్మవరం;; గర్భవతులు ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకోవాలని మానవత సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కొత్తపేటలో గల అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు 50 మందికి పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతగా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి వహించారు. అనంతరం డాక్టర్ ప్రియాంక, మానవతా సంస్థ అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, చైర్మన్ తల్లం నారాయణమూర్తి, డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పాటించవలసిన శారీరిక మానసిక జాగ్రత్తగా వివరించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు పొందాలని తెలిపారు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా గర్భిణీ స్త్రీలకు వివిధ పథకాలను కూడా ప్రవేశపెట్టిందని తెలిపారు. కుటుంబంలోని సభ్యులు కూడా గర్భిణీ స్త్రీలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తూ, సంతోషమైన జీవనాన్ని గడిపే విధంగా అలవర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతగా తల్లం నారాయణమూర్తి వ్యవహరించడం పట్ల కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి రామకృష్ణ డైరెక్టర్లు బి రామకృష్ణ, చిన్నప్ప, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
గర్భిణీలు ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకోవాలి..
- Advertisement -
RELATED ARTICLES


