విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 24న విజయవాడలో నిర్వహించనున్న రైతు-కూలీల మహా ధర్నాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు జిల్లా సహాయ కార్యదర్శి హనుమంతు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాలకృష్ణ లు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవనంలో ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడిన నాయకులు, ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టాన్ని పట్టించుకోకుండా సుమారు 1.95 లక్షల ఎకరాల భూములను బలవంతంగా ఆక్రమించినట్లు ఆరోపించారు. ఈ భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఇప్పటి వరకు పునరావాసం, పరిహారం కల్పించలేదని, ఒక్క ఉద్యోగ అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాల వారికి మాత్రమే అవకాశాలు కల్పిస్తూ, స్థానికులను విస్మరించారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో పేదలను దారిద్ర్యానికి తోసిపుచ్చి, కార్పొరేట్లు, రాజకీయ నాయకులకు మాత్రమే లాభాలు చేకూర్చుతున్నారని మండిపడ్డారు. “మా భూములు జోలికొస్తే ఖబర్దార్” అంటూ హెచ్చరిస్తూ, రైతులు, కూలీలు విజయవాడ మహా ధర్నాకు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ మండల కార్యదర్శి రామాంజనేయులు, రైతు సంఘం నాయకులు చిన్న సుంకన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విధానాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రైతు-కార్మికుల హక్కుల కోసం పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుందని నాయకులు తెలిపారు.
చలో విజయవాడ కర పత్రాలు విడుదల
- Advertisement -
RELATED ARTICLES


