Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసూర్య ప్రభ, చంద్రప్రభ వాహనాలలో ఊరేగిన చెన్నకేశవుడు..

సూర్య ప్రభ, చంద్రప్రభ వాహనాలలో ఊరేగిన చెన్నకేశవుడు..

- Advertisement -

ఆలయ ఈవో వెంకటేశులు, అడ హక్ కమిటీ చైర్మన్ చెన్నంశెట్టి జగదీశ్వర ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం వారి బ్రహ్మోత్సవ వేడుకలు రెండవ రోజు దాతలు, భక్తాదులు, ఆలయ ఈవో వెంకటేశులు, అడహక్ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం సూర్యప్రభ వాహనమునకు అర్చకులు కోనేరాచార్యులు, మకరందబాబు ,చక్రధర్ లు వేదమంత్రాలు ,మంగళ వాయిద్యాలయం ప్రత్యేక అర్చనలు, పూజలు చక్కటి అలంకరణ గావించారు. ఈ సూర్యప్రభ వాహనానికి ఉభయ దాతలుగా బుద్ధికి నారాయణప్ప, బండ్లపల్లి వెంకట జయప్రకాష్ ,అంబటి సతీష్ ,కట్ట భాగ్యమ్మ అండ్ సన్స్, అన్నం లక్ష్మీనారాయణ, నీలయ్య గారి పని కుమార్ కుటుంబ సభ్యులు, నాగ సుబ్బమ్మ అండ్ సన్స్, కోటం కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు, సుందరేషన్ వారి కుటుంబ సభ్యులు దాతలుగా వ్యవహరించారు. సాయంత్రం చంద్రప్రభ కు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉభయ దాతలుగా ఆర్.వెంకటేశ్వర ప్రసాద్, గుద్దిటి నారాయణప్ప, సౌందర్యలహరి ,సరసా దత్త మూర్తి వ్యవహరించారు.అనంతరం వీరి పేరిటన ప్రత్యేక పూజలు చేసి , వారిని చైర్మన్ ఘనంగా శాలువాతో సత్కరించారు. తదుపరి పట్టణ పురవీధుల గుండా ప్రత్యేకమైన వాహనంలో స్వామివారు ప్రజల దర్శనార్థం ఊరేగించారు. ఈ సందర్భంగా అన్నమయ్య సేవా మండలి అధ్యక్షులు పోరాల్ల పుల్లయ్య వారి శిష్య బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉభయ దాతలతో పాటు పట్టణ పుర ప్రముఖులు, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు