విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ : గోదావరి బాలోత్సవం ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల నుంచి పిల్లల పండుగను నిర్వహిస్తున్నామని, మూడవ పిల్లల పండుగను అక్టోబర్ 25,26 తేదీలలో నిర్వహిస్తున్నట్లు బాలోత్సవం ఆర్గనైజింగ్ సెక్రటరి తులసి అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ సందర్భంగా ఒక బ్రోచర్‌ను విడుదల చేస్తున్నామని, రాబోయే రోజుల్లో ప్రతీ స్కూలులో అదే బ్రోచర్ ను సంబంధిత ఉపాధ్యాయులు కొనసాగించాలన్నారు. స్థానిక ఎస్ కె విటి కళాశాలలో ఈ మూడవ పిల్లల పండుగను జరపాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. గతంలో మాదిరి ఈ ఏడాది కూడా ఈ వేడుకల్లో పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలుపుకుని దాదాపు పది వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని హైస్కూళ్ళను ఈ పండుగలో భాగస్వామ్యం చేయించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది గతం కంటే ఎక్కువ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పిల్లలు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొనేట్లు తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం అసోసియేట్ అధ్యక్షులు కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి డి. సాయిబాబా, బాలోత్సవం కార్యదర్శి వినోద్ కుమార్, ఉపాధ్యక్షులు నవీన కుమారి పాల్గొన్నారు.
అక్టోబర్ 25,26 లలో బాలోత్సవం ఆధ్వర్యంలో పిల్లల పండుగ
- Advertisement -
RELATED ARTICLES


