Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరగ్బీలో చిన్నహోతూరు మెరుపులు

రగ్బీలో చిన్నహోతూరు మెరుపులు

- Advertisement -

రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చిన్నహోతూరు విద్యార్థులు రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, పీఈటి ప్రభాకర్ తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఎస్జీఎఫ్‌ అండర్‌–14 విభాగంలో పి. మురారి, జయలక్ష్మి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని, అండర్‌–19 విభాగంలో సుమదీక్ష రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. అండర్‌–14 విభాగంలో ఎంపికైన పి. మురారి, జయలక్ష్మి ఈ నెల 9, 10, 11 తేదీల్లో అన్నమయ్య జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో పాల్గొననున్నారు. అండర్‌–19 విభాగంలో సుమదీక్ష ఈ నెల 8, 9, 10 తేదీల్లో కర్నూలు జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో పాల్గొననుంది. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లా, పాఠశాల, చిన్నహోతూరు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, పీడీ ప్రభాకర్‌ ఆకాంక్షించారు. విద్యార్థులను తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు