Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం–బత్తలపల్లి బస్సుల రూట్ మార్పు.. ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ

ధర్మవరం–బత్తలపల్లి బస్సుల రూట్ మార్పు.. ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో శివానగర్ ఓవర్‌బ్రిడ్జి పనుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గం..రూ.5 పెరగనున్న బస్సు ఛార్జీ పెరుగుతుందని ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
శివానగర్‌లో ఓవర్‌బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ధర్మవరం–బత్తలపల్లి మీదుగా రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సుల మార్గాన్ని ఆదివారం నుంచి అనగా అక్టోబర్ 4వ తేదీ నుంచి మార్చినట్లు వారి తెలిపారు. బస్సుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ధర్మవరం మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న రోడ్డు నుంచి సంఘం రోడ్డుకు వెళ్లి,అక్కడి నుంచి తిక్కస్వామి నగర్,టీటీడీ కల్యాణ మండపం మీదుగా శివానగర్‌కు చేరుకునే విధంగా కొత్త మార్గాన్ని నిర్ణయించడం జరిగిందన్నారు..ఈ మార్గంలో బస్సులు రాను,పోను రాకపోకలు సాగించనున్నాయి అని తెలిపారు.
కొత్త మార్గం వల్ల దాదాపు 2.50 కిలో మీటర్ల దూరం పెరిగే అవకాశం ఉండటంతో బస్సు ఛార్జీ కూడా రూ.5 మేర పెరగనున్నట్లు వారు తెలిపారు. ప్రయాణికులు మారిన బస్సు మార్గాన్ని గమనించి ఆర్టీసీ అధికారులకు సహకరించాలని వారి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు