విశాలాంధ్ర ధర్మవరం:: యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ శిక్షణ కార్యక్రమం పట్టణంలోని స్థానిక బిఎస్సార్ బాయ్స్ హై స్కూల్ నందు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సైకాలజీ సబ్జెక్ట్ నందు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించబడునని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి ,సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి , యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగేంద్రమ్మ తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 11వ తేదీ నుంచి స్పెషల్ టెట్ పేరుతో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్ పరీక్ష నందు ఉపాధ్యాయులందరూ ఉత్తీర్ణత కావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం పరుచుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం యూటీఎఫ్ పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుజింక హరికృష్ణ, రామాంజనేయులు, ధర్మవరం రూరల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంజనేయులు, వెంకట కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ శిక్షణ కార్యక్రమం..
- Advertisement -
RELATED ARTICLES


