విశాలాంధ్ర ధర్మవరం::స్థానిక రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఉపాధ్యాయుల సేవలను స్మరించుకుంటూ విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రిన్సిపాల్ కారణం హర్షవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల పట్ల గౌరవం, కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలని సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేసి, పలు కార్యక్రమాల ద్వారా తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను సన్మానించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జ్ రమేశ్ పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది.
ఘనంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES


