Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాకమ్యూనిస్టు పోరాట యోధుడు చలసాని వెంకటరత్నం

కమ్యూనిస్టు పోరాట యోధుడు చలసాని వెంకటరత్నం

- Advertisement -


జి.ఈశ్వరయ్య

విశాలాంధ్రవిజయవాడ: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి ఎర్రజెండతోనే సాధ్యమని నమ్మి తన తుదిశ్వాస వరకు కార్మిక పక్షపాతిగా నిలబడి దోపిడివర్గ నిర్మూలన కోసం పోరాడిన పోరాటయోడుడు చలసాని వెంకటరత్నం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. గురువారం నగరంలోని దాసరి భవన్ వద్ద పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన చలసాని వెంకటరత్నం 54వ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. . ఈ కార్యక్రమంలో ఈశ్వరయ్య ముఖ్య అతిధిగా హాజరై చలసాని వెంకటరత్నం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర కమ్యూనిస్టు పార్టీ తొలితరం నేత, అనేక రంగాలలో కార్మిక సంఘాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎర్రజెండను క్రింది స్థాయివర్గంలోకి తీసుకొని వెళ్లిన వారిలో చలసాని ప్రప్రథముడని కొనియాడారు. నాటి అసాంఘిక శక్తులకు ఎదురొడ్డి పేదల పక్షాన, కార్మికుల సంక్షేమానికి విశేషమైన సేవలు అందించి, అనేక ప్రాంతాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అని అన్నారు. దోపిడి వర్గానికి వ్యతిరేకంగా గుండాలకు, రౌడీల వ్యతిరేకంగా అనేక దాడులకు ఆయన నిలవడమే కాకుండా అనేక మంది యువకులను సమీకరించి సుశిక్షితులైన కమ్యూనిస్టు నాయకులుగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. వెంకటరత్నం లాంటి కమ్యూనిస్టు యోధుడు ఉంటే వారి ఆటలు,అక్రమాలు సాగవని భావించిన సంఘవిద్రోహ శక్తులు ఆయను తుడముటించేందుకు పధకరచన చేసి యాభైకి పైగా కత్తిపోట్లతో హతమారుస్తున్న తనదైన సోషలిస్టు భావాలను, కమ్యూనిస్టు జెండాను విడువక ప్రాణాలు అర్పించిన ధీరోదాత్తుడు అన్నారు. అనంతరం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ చేతుల మీదుగా పేద మహిళలకు చీరాల పంపిణి చేశారు. తొలుత ప్రజానాట్యమండలి నాయకులు ఆర్.పిచ్చయ్య, ఎస్.కె.నజీర్ అభ్యుదయ గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శులు లంక దుర్గారావు, నక్క వీరభద్రరావు, కార్యదర్శివర్గ సభ్యులు కె.వి.భాస్కరరావు, తాడి పైడయ్య, మూలి సాంబశివరావు, పంచదార్ల దుర్గంబ, అప్పురాబోతు రాము, కొట్టు రమణారావు, సంగుల పేరయ్య, కార్యవర్గ సభ్యులు తూనాం వీరయ్య, ఓర్సు భారతి, దోనేపూడి సూరిబాబు, ఏఐటీయూసీ నాయకులు కె.ఆర్.అంజనేయులు, బెవర శ్రీనివాసరావు, చీర్ల రామస్వామి, కృష్ణ, మన్యం సుబ్బయ్య, మహిళా సమాఖ్య నాయకులు నక్క రాజ్యలక్ష్మి, ఆర్.ఉమా, డి.రమణమ్మ, ఏఐవైఎఫ్ నాయకులు ఎస్.మోహన్, జి.అజయ్,ఎస్.రవి,ఏఐఎసఎఫ్ నాయకులు ఎం.సాయి కుమార్, దీపక్, రాజు, యస్వంత్ నగర పార్టీ నాయకులు కొండేటి శ్రీనివాసరావు, పడాల కనకారావు, ఏ.మోహన్, కాళ్ళ చిన్నప, కంచర్ల నాగేశ్వరరావు, జోసెఫ్, ఆర్. మైఖేల్, రాయన గుర్నాధం, మోకా దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు