జి.కోటేశ్వరరావు
విశాలాంధ్రవిజయవాడ: చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న చిరువ్యాపారులకు అధికారులు నష్టం కలిగించే చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు హెచ్చరించారు. కేదారేశ్వరరావు పేట రైతు బజార్ సమీపంలో ఉన్న వీధి విక్రయదారులకు ఏఐటీయూసీ, వీధి విక్రయదారుల సంఘం సంయుక్త సహకారంతో గురువారం కొత్త తోపుడు బళ్లను అంద చేశారు. చిరు వ్యాపారుల జీవనాధారమైన తోపుడు బళ్లను ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా పెట్టుకొనేందుకు నగర పాలక సంస్ధ అధికారులు అనుమతులు ఇచ్చారు.ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ వీధి విక్రయదారుల సమస్యలను టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులకు తెలియజేయాలని వారు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. చిరు వ్యాపారులకు సీపీఐ, ఏఐటీయూసీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర సహయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, ఏఐటీయూసీ నగర అధ్యక్షకార్యదర్శులు కె. ఆర్.ఆంజనేయులు, మూలీ సాంబశివరావు, పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యులు పంచదార్ల దుర్గాంబ, యక్కల కృష్ణా, కుమార్, సైదా, ఆయూబ్ తదితరులు పాల్గొన్నారు.


