Homeజిల్లాలుశ్రీకాకుళంఅసమానతల అంతానికి, హక్కుల సాధనకు నిత్యం పోరాడేది కమ్యూనిస్టులు

అసమానతల అంతానికి, హక్కుల సాధనకు నిత్యం పోరాడేది కమ్యూనిస్టులు

- Advertisement -
  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్
    విశాలాంధ్ర – శ్రీకాకుళం టౌన్: సమాజంలోని అసమానతలు, ప్రజల హక్కుల సాధనకు నిత్యం కమ్యూనిస్టులు పోరాడుతూనే ఉంటారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ అన్నారు. స్థానిక తెలగ సంక్షేమ సంఘం భవనంలో రెండు రోజులపాటు సిపిఐ సైదాంతిక, రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు. తొలి రోజు మంగళవారం సిపిఐ అరుణ పతాకాన్ని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చాపర సుందర్లాల్ ఆవిష్కరించారు. అనంతరం శిక్షణ తరగతుల్లో భాగంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకట రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డేగ ప్రభాకర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమం తో పాటు నేటి వరకు సిపిఐ దేశ ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిందని, ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ ముందుండి పోరాడుతుందన్నారు. కమ్యూనిస్టుగా సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుందని అది పోరాటాల ఫలితంగానే వస్తుందన్నారు. ఒకప్పుడు పాలకులను ఓటర్లు నిర్ణయించే వారిని, నేడు మోడీ మాత్రం తను ఓడిపోతానని భయంతో తనకు వ్యతిరేక వర్గాల ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు. సర్ పేరుతో 13 కోట్ల ఓట్లను తొలగించారని, మరో నాలుగు కోట్ల మందికి నోటీసులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తీరుపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను అనగదొక్కేందుకు మోడీ నిర్బంధాలకు పాల్పడుతున్నారని, మరి ఏ తప్పు చేయనప్పుడు వారికి భయం ఎందుకని ప్రశ్నించారు. దేశ అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం సిపిఐ ఎంతటి పోరాటాల కైనా సిద్ధంగా ఉందన్నారు. సిపిఐ సభ్యులు నాయకులు పార్టీ మరింత పటిష్టానికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పర్యటించి గడపగడపకు తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు కోరారు. అనంతరం మార్క్సిజం పై కమ్యూనిజం సంపాదకులు చలసాని వెంకట రామారావు సిపిఐ సభ్యులకు తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, ఏ ఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొండ శ్రీనివాస్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్ రవి, సిపిఐ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు