Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాజిల్లాలో తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

జిల్లాలో తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

- Advertisement -


క్లోరినేషన్ క్లీనింగ్ టెస్టులు సకాలంలో చేయండి

కలెక్టర్ జి. లక్ష్మీశ.
విశాలాంధ్ర`విజయవాడ: జిల్లా వ్యాప్తంగా రక్షిత తాగునీటి సరఫరా పై నిరంతర పర్యవేక్షణ చేయాలని క్లోరినేషన్ క్లీనింగ్ బైలాజికల్ టెస్టులు నిర్వహించిన అనంతరం మాత్రమే తాగునీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణ సురక్షిత మంచినీటి సరఫరా గ్రామీణ నీటి సరఫరా పథకాల పనుల ప్రగతి పై మంగళవారం ఆయన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యే శ్రద్ధ తీసుకోవాలని ఆర్డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్, మెడికల్ అండ్ హెల్త్, భూగర్భజల శాఖ, విద్యా, మహిళ శిశు సంక్షేమ తదితర శాఖాల అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలు, పాఠశాలలు, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు పంచాయతీలలో తాగునీటి టెస్టులకు సంబంధించిన తేది నివేదిక వివరాలను పొందుపరుస్తూ తప్పనిసరిగా డిస్ప్లే బోర్డులను ప్రదర్శించాలని ఆదేశించారు. జిల్లాలో తాగునీటి సరఫరా చేసేందుకు జలజీవన్ మీషన్ పథకం ద్వారా 534 పనులను మంజూరు కాగా వీటిలో 433 పనులు పూర్తి చేయడం జరిగిందని మరో 101 పనులు పూర్తి చేయవలసి ఉందని వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పనులు పూర్తి చేయడంలో అలసత్వం వహించే గుత్తేదారులు అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తాగునీటి సరఫరాలో సాంకేతిక సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఓ అండ్ ఎం) పెండింగ్ పనులను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని అవసరమైన చోట్ల మరమ్మతులు చేయడం, పైపులైన్ల లీకేజీలు వంటివి లేకుండా చూడటం, పంపు హౌస్, మోటార్లు సక్రమంగా పనిచేసేలా చూడటం వంటివాటిపై క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, గ్రామీణ నీటి సరఫరా ఎసఈ సిహెచ్ తిరుమల కుమార్, ఐసిడిసి పిడి షేక్ రుక్సానా సుల్తానా బేగం, జిల్లా వ్యవసాయ అధికారిణి డిఎంఎఫ్ విజయ కుమారి, డిఇవో చంద్రకళ, డిఎంహెచ్‌వో, డా. ఎం. సుహాసిని, డిపివో లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు