Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాతారకరామ ఎత్తిపోతల పథకంపై తీవ్ర నిర్లక్ష్యం

తారకరామ ఎత్తిపోతల పథకంపై తీవ్ర నిర్లక్ష్యం

- Advertisement -


రైతులు నష్టపోతున్న పట్టించుకోని ప్రభుత్వం

తక్షణమే రూ.5కోట్లు కేటాయించి నిర్వహణ పనులు చేపట్టాలి

రైతు సంఘాల నేతలు డిమాండ్

విశాలాంధ్రవిజయవాడ: వేలాది ఎకరాలకు సాగునీరు అందించే తారకరామ ఎత్తిపోతల పథకం గత 10సంవత్సరాల నుంచి ఎటువంటి మరమ్మతులు నోచుకోకపోవడం దారుణమని రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. అమరావతి రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ పథకం మరమత్తులకు, మెయింటినెన్స్ కు నిధులు లేవని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమని ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నం, జి.కొండూరు,విజయవాడ రూరల్ మండలాల్లో పలు గ్రామాల్లో పంటలకు నీరు అందించడానికి మోటార్లు, నిర్వహణ కోసం కేవలం రూ.5 కోట్లు ఖర్చు పెడితే 13500 ఎకరాల్లో ప్రతి ఏడాది రెండు పంటలు పండించుకోవచ్చుని ఈ పథకం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం అత్యంత దౌర్బగ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జి. కొండూరు మండలంలోని కవులూరు గ్రామంలో రైతునాయకులు చెరుకూరి శ్రీనివాసరావు ఇంటి దగ్గర తారకరామ ఎత్తిపోతల పథకం యొక్క ఆయకట్టు రైతులతో కౌలురైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు బుడ్డిరమేష్ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ ఎడమ,కుడి కాలువలపై ఏడు లిప్టులు ఉన్నాయని, వీటిలో ఉన్న మోటార్లు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల పంట పొలాలకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం లేని వాటికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, సంవత్సరానికి రెండు పంటలు పండించుకునే అవకాశం ఉన్న తారకరామ ఎత్తి పోతల పథకానికి కనీసం రూ. 5 కోట్లు కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటున్నారు. పోలవరం బనకచర్ల,పోలవరం మల్లయ్య సాగర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ముందుకు వస్తున్న కూటమి ప్రభుత్వం కొద్ది మొత్తం కూడా ఈ పథకానికి కేటాయించకపోవడం ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఎంత ప్రేమ ఉందో అర్ధం అవుతుందన్నారు. ఈ పథకం విస్తరణకు నిర్వహణకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని,మెయింటెనెన్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకుండా, ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యలమందారావు మాట్లాడుతూ ఎడమ కాలవ ప్రారంభం నుండి ముగింపు వరకు మధ్యలో గల గుర్రాల వాగు, తమ్ముడ్రు వాగు, తాడేపల్లి వాగుల నీరు వెళ్లడానికి ఏర్పాటు చేసిన తూములల్లో పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించాలని, నీరు సునాయాసంగా బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. కాల్వలు మొత్తం లైనింగ్ చేయాలని కోరారు. కౌలురైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెయ్యల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కుడి, ఎడమ కాలవలో ఉన్న తూడికాడ, కిక్కస, గుర్రపు డెక్క పిచ్చి చెట్లు తొలగించి ఏడాది పొడవునా రెండు పంటలు పండించుకోవడానికి నీరు అందించాలని కోరారు. ఈ సందర్భంగా తారకరామా ఎత్తిపోతల పథకం సమస్యలు వాటి పరిష్కారానికి పి.జమలయ్య వ్రాసిన బుక్లెట్ ను ఈ రైతు నేతలు ఆవిష్కరించారు.
తారకరామా ఎత్తిపోతల పథకం యొక్క లిప్టులలోని మోటార్ల మరమ్మతులు, నిర్వహణకు మరియు విస్తరణకు నిధులు కేటాయించి ఖర్చు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 2వ తేదీన విజయవాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయకట్టు రైతులతో సామూహికంగా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేయాలని ఈ సదస్సు ఎకగ్రీవంగా తీర్మానించారు. ఈ పథకం సమస్యల పరిష్కారానికి 17 మందితో పోరాట కమిటీని ఈ సదస్సు ఎన్నుకుంది. ఈ కమిటీకి కన్వీనర్ గా భోగినేని మురళీకృష్ణ, కన్వీనర్ గా ,చెరుకూరి శ్రీనివాసరావు ఎన్నుకోవడం జరిగింది. కమిటీ సభ్యులుగా దేవినేని రమేష్, చెరుకూరి కుటుంబరావు, ఈలప్రోలు వాసు, సమ్మెట శ్రీహరి, ఇస్లావత్ బుడ్డియ్య ,దనేకుల శ్రీను,దనేకుల వెంకటరావు, పజ్జూరు అంజయ్య, దుగ్యాల కొండారెడ్డి, జొన్నలగడ్డ సాంబయ్య,పెయ్యల భోగేశ్వరావు, పజ్జురు వెంకటరావు, పజ్జురు అనిల్ తదితరులతో కమిటీ ఏర్పడింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు