విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరం పట్టణంలో తాసిల్దార్ కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ, కార్మిక
సంఘం, మరియు ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు మూడవ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, ఏఐటీయూసీ నాయకులు ఎర్రం శెట్టి రమణ, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ మాట్లాడుతూ పట్టణంలోని 650-2 సర్వే నెంబర్ లో అనర్హులను తొలగించి, అర్హులైన ప్లంబర్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు. 650-2 సర్వే నెంబర్ లో ఆర్డీవో కార్మికుల సమస్యల పైన విచారణ పేరుతో కాలయాపున చేస్తున్నారే తప్ప, ఎటువంటి విచారణ చేపట్టకుండా కార్మికులను మభ్యపెట్టి ,వారి పొట్ట కొట్టే విధంగా అవలంబిస్తున్నారు అని మండిపడ్డారు.ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి అనర్హులైన వారి దొంగ పట్టాలను రద్దుచేసి, అర్హులైన కార్మికుల ఎవరైతే ఉన్నారో వారికి వెంటనే ఇళ్ల పట్టాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో కార్మికులకు న్యాయం జరగకపోతే రెవెన్యూ అధికారులు ను రోడ్డు మీదకు తీసుకొచ్చే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని భారతకమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, ఏఐటీయూసీ నాయకులు ఎర్రంశెట్టి రమణ, ప్లంబర్ అండ్ ఎలక్ట్రిషన్ కార్మిక సంఘం అధ్యక్షులు గోవిందరాజులు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, తాజుద్దీన్, రామకృష్ణ, రామసుబ్బయ్య, సురేంద్ర, నాగేంద్ర,చిన్న,జనార్దన్, ఆదినారాయణ, శ్రీనివాసులు,మహిళా సమైక్య నాయకురాలు, లలితమ్మ, తదితరులు పాల్గొన్నారు.
మూడవ రోజుకు చేరుకున్న సిపిఐ రిలే దీక్షలు
RELATED ARTICLES