- Advertisement -
- మహిళ దారుణ హత్య?
విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్): ఓ మహిళని ముక్కలు ముక్కలుగా చేసి మురుగు కాలువలో పడేశారు. ఈ దారుణం బుధవారం విజయవాడలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు… భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మసానినగర్ వెనుక ఉన్న మురుగు కలువలో ఓ మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం తల, కాళ్లు, చేతులు, నడుము భాగాలు కట్ చేసి ఉన్నాయి. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎవరో దారుణంగా హత్యచేసి మురుగు కాలువలో పడేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.


