Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఇసుక అక్రమ రవాణా పై ప్రత్యేక నిఘా

ఇసుక అక్రమ రవాణా పై ప్రత్యేక నిఘా

- Advertisement -

: ఆర్డీవో మహేష్

నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే భారీ జరిమానా తో పాటు కేసులు నమోదు చేస్తాం

పట్టు వదలని విక్రమార్కుడిలా ఆర్డీవో మహేష్ అక్రమ ఇసుక రవాణాపై దాడి

విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గంలో ఎక్కడ కూడా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే సహించేది లేదు అని, భారీ జరిమానా తో పాటు కేసులు నమోదు చేస్తామని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని బత్తలపల్లి లో పలు ప్రాంతంలో సోమవారం రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాల పై దాడి చేశారు. నియోజకవర్గంలోని సంబంధిత అధికారులు కూడా తప్పనిసరిగా రాత్రిపూట నిగా పెట్టి అక్రమ ఇసుక రవాణా వాహనాలపై దాడులు చేయాలని వారు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు కూడా ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి, నివారించాల్సిన బాధ్యత ఉంది అని తెలిపారు. ఇందులో భాగంగా 2 ట్రిప్పర్ వాహనాలు, రెండు ఇటాచ్ వాహనాలు బత్తలపల్లి. పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడైనా సరే అనుమతి లేని ఇసుక రవాణా జరుగుతున్నది అన్న సమాచారం తెలిసినవారు సంబంధిత అధికారులకు గాని, ఆర్డీవో గా నాకు గాని అందించాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేరును గోప్యంగా ఉంచుతామన్నారు. నియోజకవర్గంలో అక్రమ మార్గంలో అనగా రోడ్డు వైపున కాకుండా మరో దొంగ మార్గంలో వెళ్లే అక్రమ ఇసుక రవాణాను కూడా తప్పనిసరిగా అడ్డుకొని భారీ జరిమానా తో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు