Homeఆంధ్రప్రదేశ్దాల్ మిల్ సూరి అరెస్ట్..ఎస్పి సతీష్ కుమార్

దాల్ మిల్ సూరి అరెస్ట్..ఎస్పి సతీష్ కుమార్

- Advertisement -

వ్యాపారాల పేరుతో రైతులకు మోసం…జిల్లాల 26 కేసులు నమోదు

విశాలాంధ్ర పుట్టపర్తి:- వ్యాపార లావాదేవీల్లో పలు మోసాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న దాల్మిల్ సూరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ దాల్మిల్ సూరి పలు కేసుల లో నిందితుడుగా ఉన్న ట్లు ఎస్పీ వెల్లడించారు. దాల్ మిల్ సూరి పై శ్రీ సత్యసాయి జిల్లాలో 26 కేసులు,రాష్ట్రవ్యాప్తంగా మరో 26 కేసులు నమోదయ్యాయన్నారు .అదేవిధంగా ఒక ఆస్తి తగాదాకు సంబంధించి కొందరు వ్యక్తులపై దాడి చేసిన ఘటనలో 307 కేసు నమోదయిందన్నారు. అంతర్ రాష్ట్రాలలో కూడా ఆయన నేరాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. బియ్యం, ఆయిల్, సిమెంట్, పప్పు దినుసులు ఇలా పలు వ్యాపారాలు చేస్తూ మధ్య వ్యాపారులను, రైతులను గత కొన్ని సంవత్సరాలుగా మోసం చేస్తున్నట్లు తెలియజేశారు. సూరి తమ్ముడు పాండు కుటుంబ సభ్యులు కలిసి రైతులను మోసం చేసి దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ఆర్జించినట్లు తెలిపారు. ఇతను చేస్తున్న నేరాలను బట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ గా గుర్తించి పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు తెలిపారు. దీనిని సవాలు చేస్తూ దాల్మిల్ సూరి హైకోర్టులో పిటిషన్ వేస్తే ఇతని నేరాలను తీవ్రంగా పరిగణించిన కోర్టు ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసిందన్నారు. సూరి ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు జప్తు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఇటువంటి వ్యక్తులతో వ్యాపార లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి విజయ్ కుమార్, కొత్తచెరువు సీఐ మారుతి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు