- Advertisement -
విశాలాంధ్ర : చిలమత్తూరు… గత మూడు రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా బుధవారం ఉదయం పెనుగొండ రెవిన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ కుమార్ చిత్రావతి నదీ నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. గత మూడు రోజులపాటు వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ గ్రామాలలో అప్రమత్తంగా ఉండాలని నదీ తీర ప్రాంతాల దగ్గర జాగ్రత్తగా ఉండాలన్నారు . ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు డిప్యూటీ తహసిల్దార్ జగన్నాథ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు


