Homeజిల్లాలుఅనంతపురంపేదల ఇళ్లకు పట్టాలను వెంటనే ఇవ్వాలి.. సిపిఐ

పేదల ఇళ్లకు పట్టాలను వెంటనే ఇవ్వాలి.. సిపిఐ

- Advertisement -

విశాలాంధ్ర శింగనమల/అనంతపురం .. సిపిఐ శింగనమల నియోజకవర్గ కౌన్సిల్ సమావేశం అనంతపురం నీలం రాజశేఖర్ రెడ్డి భవనం లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ బుక్కరాయసముద్రం మండలకార్యదర్శి బండి రామకృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిపిఐ ఈ దేశం లో శత జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారని ముగింపు సభలు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో 5లక్షల మందితో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అలాగే సిపిఐ ఆధ్వర్యంలో రాబోవు రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపైన పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. బుక్కరాయసముద్రం మండలం లో ఉన్నటు వంటి వీరభద్ర కాలనీ, కేవీఎస్ నగర్, గిరి ప్రసాద్ నగర్, లో దాదాపు 1000 కుటుంబాలు గత 28 సంవత్సరాలుగా జీవిస్తున్నారు, ఆ కాలనీలకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని లేని పక్షంలో ఆ కాలనీల ప్రజలను కలుపుకొని సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. శింగనమల నియోజకవర్గం లోని ఆరు మండలాలలో సిపిఐ బలోపేతానికి నాయకులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో సిపిఐ పార్టీ కి పట్టున్న అన్ని గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని దానికి సంబంధించిన కార్యక్రమాలని రూపొందించుకోవాలని పార్టీ నాయకులకి దిశ నిర్దేశం చేశారు. బూర్జువా పార్టీలకు గట్టి పోటీని ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టీ.నారాయణస్వామి, సహాయ కార్యదర్శి చెనప్ప యాదవ్ , మండల కార్యదర్శులు పెద్దయ్య, రాముడు ,మధు యాదవ్, నాగార్జున, ప్రజా సంఘాల నాయకులు,హరికృష్ణ, టీవీ రామాంజనేయులు, శ్రీనాథ్ చౌదరి, శ్రీనివాసులు, బుక్కరాయసముద్రం మండల సహాయ కార్యదర్శి ఆనంద్ కుమార్, కౌన్సిల్ సభ్యులు లక్ష్మీదేవి, సుంకన్న, సర్దాo, శీనా ,రామాంజనేయులు , చిన్న తిరుపతయ్య, పెద్ద తిరుపతయ్య,వన్నూరు స్వామి, భాస్కర్,లక్ష్మీ నారాయణ, మహదేవ్, విజయ్, అంజనమ్మ, శివమ్మ, మధు, కుళ్ళాయమ్మ, హాజిబీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు