విశాలాంధ్ర -రాయదుర్గం: కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులలో అత్యవసర చికిత్స చేయించుకున్న పలువురికి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు బుధవారం రాయదుర్గంలోని తన స్వగృహంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులు పంపిణీ చేశారు. కనేకల్ కు చెందిన ఫక్రుమ బీ రెండు లక్షల పన్నెండు వేల రెండు వందల పదమూడు రూపాయలు, కదిరంపల్లికి చెందిన తగ్గుపర్తి భానుకు రెండు లక్షల రూపాయలు ,కణేకల్ టౌన్ కు చెందిన పద్మావతి కుటుంబాలకు ఇరవై వేల రూపాయలు చొప్పున అందచేశారు. పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆపరేషన్లు చేయించుకొన్నవారు అవసరమైన బిల్లులు సకాలంలో సమర్పిస్తే ఆర్థిక సహాయం అందించే ప్రయత్నం చేస్తానని ఆయన సూచించారు.


