– అధిక లోడ్ వల్లే అధిక ప్రమాదాలు
విశాలాంధ్ర – సీతానగరం: ప్రధాన రహదారి పై ఇసుక మేటలతో పొంచి ఉన్న పెను ప్రమాదాలు. సీతానగరం, రాజమహేంద్రవరం ప్రధాన రహదారి 12 కిలోమీటర్ల మేరా సి సి రోడ్డు నిర్మాణం పూర్తి అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రఘుదేవపురం, మునికూడలి, కాటవరం, రాజంపేట గ్రామాల్లో ఉన్న ఇసుక నిల్వ కేంద్రాల నుండి గత కొద్ది రోజులుగా పెద్ద పెద్ద లారీలతో పరిమితికి మించి ఇసుక లోడ్ తో రవాణా జరుగుతుంది కానీ ఈ రవాణాలో కొంత మంది లారీల డ్రైవర్లు ఇసుక పై భారకాలను వేయడం లేదు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ అధిక లోడ్ వల్ల భారకాలను వేసిన సి సి రోడ్డు పై మలుపులో ఇసుక జారుతుంది. ఈ జారిన ఇసుక మేటలుగా ఏర్పడి ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి అని వాహన దారులు ఆరోపిస్తున్నారు. ఈ అధిక లోడ్లను సంబంధిత శాఖ అధికారులు అరికట్టి రోడ్డు పై ఇసుక పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే రోడ్డు పై ఉన్న ఇసుక మేటలను త్వరితగతిన తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోకుండానే అధికారులు ఈ సమస్యల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


