విశాలాంధ్ర – కొవ్వూరు మారుతున్న ఆహారపు అలవాట్ల వలన ప్రజలు అనారోగ్యాలు బారిన పడుతున్నారని, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి అన్నారు మంగళవారం కొవ్వూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వస్థ నారి ససక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతోపాటు ఉచిత మందులను పంపిణీ చేసి పౌష్టిక ఆహార కిట్ ను అందించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ భావన రత్నకుమారి మాట్లాడుతూ స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్థనారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యం గా ఉండాలని లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వ్యాధులకు వైద్యం చేయడం జరుగుతుందన్నారు . మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సూరపనేని చిన్ని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య విధానాల్లో మార్పులు తీసుకొస్తూ సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలని సంకల్పంతో అన్ని రకాల వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు 60 రకాల వ్యాధులకు పరీక్షలను నిర్మించడంతోపాటు ఆసుపత్రులను ఆధునీకరణ చేయడం జరుగుతుందన్నారు. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిని చేయడం కోసం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిల ఆకర్షణకు గురై ప్రజలు ప్రభుత్వాసుపత్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలనే సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యం పై దృష్టి సారించడం జరిగిందని ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సుసురపనేని చిన్ని ఆసుపత్రులు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ ఎం పద్మ, డిప్యూటీ డిఎంహెచ్వో జె సంధ్య ఫిజీషియన్ డాక్టర్ కె శారద, సర్జన్ డాక్టర్ ఎం కోటేశ్వరి, సూపరిండెంట్ ఎన్ రాజేంద్రప్రసాద్, తదితర డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు
మహిళలకు మరింత ఆరోగ్యం
- Advertisement -
RELATED ARTICLES


