విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండలంలో అన్ని ప్రధాన గ్రామాలలో గల శివాలయాలలో కార్తీక సోమవారం పర్వదినం పురస్కరించుకొని తెల్లవారి జాము నుండి భక్తులు బారులు బారులు తీరి దైవ దర్శనం చేసుకున్నారు కార్తీకమాసం సోమవారం రోజున శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు తెల్లవారుజాము నుండి అభిషేకాలు ప్రత్యేక పూజలు పాల్గొన్నారు దేవరపల్లి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు ముఖ్యంగా చెరువులలో కార్తీక దీపాలు అరటి డొప్పలపై పెట్టి నీటిలో వదిలారు కార్తీక సోమవారం రోజున నెయ్య లేదా నువ్వులతో దీపాలు వెలిగిస్తే సమస్త పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం ఈ సందర్భంగా దేవరపల్లి మండలంలో అన్ని ప్రధాన శివాలయాలలో భక్తులు ఆలయ ప్రాంగణాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీకదీపం లు వెలిగించారు దేవరపల్లి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య ధ్యాన మందిరం పల్లంట్లలో శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం లక్ష్మీపురం కురుకూరు ఎర్నగూడెం చిన్నాయగూడెం యాదవోలు గౌరీపట్నం త్యాజంపూడి రామన్నపాలెం కృష్ణపాలెం గ్రామాలలో గల శివాలయాలలో కార్తీక సోమవారం శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా ఆలయ పురోహితులు అర్చకులు కార్తీక సోమవారం విశిష్టత గురించి వివరించారు
భక్తులు బారులు
- Advertisement -
RELATED ARTICLES


